ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news in telangana at 7PM
టాప్ న్యూస్ @ 7PM
author img

By

Published : Mar 15, 2022, 6:58 PM IST

అసెంబ్లీలో మా సభ్యులు మరింత గట్టిగా మాట్లాడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రికార్డుల నుంచి నా వ్యాఖ్యలు మాత్రమే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

  • ఆయన బయటుంటే దర్యాప్తునకు విఘాతం

Viveka Murder Case: వైఎస్​ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్​ రద్దు పిటిషన్​పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని.. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

  • పన్నులు చెల్లించకుంటే చర్యలు

జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యాపార, ఇంటిపన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ జీపీ కుమార్ తెలిపారు. పన్నులు ఎగ్గొట్టే వారిపై కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మార్చి 31వ తేదీలోగా పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

  • 14 ఏళ్ల వయసులోనే రోబో తయారీ

Interactive robot: ఆటలాడుకునే వయసులో అద్భుతాలు చేస్తున్నాడు ఓ బాలుడు. ఇంజనీరింగ్​ విద్యార్థులకు కూడా సాధ్యం కాని రోబోలను తయారు చేస్తున్నాడు. ఇంటి పనికి ఉపయోగించే వాటి నుంచి మాట్లాడే రోబోల వరకు సొంతంగా రూపొందిస్తున్నాడు.

  • 13,500 మంది సైనికులు హతం

Russia Ukraine War: యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 13,500 మంది రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. వందల సంఖ్యలో సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు, రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కీవ్​లో కర్ఫ్యూ ప్రకటించారు స్థానిక మేయర్. ఈ పరిస్థితుల్లో ఐరోపా దేశాల అధినేతలు ఉక్రెయిన్​ పర్యటన చేపట్టారు.

  • మరీ సన్నగా ఉన్నారా? ఇలా బరువు పెరగండి

Weight Gain Tips:వయసు పెరుగుతున్నా అందుకు తగ్గటుగా బరువు పెరగడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఏ విధమైన వ్యాయామం, ఆహార అలవాట్లతో బరువు పెంచుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం.

  • ఓటీటీ వ్యాపారంలోకి షారుక్​​

Shah Rukh Khan OTT: ఇప్పటికే నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న బాలీవుడ్​ సూపర్​స్టార్ షారుక్​ఖాన్.. మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. త్వరలోనే ఓ ఓటీటీ యాప్​ను లాంచ్ చేయనున్నారు! అందుకు సంబంధించి షారుక్​ ఓ పోస్ట్​ చేయగా.. తనకు పార్టీ కావాలని అడిగారు మరో స్టార్​ హీరో సల్మాన్ ఖాన్.

  • 'వన్డే టోర్నీపై గంగూలీతో చర్చిస్తా'

Ramiz Raja On Ganguly: భారత్ సహా నాలుగు దేశాలతో వన్డే టోర్నమెంట్​ నిర్వహించాలని ప్రతిపాదించాడు పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్​ రాజా. ఈ విషయంపై దుబాయ్​లో జరిగే ఏసీసీ సమావేశంలో సౌరభ్​ గంగూలీతో మాట్లాడుతానని తెలిపాడు.

  • బడ్జెట్​కు​ ఆమోదం.. సభ నిరవధిక వాయిదా

ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లును సభ ముందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ తీసుకురాగా.. సభ్యుల అనుమతితో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆమోదించారు.

  • ఉక్రెయిన్​ విద్యార్థులకు​ గుడ్​న్యూస్​..

CM KCR Statements: ఉక్రెయిన్​ నుంచి తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు సీఎం కేసీఆర్​ శుభవార్త వినిపించారు. వారి చదువులు మధ్యలోనే ఆగిపోకుండా.. చదివించుకుంటామన్నారు. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.

  • మా సభ్యులు అండగా నిలవలేదు

అసెంబ్లీలో మా సభ్యులు మరింత గట్టిగా మాట్లాడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రికార్డుల నుంచి నా వ్యాఖ్యలు మాత్రమే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

  • ఆయన బయటుంటే దర్యాప్తునకు విఘాతం

Viveka Murder Case: వైఎస్​ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్​ రద్దు పిటిషన్​పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని.. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

  • పన్నులు చెల్లించకుంటే చర్యలు

జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యాపార, ఇంటిపన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ జీపీ కుమార్ తెలిపారు. పన్నులు ఎగ్గొట్టే వారిపై కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మార్చి 31వ తేదీలోగా పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

  • 14 ఏళ్ల వయసులోనే రోబో తయారీ

Interactive robot: ఆటలాడుకునే వయసులో అద్భుతాలు చేస్తున్నాడు ఓ బాలుడు. ఇంజనీరింగ్​ విద్యార్థులకు కూడా సాధ్యం కాని రోబోలను తయారు చేస్తున్నాడు. ఇంటి పనికి ఉపయోగించే వాటి నుంచి మాట్లాడే రోబోల వరకు సొంతంగా రూపొందిస్తున్నాడు.

  • 13,500 మంది సైనికులు హతం

Russia Ukraine War: యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 13,500 మంది రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. వందల సంఖ్యలో సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు, రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కీవ్​లో కర్ఫ్యూ ప్రకటించారు స్థానిక మేయర్. ఈ పరిస్థితుల్లో ఐరోపా దేశాల అధినేతలు ఉక్రెయిన్​ పర్యటన చేపట్టారు.

  • మరీ సన్నగా ఉన్నారా? ఇలా బరువు పెరగండి

Weight Gain Tips:వయసు పెరుగుతున్నా అందుకు తగ్గటుగా బరువు పెరగడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఏ విధమైన వ్యాయామం, ఆహార అలవాట్లతో బరువు పెంచుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం.

  • ఓటీటీ వ్యాపారంలోకి షారుక్​​

Shah Rukh Khan OTT: ఇప్పటికే నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న బాలీవుడ్​ సూపర్​స్టార్ షారుక్​ఖాన్.. మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. త్వరలోనే ఓ ఓటీటీ యాప్​ను లాంచ్ చేయనున్నారు! అందుకు సంబంధించి షారుక్​ ఓ పోస్ట్​ చేయగా.. తనకు పార్టీ కావాలని అడిగారు మరో స్టార్​ హీరో సల్మాన్ ఖాన్.

  • 'వన్డే టోర్నీపై గంగూలీతో చర్చిస్తా'

Ramiz Raja On Ganguly: భారత్ సహా నాలుగు దేశాలతో వన్డే టోర్నమెంట్​ నిర్వహించాలని ప్రతిపాదించాడు పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్​ రాజా. ఈ విషయంపై దుబాయ్​లో జరిగే ఏసీసీ సమావేశంలో సౌరభ్​ గంగూలీతో మాట్లాడుతానని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.