ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 7AM - telangana latest news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 23, 2022, 7:02 AM IST

Updated : Aug 23, 2022, 7:16 AM IST

  • నేడు తెలుగు రాష్ట్రాలతో కృష్ణా బోర్డు సమావేశం

KRMB committee Meeting కృష్ణా జలాల విడుదల, జల విద్యుదుత్పత్తిపై చర్చించేందుకు కేఆర్‌ఎంబీ జలాశయాల పర్యవేక్షణ కమిటీలు నేడు సమావేశం కానున్నాయి. రూల్ కర్వ్స్, వరద జలాల అంశాలపై సైతం చర్చించేందుకు కమిటీలు పూనుకున్నాయి. తెలంగాణ, ఏపీ అధికారులకు బోర్డు వర్గాలు సమాచారమిచ్చాయి. ఈ సమావేశంలో ఇతర సభ్యులు పాల్గొనున్నారు.

  • 893 మంది స్పెషలిస్టు వైద్యులకు పోస్టింగ్‌

Posting for Specialist Doctors రాష్ట్రంలో 893 మంది స్పెషలిస్టు వైద్యులకు ఈరోజు నుంచి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఏడాది పాటు తప్పనిసరి సేవల నిబంధన కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియమిస్తారు.

  • ఎంసెట్‌ ఐచ్ఛికాల నమోదుపై ఈసారీ సస్పెన్స్‌

Suspense on TS EAMCET Options రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ ధ్రువపత్రాల పరిశీలన మొదలైనా ఆప్షన్ల నమోదు ఇంకా షురూ అవ్వలేదు. ఈసారి కూడా ఐచ్చికాల నమోదుపై చివరి క్షణం వరకు సస్పెన్స్ తప్పడం లేదు. ఐచ్ఛికాల నమోదుకు కనీసం ఒక రోజు ముందు కూడా కళాశాలలు, సీట్లపై జేఎన్‌టీయూహెచ్‌ సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

  • ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసే కుటిల ప్రయత్నాలు

దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసే కుటిల ప్రయత్నాలను చూస్తూ మేథావులు మౌనం వహించరాదని సీఎం కేసీఆర్‌ సూచించారు. దేశం సరైన రీతిలో పురోగమించేలా సక్రమరీతిలో ప్రయాణించేలా వైతాళికులు కరదీపికలుగా మారాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

  • మునుగోడు ప్రచారంతో నాకేం సంబంధం

Komatireddy letter to Sonia Gandhi రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సోనియాగాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లేఖ రాశారు. పీసీసీ రేవంత్ తీరుపై లేఖలో ఆయన ప్రస్తావించారు. నియోజకవర్గంలో తనకు ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

  • చుట్టంగా వచ్చి ముగ్గురిని కిరాతకంగా చంపిన వ్యక్తి, ఆపై రక్తపు మడుగులో కూర్చొని

ఆశ్రయమిచ్చిన వారినే కడతేర్చాడు ఓ వ్యక్తి. నిద్రలో ఉన్న ముగ్గురిని మద్యం మత్తులో అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై రక్తపు మడులో కూర్చున్నాడు. ఝార్ఖండ్​లోని ఖుంటీ జిల్లాలో జరిగిందీ ఘటన.

  • మతిమరుపు రావడానికి కారణాలేంటో తెలుసా

Forgetful Disease సాధారణంగా చాలా మంది ఎప్పుడూ ఏదో ఒకటి మరిచిపోతుంటారు. మళ్లీ కాసేపటికే గుర్తు తెచ్చుకుంటారు. అది మామూలు విషయమే కానీ అసలు మతిమరుపు ఎందుకొస్తుంది. కారణాలేంటి.

  • సంక్షోభంలో చైనా, తగ్గిస్తున్న వడ్డీ రేట్లు, భారత్​కు కలిసొచ్చేనా

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన భయాలు అలుముకుంటున్న వేళ చైనా నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ కీలక వడ్డీ రేట్లను పెంచుతుండగా డ్రాగన్‌ మాత్రం తగ్గిస్తోంది. వడ్డీరేట్ల తగ్గింపుతో సంక్షోభంలో కూరుకుపోయిన స్థిరాస్తి రంగానికి చైనా ఊతమిస్తోంది. రెండో దశ కొవిడ్‌ విజృంభణతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది.

  • మొబైల్‌ కొనాలనుకుంటున్నారా, త్వరలో ధరలు పెరిగే ఛాన్స్‌

మన దేశంలో దాదాపు చైనాకు చెందిన కంపెనీల స్మార్ట్​ఫోన్లే ఎక్కువగా విక్రయమవుతున్నాయి. కంపెనీలు పొరుగు దేశానికి చెందినప్పటికీ భారతలోనే తయారు చేసి వీటిని విక్రయిస్తున్నాయి. ఆయా కంపెనీలు విడిభాగాలను మాత్రం ఇప్పటికీ చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. తాజాగా వాటిపై కస్టమ్స్‌ ట్యాక్స్​ విధిస్తున్నట్లు సీబీఐసీ ప్రకటించింది. దీంతో కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై వేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరగనున్నాయి.

  • గాడ్​ఫాదర్​ మెగాస్టార్​ మాత్రమే చేయగలరు

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గాడ్​ఫాదర్​. మోహన్​రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. గాడ్​ఫాదర్​ లాంటి కథను ఇండియాలో కేవలం నలుగురైదుగురు నటులు మాత్రమే చేయగలరని ఆయన అన్నారు. ఇంకేమన్నారంటే.

Last Updated : Aug 23, 2022, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.