ETV Bharat / city

9AM టాప్​న్యూస్ - topnews in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9AM TOPNEWS
9AM TOPNEWS
author img

By

Published : Aug 14, 2022, 9:00 AM IST

  • 1947 నుంచి ఇప్పటివరకు స్వేచ్ఛాభారతంలో ఎన్ని మార్పులో

డెబ్భై ఐదేళ్ల స్వేచ్ఛాభారతం మనది. ఈ స్వేచ్ఛ విలువనీ అది సాధించిన ప్రగతినీ అర్థం చేసుకోవాలంటే దాన్ని పోగొట్టుకున్ననాటి పరిస్థితి ఏమిటో తెలియాలి. భారతదేశాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయని చదువుకున్నాం. ఎక్కడ, ఎప్పుడు, ఏ వంశం అధికారంలో ఉన్నా అన్ని రాజ్యాలూ అంతిమంగా ప్రజాశ్రేయస్సుకీ స్వాతంత్య్రానికీ విలువ ఇచ్చాయి.

  • నల్గొండ జిల్లాలో సర్పంచి భర్త దారుణ హత్య

నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం సర్పంచి భర్త విజయ్‌రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇంటికి వెళ్తుండగా అడ్డగించి కత్తులు, గొడ్డళ్లతో కిరాతంగా హత్య చేశారు. రాజకీయ కక్షతోనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య సంధ్య ఆరోపించారు. విజయ్‌రెడ్డి హత్య వెనుక ఎవరున్నారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

  • కోటపల్లి అడవుల్లో పులి సంచారం, పశువులపై దాడి

చెన్నూరు అటవీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కొత్త పులి రాక కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా పశువులను హతమారుస్తూ హల్​చల్ చేస్తోంది. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

  • తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ, ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సర్వదర్శనం క్యూలైన్‌ గోగర్భం జలాశయం వరకు ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 20వరకు ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది.

  • ఎడతెగని నిరీక్షణ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీ

రైళ్లు ఎక్కేందుకు లక్షల మంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ శాఖ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. వెయిటింగ్‌ లిస్టుకు అనుగుణంగా అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాటుచేయకుండా ప్రయాణ సమయం వరకు ఊరిస్తూ ఆఖర్లో ఉసూరుమనిపిస్తోంది.

  • భవిష్యత్​లో టెస్టు క్రికెట్‌ ఆడేవాళ్లు అసలు ఉంటారా

టీ20 క్రికెట్‌ విపరీతంగా పెరగడం వల్ల టెస్టు క్రికెట్‌కు నష్టం వాటిల్లుతోందని ఆసీస్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌ బోర్డులు సంక్షోభంలో ఉండడం వల్ల కూడా ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20లు ఆడేందుకు మొగ్గుచూపుతున్నారని చెప్పాడు. భవిష్యత్​లో టెస్టు క్రికెట్ ఆడేది ఎవరంటూ ప్రశ్నించాడు.

  • భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనా నిఘా నౌకకు శ్రీలంక గ్రీన్​సిగ్నల్

చైనా పరిశోధక నౌక యువాన్‌ వాంగ్‌కు అనుమతిస్తూ శ్రీలంక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. భారత్‌ తీవ్ర అభ్యంతరాలు తెలిపినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ అనుమతులు జారీ చేసింది లంక.

  • శుక్రకణం అండం లేకుండా మూలకణాలతో కృత్రిమ పిండం

భవిష్యత్తులో ఎన్నో పరిణామాలకు కీలకంగా మారే పరిశోధన విషయంలో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. మూలకణాలను ఉపయోగించి పిండోత్పత్తి చేశారు. ఈ సాంకేతికత మున్ముందు పూర్తిగా అభివృద్ధి చెందితే ఒక వ్యక్తి చర్మకణం నుంచి అవయవాలను సృష్టించడానికి, కృత్రిమ పిండం అభివృద్ధికి వీలవుతుందని శాస్త్రవేత్తలు విశ్వాసంతో ఉన్నారు.

  • షారుక్​ ఖాన్​కు ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి

బాలీవుడ్​లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న డార్లింగ్స్​ను తెలుగు భాషలో రీమేక్​ చేయనునన్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు షారుక్​ ఖాన్ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడీ విషయాన్ని విజయ్‌ సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి.

  • దృశ్యం సిరీస్​లో చివరి సినిమా పోస్టర్ రిలీజ్​

ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన దృశ్యం చిత్ర కథకి ముగింపుగా మూడో భాగం సిద్ధమవుతోంది. త్వరలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు పోస్టర్‌ ద్వారా సినీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బుజ్జీ.. ఇలా రా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.