ETV Bharat / city

Telangana News Today : టాప్‌న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Jul 29, 2022, 12:58 PM IST

  • ఆ సిటీలో ఒకే రోజు ఐదుగురు సూసైడ్

24 గంటల వ్యవధిలోనే ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడడం ఝార్ఖండ్​లోని జంశెద్​పుర్​లో కలకలం రేపింది. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు పోలీసులు. ఆ ఘటనలపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

  • కిడ్నాప్ చేసి మైనర్​పై గ్యాంగ్ రేప్.. రాత్రంతా నరకం!

మార్కెట్​కు కూరగాయల కోసం వెళ్లిన ఓ మైనర్​ను ఆరుగురు యువకులు కిడ్నాప్​ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్​లో జరిగింది. మరోవైపు, హరియాణాలో పానీపత్​​కు చెందిన ఓ వివాహిత.. అత్తింటి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది.

  • ''పాలమూరు' మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి'

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్, భాజపా నాయకులు స్పందించారు. ప్రాజెక్టు పనుల్లో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ అన్నారు.

  • కరకట్ట నిర్మించి శాశ్వత పరిష్కారం జరిగే వరకు పోరాడతాం

Chandrababu: ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే... రాజకీయ నేతలు భవిష్యత్‌కు బాటలు వేసిన వారమవుతామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి నిర్మించిన కరకట్టలే... ఇటీవల గోదావరి వరదల నుంచి భద్రాచలాన్ని కాపాడినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రాత్రి భద్రాచలంలో బస చేసిన ఆయన... ఉదయం భద్రాద్రి రామయ్య దర్శనం అనంతరం, గోదావరి కరకట్టలను పరిశీలించారు.

  • జోరందుకున్న కాళేశ్వరం పంపుహౌస్​ల పునరుద్ధరణ పనులు..

వరదలో మునిగిన కాళేశ్వరం పంపుహౌస్​ల పునరుద్ధరణ పనులు జోరందుకున్నాయి. అన్నారంలో పంపులను శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయి. వారం, పది రోజులైతే ఏ మేరకు నష్టం జరిగిందనేది ఓ అంచనాకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. మేడిగడ్డ పంపుహౌస్​ నుంచి నీటిని తోడే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.

  • డెంగీ కేసులపై ఎవరి లెక్కలు వాళ్లవే..

Dengue fever Cases in Hyderabad : వరుస వర్షాలతో హైదరాబాద్ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. వరద ఉద్ధృతితో నీటి నిల్వలు పెరిగిపోయి.. ఇళ్లలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా డెందీ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతోంటే.. జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలు మాత్రం తప్పుడు లెక్కలతో అసలైన రోగులను లెక్కలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

  • 'నిప్పుతో చెలగాటం వద్దు.. అది మీకే ప్రమాదం'..

అమెరికా, చైనా అధినేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం ఇరుదేశాల నేతలు జోబైడెన్- జిన్​పింగ్​ మధ్య రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. వీరి చర్చల్లో ప్రధానాంశంగా 'తైవాన్' మారింది.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. రూ. 53,160 వద్ద ఉంది. మరోవైపు స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. మరో మూడో సెషన్​లో సానుకూలంగా కదలాడుతున్నాయి.

  • తప్పుగా మాట్లాడుతున్నారు.. ఇకనైనా మారండి: రోహిత్​ స్వీట్​ వార్నింగ్​

Teamindia VS Westindies T20 series: టీ20 ప్రపంచకప్​ సహా ఇతర కీలకాంశాలపై టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ మాట్లాడాడు. విమర్శలు చేసేవారు మారాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

  • చైతూపై సామ్​కు ఇంకా ప్రేమ తగ్గలేదా?

పెళ్లి తర్వాత నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంటిని కొనుగోలు చేసింది హీరోయిన్​ సమంత. ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు​. ప్రస్తుతం సామ్​ తన తల్లితో అక్కడే ఉంటున్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.