ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 8, 2022, 8:58 AM IST

  • కారు డ్రైవర్‌పై 20 మంది మూకదాడి

attack on car driver: కారెక్కించుకొని కిరాయి అడిగినందుకు దాడి చేశారు. ఆపై.. నిందితులే ముందుగా పోలీస్​స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల ఒంటిపై దెబ్బలు లేవంటూ పోలీసులు తేలికగా తీసుకున్నారు. డ్రైవర్‌ తలకు బలమైన దెబ్బ తగలటంతో కోమాలోకి వెళ్లాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌ పీఎస్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

  • హైదరాబాదీ బిర్యానీ కోసం సేంద్రియ బియ్యం

hyderabad biryani with organic rice : బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ హైదరాబాద్​ ధమ్​కా బిర్యానీకైతే దేశ విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉంటారు. పొడవైన గింజ, సువాసన వెదజల్లే బాస్మతి బియ్యంతో చేసే బిర్యానీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అలాంటి బిర్యానీ లవర్స్​ కోసం.. సేంద్రియ విధానంలో బాస్మతి బియ్యాన్ని పండిస్తూ.. సాగులో లాభం కన్నా.. ప్రజల ఆరోగ్యమే మిన్న అంటున్నారు వరంగల్​ జిల్లాకు చెందిన రైతు ఒంటెల విశ్వేశ్వర్‌రెడ్డి.

  • అమెరికా యుద్ధనౌకకు భారత్​లో రిపేర్లు

మరమ్మత్తుల కోసం అమెరికా యుద్ధనౌక భారత్​కు చేరుకుంది. చెన్నైలోని ఓ షిప్​యార్డులో నౌకకు మరమ్మత్తులు జరగనున్నాయి. 'భారత్‌లో తయారీ'(మేకిన్ ఇండియా)కి ఇది పెద్ద ఊతమని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.

  • పైచేయి కోసం విపక్షాల కుమ్ములాట!

Congress vs TMC: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో విపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు తేటతెల్లమయ్యాయి. పైచేయి కోసమే కాంగ్రెస్‌, తృణమూల్‌ ఆరాటపడటం, బహిరంగంగా విమర్శలు గుప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ కూడా విపక్షాలకు పెద్ద తలనొప్పిగా మారింది.

  • ప్రపంచనేతగా భారత్!

NITI AAYOG MEETING 2022: వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికతలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించి, ప్రపంచానికి నేతగా భారత్ అవతరించాలని అన్నారు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే కొవిడ్‌ మహమ్మారి నుంచి మన దేశం బయటపడగలిగిందని చెప్పారు.

  • సంస్థానాల విలీనానికి ఉపయోగపడిన ఆయుధం.. 'రాజభరణం'

హమ్మయ్య.. ఆంగ్లేయులు వెళ్లిపోతున్నారు.. స్వాతంత్య్ర సమరం ముగిసిందని సంబరపడేంతలో అనుకోకుండా అనివార్యంగా భారతావని ముందుకు మరో యుద్ధం ముంచుకొచ్చింది. అదే సంస్థానాల విలీనం. ఇదీ ఓ యుద్ధమే.. అప్రకటిత యుద్ధం. విదేశీయులపై కాదు.. స్వదేశీయులపైనే! సామదానభేద దండోపాయాలతో సాగిన ఈ సమరంలో సర్దార్‌ పటేల్‌, ఆయన బృందానికి ఉపయోగపడిన అస్త్రం.. రాజభరణం.

  • 28 ఐపీఓలు.. రూ.45వేల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐపీఓ ద్వారా నిదులు సమకూర్చేందుకు 28 కంపెనీలకు సెబీ అనుమతించింది. ఇందులో 11 సంస్థలు రూ.33వేల కోట్లు సమీకరించాయి. మరికొన్ని సంస్థలు ఐపీఓలకు రావాల్సి ఉంది.

  • 'కష్టపడటమే నా మంత్రం.. దేశానికి పతకాలు అందిస్తూనే ఉంటా'

Nikhat Zareen Interview: బాక్సింగ్​లో దేశానికి పతకాలు అందిస్తూనే ఉంటానని విశ్వాసం వ్యక్తం చేసింది తెలుగమ్మాయి నిఖత్ జరీన్. కష్టపడినంతకాలం తనను ఎవరూ ఆపలేరని స్పష్టం చేసింది. కామన్​వెల్త్​లో స్వర్ణం గెలిచిన నేపథ్యంలో ఈనాడుతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలు ఇలా..

  • కామన్​వెల్త్​ గేమ్స్​లో శ్రీలంక క్రీడాకారులు మిస్సింగ్!

కామన్​వెల్త్​ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన 10 మంది శ్రీలంక ఆటగాళ్లు అనుమానాస్పదరీతిలో అదృశ్యమయ్యారు. బ్రిటన్​లో ఉండిపోయేందుకే వారు ఇలా చేసి ఉంటారని శ్రీలంక అధికారులు భావిస్తున్నారు. అంతకుముందు 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా కూడా ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు.

  • హిందీ చిత్రసీమలో తెలుగు దర్శకుల హవా!

తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఓ వెలుగు వెలుగుతోంది. మన కథలు అందరికీ నచ్చుతున్నాయి. ప్రాంతీయ.. భాషా సరిహద్దులు చెరిపేస్తూ ప్రతి ఒక్కరి మనసుల్ని హత్తుకుంటున్నాయి. పసందైన వినోదాల్ని పంచిస్తున్నాయి. అందుకే మన దర్శకులు తయారు చేస్తున్న కథలపై బాలీవుడ్‌ స్టార్లు, నిర్మాతలు మనసుపడుతున్నారు. వారితో కలిసి సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.