ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 11AM - తెలంగాణ టాప్ న్యూస్ టుడే

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Jun 22, 2022, 11:00 AM IST

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి తన అనుచర ఎమ్మెల్యేలతో సూరత్‌ వెళ్లిన రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లారు. దీంతో మహా రాజకీయం ఇప్పుడు అసోంకు చేరుకుంది. ఈ ఉదయం వీరంతా ఛార్టెడ్‌ విమానంలో గువాహటికి చేరుకున్నారు.

  • మనుషుల్ని చంపి.. మామిడి చెట్టెక్కిన చిరుత

ఓ చిరుత నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ.. మామిడి చెట్టుపై నిద్రిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటవీ, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చి చిరుతను పట్టుకెళ్లారు. ఈ ఘటన బంగాల్​ అలీపుర్​ద్వార్​ జిల్లాలోని షిల్బరీహట్​ ఘాట్​పడ్​ ప్రాంతంలో జరిగింది.

  • జహీరాబాద్‌లో నిమ్జ్ నిర్వాసితుల ఆందోళన

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీస్‌కు శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెళ్తున్న నేపథ్యంలో నిమ్జ్‌ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు పరిహారం చెల్లించకుండా నిర్మాణాలు ఎలా చేస్తారని మండిపడ్డారు. కేటీఆర్ పర్యటన.. నిర్వాసితుల ఆందోళన దృష్ట్యా పోలీసులు జిల్లాలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు.

  • హైదరాబాద్‌లో 16 మాన్​సూన్ బృందాలు

హైదరాబాద్​లో నిరంతరం అందుబాటులో ఉండేలా 16మాన్​సూన్ బృందాలు ఏర్పాటు చేసినట్టు జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడైనా నీరు నిలిస్తే జలమండలి కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 15531కు ఫోన్‌ చేయాలని ఆయన చెప్పారు.

  • గ్రాండ్​గా పెంపుడు కుక్కల పెళ్లి

భారత్​లో వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. వేదమంత్రాలు, మేళతాళాల మధ్య అట్టహాసంగా పెళ్లిళ్లు జరుగుతాయి. బిహార్​లోని మోతిహరిలో కూడా ఎంతో వైభవంగా ఓ పెళ్లి జరిగింది. కానీ అదో విచిత్ర పెళ్లి. ఎందుకంటే ఆ వివాహం జరిగింది రెండు పెంపుడు కుక్కలకు.

  • మళ్లీ కుదేలైన స్టాక్​ మార్కెట్​ సూచీలు

గత సెషన్​లో భారీ లాభాలు నమోదుచేసిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మళ్లీ భారీగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 570 పాయింట్లకుపైగా కోల్పోయి.. 51 వేల 950 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 180 పాయింట్లకుపైగా నష్టంతో.. 15 వేల 450 వద్ద ట్రేడవుతోంది.

  • మరో సూపర్​ రికార్డుకు చేరువలో హర్మన్‌

టీమ్​ఇండియా మహిళా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో రికార్డు్ను తన ఖాతాలో వేసుకోనుంది. అదేంటంటే..

  • చైతూతో విడాకులు.. ఆ షోలో కారణం చెప్పేసిన సమంత!

నాగచైతన్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో హీరోయిన్​ సమంత వివరించినట్లు తెలిసింది. 'కాఫీ విత్​ కరణ్​' షోలో ఆమె ఈ విషయం గురించి మాట్లాడిండని సమాచారం! డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జులై 7న ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కానుందట.

  • దేశంలో మళ్లీ పెరిగిన కరోనా

భారత్​లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 12,249 మందికి వైరస్​ సోకింది. మరో 13 మంది చనిపోయారు. 9,862 మంది కోలుకున్నారు

  • ముర్ముకు 'జెడ్‌ ప్ల‌స్' భ‌ద్ర‌త

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయనున్న ద్రౌపది ముర్ముకు కేంద్రం జడ్​ ప్లస్​ సెక్యూరిటీ కల్పించింది. మరోవైపు, బుధవారం ఆమె ఒడిశాలోని రాయ్​రంగ్​పుర్​లోని శివాలయానికి వెళ్లారు. చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేసి దర్శనం చేసుకున్నారు.

  • అసోంకు 'మహా' రాజకీయం

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి తన అనుచర ఎమ్మెల్యేలతో సూరత్‌ వెళ్లిన రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లారు. దీంతో మహా రాజకీయం ఇప్పుడు అసోంకు చేరుకుంది. ఈ ఉదయం వీరంతా ఛార్టెడ్‌ విమానంలో గువాహటికి చేరుకున్నారు.

  • మనుషుల్ని చంపి.. మామిడి చెట్టెక్కిన చిరుత

ఓ చిరుత నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ.. మామిడి చెట్టుపై నిద్రిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటవీ, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చి చిరుతను పట్టుకెళ్లారు. ఈ ఘటన బంగాల్​ అలీపుర్​ద్వార్​ జిల్లాలోని షిల్బరీహట్​ ఘాట్​పడ్​ ప్రాంతంలో జరిగింది.

  • జహీరాబాద్‌లో నిమ్జ్ నిర్వాసితుల ఆందోళన

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీస్‌కు శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెళ్తున్న నేపథ్యంలో నిమ్జ్‌ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు పరిహారం చెల్లించకుండా నిర్మాణాలు ఎలా చేస్తారని మండిపడ్డారు. కేటీఆర్ పర్యటన.. నిర్వాసితుల ఆందోళన దృష్ట్యా పోలీసులు జిల్లాలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు.

  • హైదరాబాద్‌లో 16 మాన్​సూన్ బృందాలు

హైదరాబాద్​లో నిరంతరం అందుబాటులో ఉండేలా 16మాన్​సూన్ బృందాలు ఏర్పాటు చేసినట్టు జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడైనా నీరు నిలిస్తే జలమండలి కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 15531కు ఫోన్‌ చేయాలని ఆయన చెప్పారు.

  • గ్రాండ్​గా పెంపుడు కుక్కల పెళ్లి

భారత్​లో వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. వేదమంత్రాలు, మేళతాళాల మధ్య అట్టహాసంగా పెళ్లిళ్లు జరుగుతాయి. బిహార్​లోని మోతిహరిలో కూడా ఎంతో వైభవంగా ఓ పెళ్లి జరిగింది. కానీ అదో విచిత్ర పెళ్లి. ఎందుకంటే ఆ వివాహం జరిగింది రెండు పెంపుడు కుక్కలకు.

  • మళ్లీ కుదేలైన స్టాక్​ మార్కెట్​ సూచీలు

గత సెషన్​లో భారీ లాభాలు నమోదుచేసిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మళ్లీ భారీగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 570 పాయింట్లకుపైగా కోల్పోయి.. 51 వేల 950 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 180 పాయింట్లకుపైగా నష్టంతో.. 15 వేల 450 వద్ద ట్రేడవుతోంది.

  • మరో సూపర్​ రికార్డుకు చేరువలో హర్మన్‌

టీమ్​ఇండియా మహిళా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో రికార్డు్ను తన ఖాతాలో వేసుకోనుంది. అదేంటంటే..

  • చైతూతో విడాకులు.. ఆ షోలో కారణం చెప్పేసిన సమంత!

నాగచైతన్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో హీరోయిన్​ సమంత వివరించినట్లు తెలిసింది. 'కాఫీ విత్​ కరణ్​' షోలో ఆమె ఈ విషయం గురించి మాట్లాడిండని సమాచారం! డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జులై 7న ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కానుందట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.