ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 31, 2022, 11:00 AM IST

  • పూజకు కొలువుదీరిన ఖైరతాబాద్‌ గణేశ్‌

Khairtabad Ganesh 2022 : హైదరాబాద్​లోని ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీ పంచముఖ లక్ష్మి మహా గణపతి రూపంలో గణనాథుడు భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. మొట్టమొదటి సారిగా మట్టి వినాయకుడిని ఆకర్షణీయంగా రూపొందించారు. స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తోన్న నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

  • ఘనంగా గణేశ్​ చతుర్థి.. గాజుసీసాలో చిన్ని గణపతి

విభిన్నమైన రూపాల్లో కనిపిస్తూ సందడి చేసే గణనాథులు.. పచ్చతోరణాలు, రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో తళుక్కుమనే వినాయక మండపాలు.. సాయంత్రం వేళ అక్కడ జరిగే వేడుకలు.. వినాయక చవితి పండగ పేరెత్తగానే గుర్తొచ్చే జ్ఞాపకాలెన్నో. అవన్నీ నిజాలై సాక్ష్యాత్కరించే పండుగ రోజులు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు మొదలయ్యాయి.

  • పుష్ప, ఆర్​ఆర్​ఆర్​ మేనియా.. గణపయ్య ఇక తగ్గేదే లే

Pushpa RRR Ganesh idols దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా గణనాథులు కొలువుదీరుతున్నారు. సాధరణంగా ఈ పండగ అంటేనే వివిధ రకాల ఆకృతుల్లో గణేష్​ ప్రతిమలు మార్కెట్​లో దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని సినిమాల్లోని హీరోల పాత్రల పోలీకలతోనూ ఉంటాయి. ఇప్పటికే గతంలో గబ్బర్‌సింగ్, బాహుబలి, స్పైడర్‌మ్యాన్, అవెంజర్స్ వంటి గణేష్ ప్రతిమలు మార్కెట్లో కనువిందు చేయగా... తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘'పుష్ప', ఆర్​ఆర్​ఆర్​ రామ్​చరణ్​ అల్లూరి సీతారామారాజు లుక్​లో ఉన్న గణనాథులు మార్కెట్లోకి వచ్చేశారు.

  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Corona Cases in India : భారత్​లో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి 45 మంది బలయ్యారు. ఒక్కరోజులో 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • పండుగ పూట విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి

Mother and Daughter died in Mancherial : పండుగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

  • విద్యుత్తు బకాయిలపై మీ ఉత్తర్వులు సరికాదు

Telangana letter to central government : ఏపీకీ 30రోజుల్లో విద్యుత్​ బకాయిలు చెల్లించాలని కేంద్ర విద్యుత్​ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అసంతృప్తిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించుకుంది. ఏపీ నుంచి తమకు రావాల్సిన బకాయిలను చెల్లించకుండా ఈ వైఖరి ఏంటీ అని ప్రశ్నించింది.

  • నాన్నా.. అమ్మ ఎక్కడికెళ్లింది

Ibrahimpatnam Incident News : అందరివీ పేద కుటుంబాలే.. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు.. ఒకరికి ఉండటానికి సొంతిల్లు లేదు.. మరో కుటుంబంలో ఆ మహిళ కూలీపని చేస్తేనే ఇల్లు గడుస్తుంది.. అందరికీ చిన్న పిల్లలున్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేక.. ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అదే వారికి శాపమైంది.

  • మానవ అక్రమ రవాణాలో తెలంగాణ మొదటి స్థానం

Human trafficking in Telangana : మానవ అక్రమ రవాణా కేసులు రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. బంగ్లాదేశ్​ నుంచి అమ్మాయిలను అక్రమ మార్గంలో హైదరాబాద్​కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దించుతున్నారు. ఈ గణాంకాలు అన్నీ జాతీయ నేరగణాంక సంస్థ తాజాగా విడుదల చేసింది.

  • ఆ ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానన్న నటుడు సుమన్‌

Actor Suman Health Condition తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ తెలిపారు. ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్నిరోజుల నుంచి వస్తోన్న వార్తలపై ఆయన తాజాగా స్పందించారు.

  • రషీద్​ రికార్డ్​.. సూపర్​-4లో అఫ్గాన్​

Rashid Khan Vs Bangladesh : అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తుల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు అఫ్గానిస్థాన్​ స్ఫిన్నర్​ రషీద్​ ఖాన్​. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్​లో అతను ఈ ఘనత సాధించాడు. స్పిన్నర్లు చెలరేగడంతో.. బంగ్లాదేశ్​ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్​ సూపర్​-4లో ప్రవేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.