ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 8, 2022, 10:36 AM IST

Updated : Aug 8, 2022, 10:47 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మెయిన్​పురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమాజ్​వాదీ పార్టీ మెయిన్​పురి జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టి.. 500 మీటర్లు లాక్కెళ్లింది. అయితే దేవేంద్ర త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మెయిన్​పురి సదర్​ కొత్వాలి పోలీస్ స్టేషన్​లో దేవేంద్ర సింగ్ ఫిర్యాదు చేయగా ట్రక్కు డ్రైవర్​ను పోలీసులు అరెస్టు చేశారు.

  • ఉద్యమం కాదు.. జన ఉప్పెన

Quit India movement: 'డు ఆర్​ డై' అంటూ మహాత్మ గాంధీజీ ఇచ్చిన ఒక్క పిలుపుతో ఉవ్వెత్తున దూసుకెళ్లింది ఆ ఉద్యమం... సమాచార వ్యవస్థ నామమాత్రంగా ఉన్న ఆ రోజుల్లో దేశంలోని ప్రతి ఊరిలో ప్రజలు ఎవరికి వారే నాయకులై.. కదం తొక్కేలా చేసింది.. క్విట్ ఇండియా పేరుతో జరిగిన చారిత్రక ఉద్యమం.. బ్రిటిష్ గుండెల్లో గుబులు పుట్టించింది. స్వాతంత్య్ర పోరాటంలో తుది సంగ్రామంగా నిలిచిన 'క్విట్ ఇండియా'కు 80 ఏళ్లు నిండాయి.

  • బ్యాంకు ఖాతాలోకి రూ.6,833 కోట్లు

ఓ వ్యక్తి ఖాతాలోకి రూ.6వేల కోట్లకు పైగా నగదు క్రెడిట్ అయింది. ఈ డబ్బు ఎలా వచ్చిందో? ఎవరు పంపించారో తెలీదు! వారం క్రితం డబ్బులు వచ్చినట్లు తెలుస్తుండగా.. ఇప్పటికీ నగదు ఆ ఖాతాలోనే ఉంది. అసలేమైంది?

  • యువతిని గదిలో బంధించి అత్యాచారం

young Woman rape in Banjara Hills : బంజారాహిల్స్​లో జరిగిన ఓ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు యువతిని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • మూడేళ్ల కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి..

father beats daughter in Hyderabad : ఓ తండ్రి తన మూడేళ్ల కుమార్తెపై క్రూరంగా ప్రవర్తించాడు. ఇష్టారీతిన కొట్టడంతో పాటు నేలకేసి విసిరికొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడా బాలిక ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ ఠాణా పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

  • సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 రోజులు రద్దు

Secunderabad-Raipur Express cancelled: సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

  • ‘మేనేజ్‌మెంట్‌’ దోపిడీ

management quota seats in BTech: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల పేరిట దోపిడీ మొదలైంది. ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల కావడంతో ఈ కోటా సీట్లను ముందుగానే భర్తీ చేసుకునేందుకు సకల యత్నాలూ చేస్తున్నాయి. మార్కులు కాస్త తక్కువగా వచ్చి.. మంచి ర్యాంకులు రావని భావిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. వారి పరిస్థితిని తమకు అనుకూలంగా ‘సొమ్ము’ చేసుకునే పనిలో కళాశాలలు ఉన్నాయి.

  • సంక్షోభంలో టాలీవుడ్

Tollywood shootings problems: ఇతర పరిశ్రమలతో పోలిస్తే కొవిడ్‌ దెబ్బ నుంచి త్వరగానే కోలుకొని సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా కనిపించిన టాలీవుడ్‌- ప్రస్తుతం కొన్ని స్వీయ తప్పిదాల వల్ల సంక్షోభ స్థితిని కొనితెచ్చుకొంది. టికెట్​ రేట్లు, నిర్మాణ వ్యయాలు, ప్రేక్షకుల థియేటర్లకు రాకపోవడం, ఓటీటీలో సినిమాల విడుదల ఇలా పలు సమస్యలు తెలుగు చిత్రసీమను చుట్టుముట్టి షూటింగ్​లు ఆపేస్థితికి చేర్చాయి. మరి దీని పరిష్కారం ఎలా?

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 16,167 మంది వైరస్ బారిన పడ్డారు. 41 మంది మృతి చెందారు. మరోవైపు జపాన్​లో మరోసారి 2 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి.

  • ఆలయం వద్ద తొక్కిసలాట.. ముగ్గురు మహిళలు మృతి

Stampede in temple: రాజస్థాన్​లోని ఓ ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని జైపుర్​లోని ఆసుపత్రికి తరలించారు.

  • సమాజ్​వాదీ నేత కారును ఢీకొట్టిన ట్రక్కు

ఉత్తర్​ప్రదేశ్​ మెయిన్​పురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమాజ్​వాదీ పార్టీ మెయిన్​పురి జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టి.. 500 మీటర్లు లాక్కెళ్లింది. అయితే దేవేంద్ర త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మెయిన్​పురి సదర్​ కొత్వాలి పోలీస్ స్టేషన్​లో దేవేంద్ర సింగ్ ఫిర్యాదు చేయగా ట్రక్కు డ్రైవర్​ను పోలీసులు అరెస్టు చేశారు.

  • ఉద్యమం కాదు.. జన ఉప్పెన

Quit India movement: 'డు ఆర్​ డై' అంటూ మహాత్మ గాంధీజీ ఇచ్చిన ఒక్క పిలుపుతో ఉవ్వెత్తున దూసుకెళ్లింది ఆ ఉద్యమం... సమాచార వ్యవస్థ నామమాత్రంగా ఉన్న ఆ రోజుల్లో దేశంలోని ప్రతి ఊరిలో ప్రజలు ఎవరికి వారే నాయకులై.. కదం తొక్కేలా చేసింది.. క్విట్ ఇండియా పేరుతో జరిగిన చారిత్రక ఉద్యమం.. బ్రిటిష్ గుండెల్లో గుబులు పుట్టించింది. స్వాతంత్య్ర పోరాటంలో తుది సంగ్రామంగా నిలిచిన 'క్విట్ ఇండియా'కు 80 ఏళ్లు నిండాయి.

  • బ్యాంకు ఖాతాలోకి రూ.6,833 కోట్లు

ఓ వ్యక్తి ఖాతాలోకి రూ.6వేల కోట్లకు పైగా నగదు క్రెడిట్ అయింది. ఈ డబ్బు ఎలా వచ్చిందో? ఎవరు పంపించారో తెలీదు! వారం క్రితం డబ్బులు వచ్చినట్లు తెలుస్తుండగా.. ఇప్పటికీ నగదు ఆ ఖాతాలోనే ఉంది. అసలేమైంది?

  • యువతిని గదిలో బంధించి అత్యాచారం

young Woman rape in Banjara Hills : బంజారాహిల్స్​లో జరిగిన ఓ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు యువతిని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • మూడేళ్ల కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి..

father beats daughter in Hyderabad : ఓ తండ్రి తన మూడేళ్ల కుమార్తెపై క్రూరంగా ప్రవర్తించాడు. ఇష్టారీతిన కొట్టడంతో పాటు నేలకేసి విసిరికొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడా బాలిక ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ ఠాణా పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

  • సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 రోజులు రద్దు

Secunderabad-Raipur Express cancelled: సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

  • ‘మేనేజ్‌మెంట్‌’ దోపిడీ

management quota seats in BTech: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల పేరిట దోపిడీ మొదలైంది. ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల కావడంతో ఈ కోటా సీట్లను ముందుగానే భర్తీ చేసుకునేందుకు సకల యత్నాలూ చేస్తున్నాయి. మార్కులు కాస్త తక్కువగా వచ్చి.. మంచి ర్యాంకులు రావని భావిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. వారి పరిస్థితిని తమకు అనుకూలంగా ‘సొమ్ము’ చేసుకునే పనిలో కళాశాలలు ఉన్నాయి.

  • సంక్షోభంలో టాలీవుడ్

Tollywood shootings problems: ఇతర పరిశ్రమలతో పోలిస్తే కొవిడ్‌ దెబ్బ నుంచి త్వరగానే కోలుకొని సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా కనిపించిన టాలీవుడ్‌- ప్రస్తుతం కొన్ని స్వీయ తప్పిదాల వల్ల సంక్షోభ స్థితిని కొనితెచ్చుకొంది. టికెట్​ రేట్లు, నిర్మాణ వ్యయాలు, ప్రేక్షకుల థియేటర్లకు రాకపోవడం, ఓటీటీలో సినిమాల విడుదల ఇలా పలు సమస్యలు తెలుగు చిత్రసీమను చుట్టుముట్టి షూటింగ్​లు ఆపేస్థితికి చేర్చాయి. మరి దీని పరిష్కారం ఎలా?

Last Updated : Aug 8, 2022, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.