ETV Bharat / city

Telangana News Today : టాప్‌న్యూస్ @ 7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Apr 22, 2022, 7:00 AM IST

  • మిల్లర్ల మాయాజాలం

రాష్ట్రంలో ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.వేల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ ఇస్తోంది. ఇదే అదనుగా కొందరు మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ నిధులు వెచ్చించి వడ్లు కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చి పూర్తి స్థాయిలో బియ్యం ఎందుకు తీసుకోలేకపోతున్నారో అధికారులకే తెలియాలి. ప్రతి సీజనులో ధాన్యమో... బియ్యమో గోల్‌మాల్‌ అవుతూనే ఉన్నాయి.

  • పెరుగుతున్న కరోనా కేసులు

కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ.. నాలుగో దశ ముప్పు వచ్చినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. అన్ని జిల్లాల్లోనూ కేసుల పెరుగుదలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఎక్కడైనా కేసులు పెరుగుతుంటే.. వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీచేసింది.

  • మాస్కు ధరించడం మరవద్దు

కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రభుత్వ చర్యల వల్ల కొంతవరకు పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 18-59 ఏళ్ల వయసు వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో బూస్టర్‌ డోసు తీసుకోవాలని డీహెచ్ వెల్లడించారు.

  • పదోన్నతులకు పచ్చజెండా

ఉపాధ్యాయులకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టి... తర్వాత పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

  • ఎలుక దెబ్బకు ఆగిపోయిన టేకాఫ్​

మరికొద్ది సేపట్లో ఆ విమానం బయలుదేరేది. ఇంతలో ఉన్నట్లుండి ఆ విమానం టేకాఫ్​ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు సిబ్బంది. దాదాపు రెండు గంటల తర్వాత ఆ విమానం డిపార్చర్​ అయింది. ఈ ఘటన శ్రీనగర్​ ఎయిర్​పోర్ట్​లో జరిగింది. ఈ ఆలస్యం అంతటికీ కారణం ఓ ఎలుక!

  • రూ.1300 కోట్లు విలువైన హెరాయిన్​ పట్టివేత

గుజరాత్​లో మరోమారు భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. గుజరాత్​ యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​(ఏటీఎస్​), డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​(డీఆర్​ఐ) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్​లో 260 కిలోల హెరాయిన్​ను పట్టుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.1,300 కోట్లు ఉంటుందని తెలిపారు.

  • ఈవీ వాహనాల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు

విద్యుత్​ వాహనాల తయారీలో నాణ్యత లోపిస్తే సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. వాహనదారుల భద్రతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 'ఈవీ పేలుడు' ఘటనలపై ఇప్పటికే నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

  • చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్​షీట్

కో-లొకేషన్​ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ ఎన్ఎ​స్​ఈ సీఈఓ చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్​షీట్​ను నమోదు చేసింది. ఛార్జ్​షీట్​ను కోర్టుకు సమర్చించామని.. దర్యాప్తులో కొత్త విషయాలు, ఆధారాలు తెలిస్తే.. ప్రస్తుతం ఉన్న దానికి అనుబంధంగా మరో ఛార్జ్​షీట్​ జోడిస్తామని పేర్కొంది.

  • రష్యా రక్షణ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం

రష్యాలోని టీవర్​ నగరంలోని రక్షణ శాఖ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. 27 మంది గాయపడ్డారు. పాతబడిన వైరింగ్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా భావిస్తోంది.

  • ముంబయికి వరుసగా ఏడో ఓటమి

ముంబయి ఇండియన్స్​పై చెన్నై సూపర్​ కింగ్స్​ విజయం సాధించింది. దీంతో ఈ సీజన్​లో తన రెండో విజయాన్ని నమోదు చేసింది చెన్నై జట్టు. మరోవైపు తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న ముంబయి జట్టుకు నిరాశే మిగిలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.