ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 11AM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 29, 2022, 10:59 AM IST

  • బుల్​బుల్​ పిట్టపై కూర్చుని జైలు నుంచి సావర్కర్ మాయం

హిందూ మహాసభ నాయకుడు వీడీ సావర్కర్​పై 8వ తరగతి పుస్తకంలో కొత్తగా చేర్చిన పాఠం కర్ణాటకలో వివాదాస్పదమైంది. జైలులో బంధీగా ఉన్న సావర్కర్, బుల్​బుల్​ పిట్ట రెక్కలపై కూర్చుని బయటకు వెళ్లేవారని అందులో ఉండడం చర్చనీయాంశమైంది.

  • పెళ్లికి నో చెప్పాడని ప్రియుడిని చున్నీతో హత్య

ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలు, భార్యతో పాటు కన్నతల్లిని కిరాతకంగా హత్య చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్​ చేశారు. ఉత్తరాఖండ్​లోని డోయ్​వాలాలో జరిగిందీ ఘటన. మరోవైపు, మహారాష్టలోని పెళ్లి నిరాకరించడానికి ఆటోడ్రైవర్​ను ఓ మహిళ తన చున్నీతో గొంతు నులిపి చంపేసింది.

  • భారత్​లో మరింత తగ్గిన కరోనా కేసులు

Corona Cases in India భారత్​లో కొత్తగా 7,591 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • వికటించిన కుని ఆపరేషన్, ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో 27 మంది మహిళలకు ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం ఆందోళనకు గురి చేసింది.

  • నేరాల నియంత్రణకు పోలీసుల అస్త్రం, పీడీ చట్టం

PD Act in telangana రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పోలీసులు పీడీ చట్టాన్ని ఓ అస్త్రంలా వినియోగిస్తున్నారు. రౌడీలు, గుండాలు, గొలుసు దొంగలు, జూద గృహ నిర్వాహకులు, నకిలీ విత్తనాల తయారీదారులు, సైబర్‌ నేరస్థులు ఇలా ఒకరేమిటి వ్యవస్థీకృతంగా నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ వదలకుండా ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి ఇది పాత చట్టమే అయినా వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు పోలీసులు దీనిని ఆయుధంగా మార్చుకున్నారు.

  • డిసెంబరు తొలి వారానికి సచివాలయం సిద్ధం

Telangana New Secretariat Inauguration సచివాలయ పనులు ఇంకా పూర్తికానందున విజయదశమికి పూర్తి అవుతుందనుకున్న నిర్మాణాలు ఇంకా నాలుగు నెలలు ఆలస్యం కావస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి డిసెంబరు మెుదటి వారానికి పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • ప్రధాని మెచ్చిన మంగ్త్యా వాల్య తండా

PM Modi praises Mangtya Walya Tanda వరంగల్‌ జిల్లాలో ఓ గ్రామానికి ప్రధానమంత్రి ప్రశంసలు దక్కాయి. కేంద్రం తీసుకొచ్చిన అమృత్‌ సరోవర్‌ అభియాన్‌లో భాగంగా మంగ్త్యావాల్య తండాలో నీటికుంట అభివృద్ధి చేయటాన్ని మోదీ అభినందించారు. గ్రామస్థులు ప్రత్యేక చొరవ తీసుకోవటాన్ని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

  • భారీగా తగ్గిన బంగారం ధర, ఏపీ తెలంగాణలో ఎంతంటే

Gold Rate Today దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock market today India : అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో భారతీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 950 పాయింట్లు తగ్గి 57వేల 875 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 290 పాయింట్లు క్షీణించి 17వేల 270 వద్ద కొనసాగుతోంది.

  • నాగార్జునకు ఆ తేదీ అంటే వెరీ స్పెషల్​

'శివ'గా సైకిల్‌ చైన్‌ తెంచి, టాలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించారు. 'అభిరామ్‌'గా అమ్మాయిలపై అసహ్యం వ్యక్తం చేస్తూ నవ్వులు పంచారు. 'ప్రకాశ్‌'గా ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. 'గణేశ్‌'గా 'మాస్‌' అనే పదానికి అసలైన అర్థమిచ్చారు. అలాంటి ఆయన 'అన్నమాచార్య', 'కంచెర్ల గోపన్న', 'శిరిడి సాయి'గా కనిపించి ఔరా అనిపించారు. సుమారు 36 ఏళ్లుగా విభిన్న పాత్రలతో సాహసాలు చేస్తున్న ఆ 'కింగ్‌' ఎవరో కాదు అక్కినేని నాగార్జున. సోమవారం 63వ పుట్టిన రోజు వేడుక జరుపుకొంటున్న సందర్భంగా ఈ 'గ్రీకువీరుడు' గురించి కొన్ని విశేషాలు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.