ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 7AM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 25, 2022, 7:01 AM IST

  • పది మంది ఎమ్మెల్సీలు నేరచరితులు

TRS MLCs Criminal Record తెలంగాణ శాసనమండలిలో పది మంది ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ వెల్లడించింది. అందులో ఆరుగురిపై తీవ్రమైన అభియోగాలున్నాయని, వారంతా తెరాసకు చెందినవారేనని తెలిపింది. మండలిలోని 40 మంది ఎమ్మెల్సీల్లో 33 మంది నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వారిపై ఉన్న కేసులు, ఆస్తులు, విద్యార్హత తదితర వివరాలతో కూడిన నివేదికను ఏడీఆర్‌ తాజాగా విడుదల చేసింది.

  • మునుగోడు అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులేస్తోన్న హస్తం

Munugode Congress Candidate మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రజాదరణ, పార్టీ విధేయత కలిగి గెలిచేందుకు అవకాశమున్న వ్యక్తినే అభ్యర్థిగా ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. రాజకీయ అనుభవం శాస్త్రీయబద్ధమైన సర్వేల ఆధారంగా అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని నేతలు అభిప్రాయపడుతున్నారు.

  • భారత్‌ యూరియా భారత్‌ డీఏపీ

One Nation One Fertilizer వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వానిదే ప్రధాన పాత్ర అని రైతులకు సులభంగా చెప్పేలా కేంద్రం రెండు కొత్త పథకాలను తాజాగా అమల్లోకి తెచ్చింది. ఒక దేశం.. ఒకటే ఎరువు అనే నినాదాన్ని తీసుకువచ్చింది. ఇకపై ఎరువులన్నింటికీ ఒకటే బ్రాండు ఉంటుంది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.

  • పోలీసుశాఖలో త్వరలోనే కొత్త జోనల్‌ వ్యవస్థ

New zonal system in TS police department రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న కొత్త జోన్ల దస్త్రానికి త్వరలోనే ఆమోదం లభించనుంది. ఫలితంగా పోలీసుశాఖలో కొత్త జోన్ల కల సాకారం కాబోతోంది. ఈ కొత్త జోన్లు అమల్లోకి వస్తే రాష్ట్ర పోలీసుశాఖలో అంతర్గత పరిపాలనకు సంబంధించి కొత్త శకం మొదలవుతుందని భావిస్తున్నారు.

  • దేశంలోనే ఎత్తైన ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధం

నోయిడాలో అక్రమంగా నిర్మితమైన వంద మీటర్ల పొడవైన జంటటవర్ల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించనున్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన జంట టవర్లను పేల్చివేత టెక్నిక్‌ ద్వారా కూల్చివేయటం ఇదే మొదటిసారి. అయితే ఈ జంట టవర్ల చుట్టుపక్కల ఉంటున్న నివాస సముదాయాల వారిలో ఒకింత సంతోషం,మరొకింత ఆందోళన కనిపిస్తోంది.

  • ఉచితాలపై ఏకాభిప్రాయం కావాలన్న సుప్రీంకోర్టు

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచితాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాలపై ఏకాభిప్రాయం అవసరం అని తెలిపింది.

  • షింజో అబె అధికారిక వీడ్కోలు కోసం జపాన్‌ వెళ్లనున్న మోదీ

హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబె అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకానున్నారు భారత ప్రధాని మోదీ. సెప్టెంబర్ 27న జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

  • బ్యాంకు బంపర్ ఆఫర్.. ఫోన్ కొనుక్కునేందుకు రూ.2లక్షల అలవెన్సు

ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తమ బ్యాంక్​లో అత్యున్నత స్థాయి సిబ్బందికి వర్తింపజేస్తున్న.. సంక్షేమ ప్రయోజనాల నిబంధనలను సవరించింది. వారికి భారీగా అలవెన్సులు ఇస్తూ వార్తల్లో నిలిచింది.

  • గిల్‌ 45 స్థానాలు జంప్.. టెస్టుల్లో టాప్‌ 10లో రోహిత్​, పంత్​

సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏకంగా 45 స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ అయిదో స్థానాన్ని నిలబెట్టుకోగా, టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్‌ శర్మ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

  • ఈ నటుడెవరో గుర్తుపట్టుకోండి చూద్దాం

ప్రముఖ బాలీవుడ్​ నటుడు నటించిన ఓ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ నెట్టింట వైరల్​గా మారింది. అందులో ఉన్నది అతడేనా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.