ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Jul 26, 2021, 5:57 AM IST

Updated : Jul 26, 2021, 10:00 PM IST

21:51 July 26

టాప్​ న్యూస్​ @10PM

  • రెండేళ్ల నిరీక్షణకు తెర.. రేషన్​ కార్డుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన వేళ మంత్రులు, ఎమ్మెల్యేలు.. లబ్ధిదారులకు నూతన కార్డులను అందజేశారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన ఆహర భద్రతా కార్డులను ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే వారం రోజుల్లో అర్హులైన అందరికీ కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు.

  • అక్టోబర్​లో జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష

జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష తేదీని ఖరారు చేసింది కేంద్ర విద్యాశాఖ. అక్టోబర్​ 3న పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

  • అశ్లీల చిత్రాల కేసు.. నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు

రాజ్​కుంద్రా అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు పంపారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.

  • Tokyo Olympics: ఈ ఒలింపిక్స్‌లో రష్యా కనిపించలేదేంటి!

విశ్వక్రీడల్లో ఎప్పుడూ సత్తా చాటే రష్యా.. ఈసారి టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) పాల్గొనే అవకాశం కోల్పోయింది. అంతర్జాతీయ పోటీల్లో తమకు ఎదురులేదనే రష్యా అథ్లెట్లు.. ప్రస్తుత ఒలింపిక్స్​లో కనిపించడం లేదు. అయితే వాళ్లు టోక్యో ఒలింపిక్స్​లో ఎందుకు పాల్గొనలేదు? దానికి కారణమేంటో తెలుసా?

  • యూకే కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ.. 

భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని లండన్​ పరారైన విజయ్ మాల్యాకు బ్రిటన్​ కోర్టు షాక్​ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన లండన్ హైకోర్టు అంగీకరించింది.

20:57 July 26

టాప్​ న్యూస్​ @9PM

  • దళితబంధు విజయవంతానికి దృఢ నిర్ణయం

దళిత బంధు పథకంపై ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గ ఎస్సీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం.. పథకం లక్ష్యాలు, అమలు, కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం విజయవంతం చేయాలని సూచించారు. పథకం అమలు ప్రభావం యావత్ తెలంగాణపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ఈ స్కీమ్ విజయవంతానికి అందరూ దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు.

  • 'మై గవ్​​' గొప్ప ఉదాహరణ​'

మై గవర్నమెంట్​ ప్లాట్​ఫామ్​ ఏర్పాటు చేసి ఏడేళ్లు పూర్తవుతున్న క్రమంలో ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పాలనలో ప్రజలను భాగం చేయటంలో 'మైగవ్​' అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జాతీయ నూతన విద్యా విధానం అమలులోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో జులై 29న జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ.

  • ఆందోళనల మధ్యే

పెగాసస్​ వ్యవహారంపై విపక్షాల ఆందోళన నడుమే రెండు బిల్లులకు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభలు ప్రారంభం కాగానే కార్గిల్ విజయ్ దివస్​ను పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత ఉభయ సభలు సజావుగా సాగలేదు.

  • 'అందుకోసం కరెన్సీ నోట్లను ముద్రించేది లేదు'

కరోనా వల్ల దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కరెన్సీ నోట్లను ముద్రించాలన్న వాదనలను కొట్టిపడేసింది కేంద్రం. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనల్లో ప్రభుత్వం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభ వేదికగా వెల్లడించారు.

  • 'ఆర్ఆర్ఆర్' ఆడియో హక్కులు

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. తాజాగా ఈ మూవీ ఆడియో హక్కుల్ని సొంతం చేసుకున్న కంపెనీలను ప్రకటించింది చిత్రబృందం.

19:50 July 26

టాప్​ న్యూస్​ @8PM

  •  బోనాల్లో భవిష్యవాణి 

డప్పు చప్పుళ్లు, పోతు రాజుల నృత్యాలు, మేళతాళాలు మంగళవాద్యాల నడుమ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రెండు రోజుల బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రజలను తాను కాపు కాచుకుంటానని ఉజ్జయిని మహంకాళి అమ్మ భవిష్యవాణి పలికింది. ఏనుగు అంబారిమీద ఊరేగింపుతో అమ్మవారి బోనాల సంబురాలు ఘనంగా ముగిశాయి.

  • అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణలో ఆరుగురు పోలీసులు మృతి

అసోం, మిజోరం సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు మృతిచెందారు. అసోం, మిజోరం సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.

  • ప్రశాంత్​ కిశోర్​ 'ఐ-ప్యాక్​' సభ్యుల నిర్బంధం!

ప్రశాంత్​ కిశోర్​కు చెందిన రాజకీయ సలహా సంస్థ ఐ-ప్యాక్​ బృందానికి చెందిన 22 మందిని త్రిపురలో అదుపులోకి తీసుకున్నారు స్థానిక పోలీసులు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నేపథ్యంలో వారిని ప్రశ్నించినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ చర్యను ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొంది టీఎంసీ.

  • థియేటర్లలో ఈ వారం సినిమాల సందడి.. 

కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో పలు సినిమాలు బిగ్​స్క్రీన్​పై సందడి చేయనున్నాయి. వాటితో పాటు ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలేంటో చూద్దాం..

  • ఒలింపిక్స్​కు తుపాను గండం.. 

టోక్యో ఒలింపిక్స్​కు తుపాను గండం తప్పేట్లు లేదు. విశ్వక్రీడల్లో భాగమైన సర్ఫింగ్ ఆట షెడ్యూల్​ను ఇప్పటికే మార్చారు నిర్వాహకులు. బుధవారం జరగాల్సిన మ్యాచ్​ను మంగళవారానికి మార్చారు.

18:46 July 26

టాప్​ న్యూస్​ @7PM

  • లోక్​సభ సీట్లు త్వరలోనే 1000కి పెంపు?

దేశంలో లోక్​సభ స్థానాల పెంపు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలలోపే.. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 1000, అంతకంటే ఎక్కువకు పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంత? లోక్​సభ సీట్లు పెంచే ఆలోచనతోనే కేంద్రం సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తోందా?

  • రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్తత 

అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 8మంది రైతులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

  • ఆ సాఫ్ట్‌వేర్​ను తెలంగాణ వాడుకునేందుకు ఏపీ అనుమతి

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల పెంపునకు రూపొందించిన 'నాడు-నేడు' సాఫ్ట్‌వేర్​ను వాడుకునేందుకు తెలంగాణకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సాప్ట్​వేర్ ఉపయోగపడనుంది. ఏపీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ సాఫ్ట్​వేర్​ను వినియోగిస్తున్నారు.

  • ఫ్యాన్స్​కు ఎన్టీఆర్ విజ్ఞప్తి

యువనటుడు సత్యదేవ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తిమ్మరుసు'. జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్​ను విడుదల చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

  • ఎండలో హాయ్​ హాయ్​.. బురదలో జాయ్​ జాయ్​

కెన్యాలోని ఓ వైల్డ్​లైఫ్​ ట్రస్ట్​కు చెందిన ఏనుగులు బురదలో సరదాగా జలకాలాడుతున్నాయి. మూడు పిల్ల ఏనుగులు బురదలో స్నానం చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. ఉల్లాసంగా స్నానం చేస్తున్న ఆ వీడియోను మీరు చూసేయండి.

18:04 July 26

టాప్​ న్యూస్​ @6PM

  • 'నల్లమల అడవుల్లో భూకంపం..

శ్రీ‌శైలం డ్యామ్ సమీపంలో(Earthquake near srisailam) భూకంపంపై ఎన్జీఆర్‌ఐ(NGRI) శాస్త్రవేత్త నగేశ్‌ వివరణ ఇచ్చారు. రాతి పొరల్లోని ఒత్తిడి కారణంగా భూకంపం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. కారణాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.

  • బెస్ట్​ బిఫోర్​- ఎక్స్​పైరీ డేట్.. ఈ రెండు ఒకటేనా?

ఆహార పదార్థాలు కొనేటప్పడు ఎక్స్​పైరీ డేట్, బెస్ట్​ బిఫోర్​ డేట్ విషయంలో చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం​​. అసలు ఈ రెండు ఒకటి కాదని చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన పూర్తి కథ మీకోసం.

  • అవినీతి, హింస మధ్య పీఓకేలో ఇమ్రాన్​ పార్టీ గెలుపు!

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్​ ఖాన్​ పార్టీకే మెజారిటీ దక్కినట్లు స్థానిక మీడియా సమాచారం. తెహ్రీక్​-ఏ-ఇన్సాఫ్​ పార్టీ మొత్తం 23 స్థానాలు గెలిచిందంటూ అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్​ జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అక్కడక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

  • మ‌ర‌ణించిన వ్యక్తి ఖాతా నుంచి నగదు క్లెయిమ్​ ఎలా?

సాధారణంగా భారతీయ కుటుంబాల్లో బతికున్న వ్యక్తి మృతి గురించి మాట్లాడటం తప్పుగా భావిస్తుంటారు. అందువల్ల.. ఎవరైనా మరణించిన తర్వాత.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు వస్తుంటాయి(కొన్ని సందర్భాల్లో మాత్రమే). బ్యాంకులో ఉన్న నగదు కూడా ఎలా తీసుకోవాలో అర్థమవదు. అలాంటి ఇబ్బందులు రాకుండా.. మరణించిన వ్యక్తి ఖాతా నుంచి హక్కుదారులు నగదును ఎలా తీసుకోవాలో తెలిపే ఓ ప్రత్యేక కథనం..

  • సుధీర్​కు ప్రియదర్శి దిమ్మతిరిగే పంచ్

బుల్లితెర వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారమవుతోంది. తాజాగా ఈ ప్రోగ్రామ్​కు సంబంధించిన ఫ్రెండ్ షిప్​ డే లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది.

16:57 July 26

టాప్​ న్యూస్​ @5PM

  • మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోని మైకును లాగేసిన ఎమ్మెల్యే

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం లక్కారంలో రేషన్‌కార్డుల పంపిణీలో రసాభాస నెలకొంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోని మైకును ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి  లాగేశారు. ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. 

  • కోచింగ్​ సెంటర్​కు 'పెగాసస్​' పేరు- టీచర్లకు చుక్కలు!

పెగాసస్​.. ఇప్పుడు భారత్​తో పాటు ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారిన అంశం. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు.. వివిధ రంగాల్లోని ప్రముఖలపై నిఘా విషయం దుమారం రేపుతోంది. కేరళలోని ఓ కోచింగ్​ సెంటర్​కు సైతం ఈ పెగాసస్​.. చిక్కులు తెచ్చిపెట్టింది. ఆన్​లైన్​ క్లాసుల కోసం తీసుకొచ్చిన ఓ యాప్..​ వారికి తలనొప్పిగా మారింది. పెగాసస్​తో వాళ్లు ఎదుర్కొన్న సమస్య ఏమిటి?

  • భారత్​కు చాను.. దిల్లీలో ఘనస్వాగతం

ఒలింపిక్స్​లో రజత పతాకం సాధించిన మీరాబాయి చానుకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అధికారులు సాదర స్వాగతం పలికారు.

  • ఒలింపిక్స్‌.. ఆర్థికంగా లాభమా? నష్టమా?

ఆధునిక ప్రపంచంలో ఏదైనా వ్యాపారమే. ఇందులో ఒలింపిక్​ క్రీడలకు ఏమీ మినహాయింపు లేదు. నాలుగేళ్లకు ఓసారి నిర్వహించే ఈ క్రీడలకోసం ఆయా దేశాలు పోటీలు పడతాయి. నిర్వహణకు కోట్లు ఖర్చు చేస్తాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతిదీ అట్టహాసంగాvs ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి మరీ చేస్తున్న ఈ క్రీడా సంగ్రామంతో నిర్వాహకులకు చేకూరేది ఏంటి? ఆర్థికంగా లాభమా? నష్టమా?

  • 'పుష్ప' ఐటమ్ సాంగ్​ కోసం సన్నీ లియోనీ!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' తెరకెక్కుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇప్పటికే సిద్ధమైంది. అయితే ఈ పాటలో నర్తించేందుకు బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోనీని సంప్రందించిందట చిత్రబృందం.

15:53 July 26

టాప్​ న్యూస్​ @4PM

  • పదవీవిరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగం

సింగరేణి సంస్థ తమ అధికారులు, ఉద్యోగుల పదవీవిరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  పదవీవిరమణ వయస్సు 60 నుంచి 61 ఏళ్ల పెంపునకు బోర్డు ఆప్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచి అమలు చేయనున్నారు.

  • యడియూరప్పకు ఆ రెండేళ్లు సవాళ్ల సవారీనే!

కర్ణాటకలో భాజపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. 2019, జులై 26న ముఖ్యమంత్రిగా బీఎస్​ యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వ పయనం ఏమంత సజావుగా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లలో ఊగిసలాడింది.

  • సింగపూర్​ నుంచి రాజ్​కుంద్రా ఖాతాలకు భారీగా నగదు బదిలీ!

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో రాజ్​కుంద్రాపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో.. కుంద్రాకు చెందిన వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లకు సింగపూర్​ నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

  • మీరాబాయి చానుకు 'స్వర్ణా'వకాశం!

టోక్యో ఒలింపిక్స్​లో రజతంతో మెరిసింది మీరాబాయి చాను. అయితే ఇప్పుడు ఈ రెజ్లర్​కు స్వర్ణ పతకం దక్కే అవకాశం ఉంది.

  • ఆసాంతం ఊగిసలాట.. చివరకు నష్టాలు

సోమవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 124 పాయింట్ల నష్టంతో 53 వేల మార్కును కోల్పోయింది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 15,824 వద్దకు చేరింది.

14:51 July 26

టాప్​ న్యూస్​ @3PM

  • సీఎం రేసులో ఆ 9 మంది?

యడియూరప్ప రాజీనామా నేపథ్యంలో కొత్త సీఎం ఎంపికపై భాజపా కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం కేంద్ర నాయకత్వం తరఫున ఓ పరిశీలకుడిని కర్ణాటకకు పంపనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చర్చించుకుని.. యడ్డీ వారసుడిపై ఓ నిర్ణయానికి రానున్నారు. కొత్త సీఎం ఎంపిక పూర్తయ్యే వరకు యడియూరప్ప ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

  • పోలీస్ గెటప్​లో పవన్ న్యూలుక్​​​​..

'అయ్యప్పనుమ్​ కోషియుమ్​'(Ayyappanum Koshiyum Remake) తెలుగు రీమేక్​ షూటింగ్​ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవన్​ పోలీస్​​​ లుక్​ను విడుదల చేశారు. ​దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

  • లంకలో అదుర్స్.. ఇంగ్లాండ్​ పర్యటనకు​ సూర్యకుమార్​

శ్రీలంక పర్యటనలో అదరగొడుతున్న సూర్యకుమార్​ అద్భుత అవకాశం దక్కించుకున్నాడు. పలువురు క్రికెటర్లు గాయపడిన కారణంగా ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ కోసం అతడిని ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది.

  • తగ్గనున్న పప్పుల ధరలు!

పప్పు ధాన్యాల ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్ర కంది పప్పు​పై దిగుమతి సుంకాన్ని మాఫీ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.

  • టెడ్​టాక్​లో ఏడేళ్ల చిన్నారి..

టెడ్​టాక్​ వేదికపై ఏడేళ్ల చిన్నారి అదరగొట్టింది. ఏ మాత్రం భయం లేకుండా గలగలా మాట్లాడేసింది. పిల్లల పెంపకంలో ఏమేం జాగ్రత్తలు పాటించాలో పెద్దలకు ఉదాహరణలతో సహా వివరించింది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చెప్పిందో మీరు చదివేయండి.

13:51 July 26

టాప్​ న్యూస్​ @2PM

  • కొత్త రేషన్ కార్డులొచ్చాయ్..

సర్కారు నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు నూతన కార్డులను అందజేశారు.పేద ప్రజల సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా... ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన ఆహర భద్రతా కార్డులను ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే వారం రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.

  • భవిష్యత్​పై కీలక వ్యాఖ్యలు..

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్​కు రాజీనామా లేఖ సమర్పించారు. పార్టీ కోసం తాను ఒంటరిగా పోరాడానని చెప్పుకొచ్చారు.

  • జల పరవళ్ల సోయగం..

ఒకప్పుడు సాగునీటి కోసం అల్లాడిన నేల ఇప్పుడు జలపరవళ్లతో కళకళలాడుతోంది. బీడు భూములతో బోసిపోయిన పుడమి.. నేడు పచ్చని పొలాలతో పులకరిస్తోంది. భారీ వర్షాలతో.. పోటెత్తిన వరదతో ఎగువ మానేరు(Upper Manair Dam) పరవళ్లు తొక్కుతోంది.

  • డ్రాగన్​ వక్రబుద్ధి..

ఓ వైపు భారత్​- చైనా దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నా.. చైనా కవ్వింపు చర్యలు మాత్రం ఆగటంలేదు. తూర్పులద్ధాఖ్​లోని దెమ్​చోక్​ వద్ద ఆ దేశ పౌరులు గుడారాలను వేసినట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని భారత సైన్యం హెచ్చరించిందన్నారు.

  • మనికా బత్రా ఓటమి..

టేబుల్ టెన్నిస్ మహిళా ప్లేయర్ మనికా బత్రా మూడో రౌండ్​లో ఓడిపోయింది. ఆస్ట్రియాకు చెందిన పోల్కనోవా సోఫియా చేతిలో 4-0 తేడాతో ఓటమిపాలై, నిష్క్రమించింది.

12:46 July 26

టాప్ న్యూస్​ @1PM

  • యడ్డీ రాజీనామా..

కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాటకీయతకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్‌ యడియూరప్ప తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని సోమవారం యడ్డీ స్వయంగా ప్రకటించారు. 

  • రాజ్యసభ రెండోసారి వాయిదా..

రాజ్యసభ రెండోసారి వాయిదా పడింది. విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సాధారణ కార్యకలాపాలు జరిగే అవకాశం లేనందున సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తెలిపారు. 

  • 'దళితబంధు' కార్యక్రమం కాదు.. ఉద్యమం..

దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం విజయవంతం చేయాలని సూచించారు. పథకం అమలు ప్రభావం యావత్ తెలంగాణపై ఆధారపడి ఉంటుందని వివరించారు. పథకం విజయవంతానికి అందరూ దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు.

  • విచారణ మరోసారి వాయిదా..

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను ఈ నెల 30కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

  • సుమిత్ నగాల్ ఔట్..

భారత షూటర్ అంగద్ వీర్ సింగ్.. టోక్యో ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించాడు. స్కీట్​ షూటింగ్ క్వాలిపికేషన్​ రౌండ్​లో 18వ స్థానంలో నిలవడం వల్ల ఫైనల్​కు అర్హత సాధించలేకపోయాడు. మరో షూటర్ మైరాజ్ అహ్మద్ ఖాన్​ 25వ స్థానంలో నిలిచాడు.

11:49 July 26

టాప్​ న్యూస్​ @12PM

  • ఉభయ సభలు వాయిదా..

పార్లమెంట్​లో విపక్షాల ఆందోళనలు ఆగడం లేదు. పెగాసస్​పై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబడటం వల్ల ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సమావేశం ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. 

  • అవగాహన సమావేశం ప్రారంభం..

దళిత బంధు పథకంపై ప్రగతిభవన్‌లో అవగాహన సమావేశం ప్రారంభమైంది. హుజూరాబాద్ నియోజకవర్గ ఎస్సీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పథకం లక్ష్యాలు, అమలు, కార్యాచరణను కేసీఆర్​ వారికి వివరించనున్నారు.

  • పాము కరిచినా చెప్పని చిన్నారి..

వివాహం జరిగి పదిహేనేళ్లయినా సంతానం కలగకపోవడంతో బంధువుల పాపను దత్తత తీసుకున్నారా దంపతులు. ఏడేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎనిమిదో పుట్టిన రోజు అమ్మమ్మ ఇంట్లో జరుపుకోవాలని వెళ్లిన ఆ చిన్నారి అందరికీ దూరమైపోతుందని ఎవరూ ఊహించలేదు. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచడమే ఆమె పాలిట మృత్యుశాపమైంది.

  • చరిత్రలో నిలిచిపోయిన భవానీ దేవి..

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత ఏకైక ఫెన్సర్ భవానీ దేవి చరిత్రలో నిలిచిపోయింది. తొలి రౌండ్​లో గెలిచిన ఆమె.. రెండో రౌండ్​లో ఓడి పోటీల నుంచి నిష్క్రమించింది. అయితే ఆమె పోరాటం స్పూర్తిదాయకంగా నిలిచింది.

  • రాహుల్ మద్దతు..

సాగు చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్​పై పార్లమెంట్​కు చేరుకున్నారు. పలువురు నేతలు సైతం రాహుల్ వెంట వచ్చారు.

10:51 July 26

టాప్​ న్యూస్​ @11AM

  • నా భక్తులను ఆదుకుంటాను..

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవంలో రంగం కార్యక్రమం ముగిసింది. ఇందులో స్వర్ణలత.. అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్నా.. తనను నమ్మి పూజలు చేయడం పట్ల అమ్మ సంతోషం వ్యక్తం చేసింది. తన భక్తులకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చింది.

  • నిరాశపర్చిన ఆర్చరీ, బ్యాడ్మింటన్​ జట్లు..

బ్యాడ్మింటన్​ పురుషుల డబుల్స్​లోనూ ఇండోనేసియా చేతిలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్​శెట్టి జోడి ఓడింది. వరుస సెట్లు కోల్పోవడం వల్ల 0-2 తేడాతో ఓటమిపాలైంది.

  • ఇనుపచువ్వలతో కొట్టి...

వారంతా మానవత్వాన్ని మరిచారు. జంతువులను హింసిస్తేనే కేసులు పెట్టే ఈ రోజుల్లో... ఇద్దరు యువకులను చావబాదిన ఘటన చోటు చేసుకుంది. ఆ వీడియో చూస్తేనే వారు ఎంత దారుణంగా హింసింపబడ్డారో తెలుస్తోంది. ఈ అమానుష ఘటన చార్మినార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.
 
  • పోలీసుల కొత్తపంథా..

పసి కందులు, చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసినవారే కదా అని అనుకుంటే.. నమ్మించి గొంతుకోస్తున్నారు. వావివరసలు మరచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లాలంటే.. తల్లిదండ్రులు జంకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురైన చిన్నారులను రక్షించేందుకు పోలీసులు కొత్తపంథా అనుసరిస్తున్నారు.

  • కట్టుకున్న భర్తనే కడతేర్చింది..

రూ. 45లక్షల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. ఈ కేసులో నిందితురాలితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

09:48 July 26

టాప్​ న్యూస్​ @10AM

  • 39,361 కరోనా కేసులు..

దేశంలో కొత్తగా 39,361‬ కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 416 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య కి పెరిగింది.

  • నటి జయంతి కన్నుమూత..

అలనాటి తార జయంతి(76) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

  • బంగారం ధరలు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర హైదరాబాద్​లో రూ.69 వేల పైన ట్రేడవుతోంది. పెట్రోల్, డీజిల్​ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.

  • నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 100 పాయింట్లకుపైగా కోల్పోయి 52,866 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 30 పాయింట్లకుపైగా తగ్గి 15,825 వద్ద కొనసాగుతోంది.

  • సుతీర్ధ ఓటమి..

టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సుతీర్ధ ముఖర్జీ.. రెండో రౌండ్​లో ఓడిపోయింది. పోర్చుగల్​ క్రీడాకారిణి యూ ఫూ చేతిలో 4-0 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్​ ప్రారంభం నుంచి ప్రత్యర్థి ప్లేయర్​ దూకుడు ప్రదర్శించగా, సుతీర్ధ కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది.

08:52 July 26

టాప్​ న్యూస్​ @9AM

  • భూ ప్రకంపనలు..

నాగర్​కర్నూల్ జిల్లాలో స్వల్ప భూకంపం(EarthQuake) సంభవించింది. ఉప్పునుంతల మండలాల్లో, అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 

  • తుది నిర్ణయం నేడే..

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆ రాష్ట్ర గవర్నర్​ను నేడు కలవనున్నారు. రాజీనామా ఊహాగానాలు ఊపందుకున్న వేళ గవర్నర్​ అపాయింట్​మెంట్​ను సీఎం కోరడంపై ఆసక్తి నెలకొంది.

  • మూడోదశ ముప్పుపై సన్నద్ధత..

పీజీ వైద్య విద్య నీట్‌ పరీక్ష కోసం సిద్ధమవుతున్న విద్యార్థులను, ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వారినీ, ఇంకా అవసరమైతే ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థులనూ కొవిడ్ విధులకు వినియోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు సూచించింది.
 
  • మిత్రుడే సామాజిక శత్రువు..

యువతులను, మహిళలనువేధించేవారిలో 90శాతం పరిచయస్తులే ఉంటారని చాలా సర్వేల్లో తేలింది. మహిళలకు ఎదురవుతున్న వేధింపుల్లో అత్యధికం ఫోన్‌తోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా చోటుచేసుకుంటున్నాయి. వారి వ్యక్తిగత వివరాలు సేకరించి.. ఆపై బెదిరింపులకు దిగుతున్నారు. యువత కూడా పరిచయమైన వారికి వెంటనే వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదంటున్నారు పోలీసులు.

  • మీరాబాయి చాను బయోపిక్..

టోక్యో ఒలింపిక్స్​లో రజత పతకం సొంతం చేసుకున్న వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్ బయోపిక్​ తెరకెక్కించేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట! ఇందులో బాలీవుడ్​ స్టార్స్​ ఇద్దరు నటించనున్నారని సమాచారం.

07:45 July 26

టాప్​ న్యూస్​ @8AM

  • మెరిసేదంతా విషం కావచ్చు..!

తాజాగా.. మంచి రంగులో మెరిసిపోతున్న కూరగాయలు (vegetables) , ఆకుకూరలు కొనుగోలు చేస్తున్నారా? అయితే అవి నిజంగా తాజాగా ఉన్నాయా... లేదా రసాయనాలతో నిండిపోయాయా అని ఒక్కసారి ఆలోచించండి!

  • శ్రీశైలమే కీలకం..

45 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులు శ్రీశైలంపైనే ఆధారపడి ఉన్నాయి. 400 టీఎంసీల్లో 34 టీఎంసీలకు మాత్రమే కేటాయింపు ఉంది. మిగిలినదంతా మిగులు జలాలపైనే ఆధారం. దీంతో నిర్వహణ, నీటి విడుదల సవాలుగా మారింది.

  • దిల్లీపై కన్నేసిన దీదీ..

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికై జాతీయ రాజకీయాలపై దీదీ దృష్టిసారించారు. భాజపాను గద్దే దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అమరుల సంస్మరణ ర్యాలీలో ఎప్పుడూ వామపక్షాలను విమర్శించే మమత.. ఈ సారి భాజపాపై ఎక్కుపెట్టడమే దీనికి నిదర్శనం. అయితే, ఆమెకు మద్దతుగా ప్రతిపక్ష, తటస్థ పార్టీలు ఎంత వరకు కలిసివస్తాయన్నదే ఆసక్తికరం. 

  • చేజారిన ఫైనల్​ బెర్తు..

'గురి' కుదరలేదు. 'తుపాకీ' ఇంకా పేలలేదు. పతకం కాదు.. పతకాలు గెలుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్లు వరుసగా రెండో రోజూ తీవ్ర నిరాశకు గురిచేశారు. షూటింగ్‌ బృందంలో అత్యధిక అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్‌ను 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో దురదృష్టం వెంటాడింది. తుపాకీలో సాంకేతిక లోపం తలెత్తి దాదాపు 20 నిమిషాల సమయం వృథా అయింది. అయినప్పటికీ ఆమె పోరాడినా.. త్రుటిలో ఫైనల్‌ బెర్తు చేజారింది. దీంతో ఓ పతకం చేజేతులా కోల్పోయినట్లయింది.

  • ఆ విషయాన్నే చెప్పా..

ఆర్‌.నారాయణమూర్తి సినిమాలో సామాన్యుడే హీరో. అతను ఎదుర్కొంటున్న సమస్యే కథ. అతని విజయమే హీరోయిజం. అందుకే ఆ సినిమాలు అందరి హృదయాలకూ చేరువవుతాయి. మూడున్నర దశాబ్దాలుగా తాను నమ్మిన బాటలోనే ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు ఆర్‌.నారాయణమూర్తి. ఆయన తాజా చిత్రం 'రైతన్న'. సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ..

06:45 July 26

టాప్​ న్యూస్​ @7AM

  • 24 గంటల్లో 26 టీఎంసీలు..

ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలానికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 4 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చింది. మరోవైపు గోదావరి శాంతించింది. నదిలో వరద ఉద్ధృతి తగ్గింది.

  • నగరాలపై జలఖడ్గం..

ఆకాశానికి చిల్లులు పడినట్టు కురిసే జడివానల మూలంగా ముంచెత్తే వరదలతో ఇండియా తరచూ ఇక్కట్లపాలవుతూనే ఉంది. వీటి వల్ల దేశానికి ఏటా రూ. 52వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని అంచనా! ముఖ్యంగా పట్టణభారతంలో సంభవిస్తున్న వరదలతో కోట్ల మందికి కన్నీళ్లు మిగలడమే కాదు, ఆర్థిక వ్యవస్థ సైతం దెబ్బతింటోంది.

  • నిర్లక్ష్యం తగదు..

దేశంలో మెజారిటీ ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు(Herd Immunity) నివేదికలు వస్తున్నాయి. అయినా కొవిడ్ నియమావళి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని ఐసీయూ విభాగాధిపతి డాక్టర్‌ యుధ్యవీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. సరైన జాగ్రత్తలు పాటించకుంటే వైరస్‌ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
 
  • అమెజాన్​ ఆఫర్ల బొనాంజా!

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వార్షిక 'ప్రైమ్‌ డే సేల్‌' జులై26 నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆ సంస్థ ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది.

  • సాధించే సత్తా ఉంది..

యుద్ధం, మతపరమైన ఆంక్షలు.. ఇలా ఎన్నో కారణాలతో ప్రాణాలు అరచేత పెట్టుకుని దేశ సరిహద్దులు దాటారు. పక్కదేశంలో తలదాచుకున్నారు. మనుగడే ప్రశ్నార్థకమైన చోట ఆటను ఆసరాగా చేసుకున్నారు. వారంతా శరణార్థి బృందంగా (రెఫ్యూజీ టీమ్‌(Refugee Olympic Team)) ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశమూ దక్కించుకున్నారు. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. కష్టాలను పక్కనపెట్టి చరిత్రలో తమకంటూ ఒక పేజీ లిఖించుకోవడానికి ప్రయత్నిస్తోన్న వారిలో కొందరి స్ఫూర్తి కథనాలివీ!

05:29 July 26

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

  • మన రామప్పకు విశ్వఖ్యాతి..

కల ఫలించింది.. కాకతీయుల కళావైభవానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. క్రీ.శ. 1213లో గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్లరుద్రుడు ఇసుక పునాదులపై నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యునెస్కో చారిత్రక సంపదగా గుర్తించింది. తెలుగు నేలపై ఈ ఘనత సాధించిన తొలి నిర్మాణమిది. శిల్పి పేరుతో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోనే కొలువైన ఈ ప్రఖ్యాత ఆలయం.. నేడు తాజ్‌మహల్‌, ఎర్రకోట వంటి కట్టడాల సరసన సగర్వంగా నిలిచింది.

  • రామప్ప ప్రత్యేకతలే కారణం..

రామప్ప ఆలయ ప్రత్యేకతలే ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకువచ్చాయని విశ్రాంత ఆచార్యులు, కాకతీయ హెరిటేజ్ సభ్యులు పాండురంగారావు అన్నారు. ఇది ప్రభుత్వ సహకారంతో సాధ్యపడిందని వెల్లడించారు. గుర్తింపు ఇచ్చే క్రమంలో.. రామప్ప విశిష్టతల గురించి యునెస్కో ప్రతినిధులు దాదాపు గంటన్నర చర్చించారని తెలిపారు.

  • తొలి అవగాహన సదస్సు..

దళితబంధు పథకం అమలు కార్యాచరణపై నేడు అవగాహన సదస్సు జరగనుంది. పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్న హుజురాబాద్ నియోజకవర్గ దళితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. దళితబంధు పథకం ముఖ్య ఉద్దేశం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం అవగాహన కల్పించనున్నారు.

  • కొత్త రేషన్​కార్డులకు నేడే శ్రీకారం..

రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రేషన్​కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. జయశంకర్ భూపాలపల్లిలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా 3 లక్షల 9 వేల 83 రేషన్ కార్డుల ద్వారా.. 8 లక్షల 65 వేల 430 మంది లబ్ధి పొందనున్నారు. నెలకు అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఏటా రేషన్​పై రూ.2,766 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం వెచ్చించనుంది.

  • సీబీఐ ఏం చెప్పబోతోంది..?

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్​పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. రఘురామ, జగన్ ఇప్పటికే వాదనలు వినిపించటంతో పాటు కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. నేడు సీబీఐ తన వాదనలను సమర్పించనుంది.

  • దాయాదిపై అసామాన్య విజయం..

భారత్‌ శాంతికాముక దేశం. కానీ, శాంతి కోరుకునే ఆ స్వభావాన్ని తక్కువ అంచనా వేసి.. ఎవరైనా చోరబాటుకు యత్నిస్తే చెంపపెట్టులాంటి సమాధానమివ్వటంలో దిట్ట భారత సైన్యం. తాజాగా సరిహద్దులో డ్రాగన్‌ దురాక్రమణను దుయ్యబట్టి.. చేతలతోనే చైనాకు గట్టిగా బుద్ధిచెప్పింది. ఇలా బుద్ధిచెప్పటం, అవసరమైతే బాంబులతో బదులు చెప్పటం దేశానికి కొత్తేమి కాదు.

  • 'మహా విపత్తు'

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 149కి పెరిగింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా.. 64 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేసింది ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం.

  • అపసవ్య దిశలో అమెరికా..

అమెరికా అపసవ్య దిశలో ప్రయాణిస్తోందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించడం పట్ల అమెరికా అధికారులను డాక్టర్‌ ఫౌచీ మరోసారి హెచ్చరించారు.

  • లంకపై భారత్ విజయం..

ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20​లో టీమ్ఇండియా 38 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. దీంతో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో ధావన్​ సేన 1-0తో ముందంజ వేసింది.

  • నిలువెత్తు అభిమానం..

తమిళ సినీనటుడు విజయ్​కి అభిమానులు చాలా మందే ఉన్నారు. అయితే.. కర్ణాటకకు చెందిన అభిమానులు విజయ్​పై నిలువెత్తు అభిమానం చాటుకున్నారు. ఏకంగా పెద్ద విగ్రహాన్ని కట్టించి నటుడికి బహుమానంగా ఇచ్చారు.

Last Updated : Jul 26, 2021, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.