ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 9, 2022, 1:00 PM IST

  • వెంటనే 50 లక్షల కొవిషీల్డ్ డోసులు పంపండి : కేంద్రానికి హరీశ్​ లేఖ

Harish Rao Letter To Union Minister : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుక్​ మాండవీయకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ప్రికాషనరీ డోసులు ఇస్తున్న నేపథ్యంలో.. డిమాండ్​కి తగినమొత్తంలో కొవిడ్ టీకా డోసులు అందుబాటులో లేవని తెలిపారు. రాష్ట్రానికి తక్షణమే 50 లక్షల కొవిషీల్డ్ టీకాలు పంపాలని కోరారు.

  • బిహార్​ రాజకీయంలో కీలక ట్విస్ట్.. గవర్నర్ వద్దకు నితీశ్!

బిహార్​లో ప్రభుత్వం మార్పు తథ్యమన్న ఊహాగానాల మధ్య మరో కీలక పరిణామం జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్ అపాయింట్​మెంట్ కోరింది జేడీయూ.

  • నితీశ్​ ప్లాన్​కు భాజపా కౌంటర్.. ఆ ఎమ్మెల్యేలపై వేటు

JDU BJP alliance breakup: బిహార్​లో జేడీయూ ప్రణాళికలకు భాజపా కౌంటర్ వ్యూహాలు రచిస్తోంది. ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. కమలదళం అలర్ట్ అయింది. ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు పడేలా పావులు కదుపుతోంది.

  • 'మహా' కేబినెట్ విస్తరణ.. 18 మందికి ఛాన్స్

మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ శిందే తన కేబినెట్​ను విస్తరించారు. 18 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. భాజపా, శివసేన నుంచి తొమ్మిది మంది చొప్పున మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

  • వరదలో కొట్టుకుపోయిన ట్రాక్టర్- ఐదుగురు గల్లంతు

వాగు దాటుతుండగా నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి ట్రాక్టర్​ కొట్టుకుపోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్ర అమరావతి జిల్లా నంద్​గావ్​ ఖండేశ్వర్​ మండలం జావ్రా మోల్వాన్​లో జరిగిందీ ఘటన. వంతెన లేని ఈ ప్రాంతంలో ట్రాక్టర్​తో వాగు దాటడం ఇక్కడి వారికి అలవాటే. అయితే.. సోమవారం అలానే చేస్తుండగా ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. వాగు మధ్యలో ట్రాక్టర్ ఆగిపోయింది. కాసేపటికే వాహనంతోపాటు దానిపై ఉన్న ఐదుగురు నీటిలో కొట్టుకుపోయారు.

  • పదవులకే వన్నె తెచ్చిన అవిశ్రాంత యోధుడు.. వెంకయ్య నాయుడు..

Venkaiah Naidu special story : మొక్కవోని వ్యక్తిత్వం.. విలక్షణ రాజకీయ జీవితం.. అమ్మ భాషపై అమితమైన ఆప్యాయత... చతురత నిండిన వాక్చాతుర్యం.. అవన్నీ కలగలిస్తే.. ముప్పవరపు వెంకయ్యనాయుడు. జాతీయ రాజకీయ యవనికపై తెలుగువారి సంతకంలో.. చెరగని ముద్ర వేసిన మరో ఆణిముత్యం.. ఈ అందరి బంధువు. విద్యార్థి ఉద్యమాల నాయకత్వం నుంచి భారతదేశ 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి.. ఉపరాష్ట్రపతి పీఠం వరకు.. ఆయన ప్రతిప్రయాణంలోని ప్రతిఘట్టం అనితర సాధ్యమే. 2017 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడు పదవీ కాలం ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. ఆయన వారసుడి ఎంపిక కూడా జరిగి పోయింది. ఈ సందర్భంగానే పదవులకే వన్నె తెచ్చిన అవిశ్రాంత యోధుడి రాజకీయ పయనం.. నేటి ప్రత్యేకం.

  • త్రివేణి సంగమం వద్ద జలసవ్వడి

kaleshwaram triveni sangamam : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ ఉట్టిపడుతోంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో భారీ ప్రవాహం వస్తుంది. ఫలితంగా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కర ఘాట్ల పైనుంచి ఉభయ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.540 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది.

  • ఎస్సై అభ్యర్థిని కోమాలోకి పంపారు..

attack on car driver news: నిరుపేద కుటుంబ నేపథ్యం. డిగ్రీ పూర్తి చేసి తండ్రికి అండగా ఉండాలనుకున్నాడు. పోలీసు కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబానికి భారం కావొద్దనే ఉద్దేశంతో క్యాబ్‌ నడుపుతూనే ఎస్సై రాత పరీక్ష శిక్షణ పూర్తి చేశాడు. అంతా బాగుంటే.. ఆదివారం జరిగిన ఎస్సై పరీక్షకు హాజరయ్యేవాడే..! ఇంతలోనే పరీక్ష రాయాల్సిన అభ్యర్థి.. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో క్యాబ్‌ కిరాయి అడిగినందుకు ఇటీవల దాడికి గురైన వెంకటేశ్​ నేపథ్యమిది.

  • నీరజ్​చోప్రా 'గోల్డ్​మెడల్​' రికార్డ్​ బద్దలు

Commonwealth Games 2022 Neeraj chopra: కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా జావెలిన్‌ త్రోలో ఓ అథ్లెట్‌ రికార్డు త్రో విసిరి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో భారత అథ్లెట్‌, ప్రపంచ నంబర్‌వన్‌ నీరజ్ చోప్రా కూడా షాక్​ అయ్యాడు!

  • దూసుకుపోతున్న 'బింబిసార-సీతారామం' కలెక్షన్స్​.. ఎంతంటే?

Bimbisara-Sitaramam Collections: నందమూరి హీరో కల్యాణ్​రామ్​ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఈ సినిమా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అప్పటి నుంచి బాక్సాఫీస్​పై దండయాత్ర చేస్తూనే ఉంది. ఇప్పటికే మొదటి మూడు రోజులు సాలిడ్ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా నాలుగో రోజు కూడా మంచి వసూళ్లనే సాధించింది. బింబిసారతో పాటే విడుదలై దుల్కర్​ సల్మాన్ సీతారామం కూడా మంచి వసూళ్లనే సాధిస్తోంది.​ మొత్తంగా ఈ చిత్రాలు 4 రోజుల్లో బాక్సాపీస్ వద్ద ఎంత కలెక్ట్​ చేశాయంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.