ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Jul 24, 2021, 6:02 AM IST

Updated : Jul 24, 2021, 9:48 PM IST

21:47 July 24

టాప్​ న్యూస్​ @ 10PM

  •  పైకి తేలిన భూమి!

హరియాణా కర్​నాల్​లోని కుచ్పురా గ్రామంలో ఓ వింత ఘటన జరిగింది. వర్షం కారణంగా నీట మునిగిన ఓ పొలం అనూహ్యంగా పైకి తేలింది. 2 నుంచి 3 ఫీట్లు ఎత్తుకు లేచింది. ఆశ్చర్యానికి గురైన స్థానికులు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • ఖాళీలను త్వరగా భర్తీ చేయాలి

వైద్యారోగ్య శాఖలో ఉన్న ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని సీఎస్ సోమేశ్ ​కుమార్​ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖలో మౌలిక సదుపాయాల బలోపేతంపై సమీక్ష నిర్వహించారు.

  • ప్రభుత్వ అసమర్థతతోనే..

ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఎంపీలు ఉత్తమ్​ కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతతోనే రాష్ట్రానికి కేంద్రం.. నదీ జలాల విషయంలో వ్యతిరేకంగా నోటిఫికేషన్​ జారీ చేసిందని ఆరోపించారు.

  • మాస్కులు, కరోనా కిట్లతో

బెంగళూరులోని ఓ సాయిబాబా ఆలయాన్ని కరోనా మాస్కులు, పోషక పదార్థాలతో అలంకరించారు నిర్వాహకులు. గురు పౌర్ణమి సందర్భంగా చేసిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

  • రణ్​వీర్​ నయా లుక్..​  

బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్​ సింగ్ ముంబయి​ ఎయిర్​పోర్ట్​లో తళుక్కుమన్నాడు. అతడు ధరించిన దుస్తులు మరోసారి నెట్టింట హాట్​ టాపిక్​గా మారాయి. అలాగే ఇదే విమానాశ్రయంలో కనిపించింది నటి రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్​లో సిద్దార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను', అమితాబ్​తో 'గుడ్​ బై' చిత్రాల్లో నటిస్తోందీ భామ.

20:43 July 24

టాప్​ న్యూస్​ @ 9PM

  • దళిత బంధు కోసం రూ.లక్ష కోట్లు

దళితబంధు పథకానికి దశలవారీగా 80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కాళ్లు, చేతులు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని స్పష్టం చేశారు.

  • 647 మందికి సోకిన వైరస్..

రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందగా... మరో 647 మందికి వైరస్​ సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,625 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

  • నిండుకుండల్లా ప్రాజెక్టులు..

ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో.. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటోంది. శ్రీశైలానికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. నాగార్జున సాగర్‌కూ వరద ప్రవాహం కొనసాగుతోంది.

  • అంతరిక్ష పర్యటనపై ఆసక్తా?  

రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా బిలియనీర్ల అంతరిక్ష యాత్రలు ఈ నెలలో విజయవంతం అయ్యాయి. దీంతో చాలా మంది స్పేస్​ టూరిజం వైపు అడుగులు వేస్తున్నారు. కొందరైతే ఇప్పటికే ఆయా సంస్థలకు పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి టికెట్లు కూడా బుక్​ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష పర్యాటకం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..

  • యుద్ధ సన్నద్ధత..

భారత సరిహద్దుల్లో మోహరించిన టిబెట్​ మిలిటరీ ఉన్నతాధికారులతో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టిబెట్​లో స్థిరత్వానికి కృషి చేయాలని సూచించారు. అలాగే.. సైనికుల శిక్షణ, అన్ని విధాలుగా యుద్ధ సన్నద్ధతను బలోపేతం చేయాలని అధికాలను ఆదేశించారు.

19:46 July 24

టాప్​ న్యూస్​ @ 8PM

  • దళిత బంధు కోసం రూ.లక్ష కోట్లు: సీఎం

దళితబంధు పథకానికి దశలవారీగా 80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయలకు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని అన్నారు.

  • ఒలింపిక్స్​లో నారీశక్తి

వరుసగా మూడో ఒలింపిక్స్​లో భారత మహిళ అథ్లెట్లు పతకాన్ని కైవసం చేసుకున్నారు. 2012, 2016 విశ్వక్రీడల్లో ఇద్దరేసి మహిళా క్రీడాకారులు మెడల్స్​ సాధించగా.. తాజాగా మీరాభాయ్​ అదే ఒరవడిని కొనసాగిస్తూ సిల్వర్​ మెడల్​ను గెలుపొందింది.

  • జూరాలకు పోటెత్తిన వరద..

జూరాలకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. దీంతో 32 గేట్లు ఎత్తి 2 లక్షల 97 వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.567 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 6.310 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు.

  • పక్కటెముకలు విరిగేలా కొట్టారు: రేవంత్‌

ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ పరామర్శించారు. నారాయణగూడలోని ఆయన నివాసంలో కలిసిన నాయకులు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

  • రిజిస్ట్రేషన్​ విలువ పెంపుపై గగ్గోలు..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన రిజిస్ట్రేషన్​ ఛార్జీలను సామాన్యులు వ్యతిరేకిస్తున్నారు. భూములు విలువ పెంచటం వల్ల విక్రయదారులకు కాస్త లాభం చేకూరినా.. కొనుగోలుదారులకు భారం పడుతోందని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతోన్న రియల్​ఎస్టేట్​ రంగంపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

18:50 July 24

టాప్​ న్యూస్​ @ 7PM

  • గోదావరి ఉగ్రరూపం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరిలో భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు.  

  • అభినందనల వెల్లువ

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఓ​ పతకం చేరటం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రజత పతకం సాధించిన మీరాబాయి చానును  కేసీఆర్​ అభినందించారు.

  • మరోసారి  గడువు పొడిగింపు

దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.ఈనెల 28 వరకు గడవు పొడిగిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు.  

  • ఆలయానికి స్థలం ఇచ్చిన ముస్లింలు

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి​ ఆలయానికి 1700 చదరపు అడుగుల స్థలాన్ని అందించారు ముస్లింలు. ఆలయ కారిడార్​ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆ స్థలం అవసరమైందని, అందరి సమ్మతితోనే ఇచ్చినట్లు ముస్లిం పెద్దలు తెలిపారు. ఈ నిర్ణయంతో రెండు మతాల మధ్య సామరస్యం, సోదరభావం పెంపొందుతుందనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు. అయితే.. వివాదంలో ఉన్న స్థలానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

  • 'హీరో' ఎలా ఉందంటే?

ఎం.భరత్‌రాజ్‌ దర్శకత్వంలో రిషభ్‌శెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'హీరో'. కరోనా కాలంలో అతి తక్కువ మందితో ఒకే లొకేషన్‌లో ఈ సినిమాను పూర్తి చేశారు. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా తెలుగులో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

17:47 July 24

టాప్​ న్యూస్​ @ 6PM

  • పెరుగుతున్న గుండె పరిమాణం!

గుజరాత్​ రాజ్​కోట్​లో 70 కార్డియోమెగాలి కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొవిడ్​ నుంచి కోలుకున్నవారిలోనే ఈ వ్యాధి తీవ్రత ఉన్నట్లు పేర్కొన్నారు.

  • పెగాసస్​తో కోట్ల మంది..

పెగాసస్​ లాంటి సాఫ్ట్​వేర్​లతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని చెప్పింది దాని రూపకర్త ఎన్​ఎస్​ఓ గ్రూప్(NSO Pegasus). విద్రోహ శక్తులను అణిచివేయడంలో ప్రభుత్వాలకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపింది.

  • ఎమ్మెల్యేకు చేదు అనుభవం...

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఎమ్మెల్యేను జనగామ జిల్లా నర్మెట్ట మండలం రత్నతండా గ్రామస్థులు నిలదీశారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని ముత్తిరెడ్డి తెలపటంతో గ్రామస్థులు శాంతించారు.

  • నువ్వెక్కడ సచ్చినవ్...

మంత్రి గంగుల కమలాకర్.. (Minister gangula kamalakar) కరీంనగర్​ జిల్లాలో భూమి పూజ కార్యక్రమానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ మహిళ మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఇల్లు నిర్మాణం కోసం ఆర్జి పెట్టుకుంటే.. సర్పంచ్ అనుమతి ఇవ్వట్లేదని మంత్రికి చెప్పారు. ఇక మంత్రి సెక్రటరీకి ఫోన్​ చేసి... సీరియస్​ అయ్యారు. అసలేం జరిగిందంటే...?

  • ప్రేక్షకుల్ని నిరాశపరచదు

తేజ సజ్జా, ప్రియా వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఇష్క్: నాట్ ఏ లవ్​స్టోరీ' సినిమా జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ముచ్చటించిన తేజ పలు విషయాలు వెల్లడించాడు.

16:44 July 24

టాప్​ న్యూస్​ @ 5PM

  • హుజూరాబాద్​పై కేసీఆర్ మాస్టర్​ ప్లాన్

హుజూరాబాద్​ ఉపఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్​.. నేరుగా రంగంలోకి దిగారు. హుజూరాబాద్​ వేదికగా ప్రారంభించబోతోన్న దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసేందుకు... క్షేత్రస్థాయిలో ఉన్న నేతలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను నిర్వీర్యం చేసేందుకు నియోజకవర్గంలోని మండలస్థాయి నేతలతో ఈ నెల 26న ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం కానున్నారు. దీని కోసం... ఓ మండలస్థాయి నేతతో ఫోన్​లో మాట్లాడిన ఆడియో క్లిప్​... సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

  • హైకోర్టు కీలక ఆదేశం

సామాజిక వైద్యుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. పారామెడిక్స్​కు శిక్షణ ఇవ్వాలన్న వినతిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. చట్టానికి అనుగుణంగా వీలైనంత త్వరగా వినతిపత్రాన్ని పరిగణించాలని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది.  

  • తగ్గిన పల్స్​ ఆక్సీమీటర్ ధర

కొవిడ్​ మహమ్మారి సమయంలో అత్యవసరంగా మారిన పల్స్​ ఆక్సీమీటర్​, బీపీ మిషన్​, నెబ్యూలైజర్​ వంటి ఐదు వైద్య పరికరాల ధరలు భారీగా తగ్గాయి. ప్రతిఒక్క వస్తువుపై 88 శాతం వరకు ధరలు దిగొచ్చినట్లు కేంద్రం తెలిపింది.

  • రియో పాఠాలతో.. టోక్యోలో పతకం

భారత వెయిట్​లిఫ్టర్​ మీరాభాయ్​ చాను.. టోక్యోలో వెండి పతకంతో మెరిసింది. గత రియో ఒలింపిక్స్​లో కనీస ప్రదర్శన ఇవ్వలేక చతికిలపడిన మీరా.. ఆ వైఫల్యం నుంచి ఎంతో నేర్చుకున్నానని పేర్కొంది. ప్రస్తుత విశ్వక్రీడల్లో భారత్​కు తొలి పతకం సాధించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

  • బాక్సింగ్​లో డీలా..

టోక్యో ఒలింపిక్స్​ బాక్సింగ్​ పోటీల్లో వికాశ్​ కృష్ణన్​ డీలాపడ్డాడు. పురుషుల 69 కేజీల విభాగంలో గ్రూప్​ దశలోనే ఓడిపోయాడు. వికాశ్​పై జపాన్​కు చెందిన ఒకజావా గెలుపొందాడు.

16:03 July 24

టాప్​ న్యూస్​ @ 4PM

  • ఫలితాలు విడుదల

10,12 వ తరగతుల ఫలితాలను వెల్లడించింది సీఐఎస్​సీఈ(CISCE) బోర్డు. శనివారం 3 గంటలకు ఫలితాలను విడుదల చేసింది.

  • రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి వస్తోన్న భారీ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు 47.30 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.  నీటిమట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం గోదావరి వరద  ప్రవాహం 11,41,10 క్యూసెక్కులుగా ఉంది.  

  • 5 కొమ్ముల పొట్టేలు..

పొట్టేలుకు రెండు కొమ్ములు ఉండటం సాధారణమే. అయితే.. అంతకు మించి కొమ్ములతో ఉంటే ఆశ్చర్యమే కదా. నైజీరియాలోని ఓ పొట్టేలు ఐదు కొమ్ములతో అబ్బురపరుస్తోంది.

  • జొమాటోకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

జొమాటో.. ప్రస్తుతం ఈ పదం తెలియని వారుండరు. అంతలా ప్రజల నోళ్లలో నాటుకుపోయింది ఈ పదం. అయితే జొమాటోకు ఆ పేరు రావటానికి వెనుక ఓ ప్రస్థానమే ఉంది.. అదేంటో తెలుసుకుందామా..?

  • దయచేసి జాగ్రత్తగా ఉండు

యువ నటుడు నాగశౌర్యను జాగ్రత్తగా ఉండాలని సూచించారు రానా దగ్గుబాటి. అసలేం జరిగిందో తెలుసుకోండి.

14:46 July 24

టాప్​ న్యూస్​ @3PM

  • మెరిసిన మీరా..

టోక్యో ఒలింపిక్స్​లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. శనివారం జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన మీరాబాయి చాను.. వెండి పతకం అందుకుంది. మరోవైపు టీటీ ప్లేయర్ మనికా బత్రా, డబుల్స్​ షట్లర్లు సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ, హాకీ పురుషుల జట్టు, టెన్నిస్ ప్లేయర్ సుమిత్​ నగాల్.. తమ తమ మ్యాచ్​ల్లో విజయం సాధించారు.

  • మూడురోజుల పాటు ఆ జిల్లాల్లో వర్షాలే!

తెలంగాణలో మూడ్రోజుల పాటు తేలికపోటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) తెలిపింది. ఇవాళ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

  • నా ప్రమేయం లేదు

వైఎస్‌ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి... వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్న చేసిన ఆరోపణలపై స్పందించారు. రంగన్నతో తనకు పరిచయమే లేదని చెప్పారు. తానెవరినీ బెదిరించలేదని తెలిపారు. వివేకా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని ఎర్రగంగిరెడ్డి వివరించారు.

  • వ‌డ్డీ చెల్లించాల్సిందే

కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పిస్తూ.. గతంలో ఆదాయ పన్ను రిటర్ను(ITR)ల గడువును పెంచింది. అయితే, జరిమానా వడ్డీ ఛార్జీలపై ఎలాంటి మినహాయింపు లేదని తాజాగా స్పష్టం చేసింది. వీటిని యథావిధిగా చెల్లించాలని తెలిపింది.

  • ప్రభాస్ ప్రతిష్ఠాత్మక సినిమా

డార్లింగ్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్​లోని సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తొలిరోజు అమితాబ్​పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

13:40 July 24

టాప్​ న్యూస్​ @2PM 

  • విద్యార్థులకు మూక్స్​ కోర్సులు 

ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో స్వయం సమృద్ధి కోర్సులకు ఈ ఏడాది నుంచి వీడియో పాఠాలు బోధించనున్నారు. మూక్స్ కోర్సులను విద్యార్థులకు సమకూర్చేందుకు ఈఎంఆర్​సీతో రాష్ట్ర కళాశాల విద్య కమిషనరేట్ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా మీడియా కేంద్రాలు రూపొందించిన అంశాలను రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉండేలా ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ కన్సార్టియంతో ఒప్పందం జరిగింది.

  • దారుణం 

కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళ్లిన బాలికపై కిరాతుకులెవరో హత్యాచారానికి పాల్పడ్డారు. కర్ణాటకలో ఈ అమానవీయ ఘటన జరిగింది.

  • కన్నతల్లే

ఓ మహిళ.. అభంశుభం తెలియని తన నలుగురు కుమార్తెలను చెరువులో పడేసింది. అందులో ముగ్గురు మృతిచెందగా.. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

  • ప్రశంసల వెల్లువ 

టోక్యో ఒలిపింక్స్​లో వెండి పతకంతో మెరిసిన మీరాబాయి చానుకు ప్రశంసల వెల్లువ దక్కుతోంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు.. పలువురు క్రీడా ప్రముఖులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

  • సినిమా అప్​డేట్స్​

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ ఖిలాడీ, హిందీ ఓటీటీ బిగ్​బాస్, ఇష్క్, బిచ్చగాడు 2 చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

12:35 July 24

టాప్​ న్యూస్​ @1PM 

  • భారత్​కు తొలి పతకం

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకం దక్కింది. మహిళల 49 కేజీల విభాగంలో.. వెయిట్​ లిఫ్టల్​ మీరాబాయి చాను రజతం గెల్చుకుంది. ఒలింపిక్స్​లో రజత పతాకం సాధించిన తొలి వెయిట్​ లిఫ్టర్​గా ఘనత సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.

  • కేటీఆర్ హవా

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు కేటీఆర్​కు బర్త్​డే విషెస్ తెలియజేస్తున్నారు. తెరాస కార్యకర్తలు మొక్కలు నాటి మంత్రిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు.

  • ఉద్యోగ అవకాశాలు

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గమనిక. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు.. ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాయి. వాటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, చివరి తేదీ వంటి వివరాలు మీకోసం.

  •  కుర్చీలాట

దక్షిణ భారతదేశంలో భాజపా అధికారంలోకి వచ్చిన తొలి రాష్ట్రం కర్ణాటక(Karnataka Politics). ప్రస్తుతం కమల దళం అధికారంలో ఉన్న ఏకైక దక్షిణాది రాష్ట్రం కూడా అదే. కర్ణాటకలో ఇప్పటి వరకు ఆరుసార్లు భాజపా సర్కారు ఏర్పాటు చేసినా ఏ ముఖ్యమంత్రీ ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగలేదు. ఇప్పుడూ అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది.

హర్మన్‌ప్రీత్‌ మాయ..

ఒలింపిక్స్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. పురుషుల హాకీలో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఘన విజయం సాధించింది. 3-2 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (26ని, 33ని) రెండు గోల్స్‌తో దుమ్మురేపగా మాజీ సారథి, గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ప్రత్యర్థి పాయింట్లను అడ్డుకున్నాడు. గోల్‌పోస్ట్‌ వద్ద గోడలా నిలబడ్డాడు. రూపిందర్‌పాల్‌ సింగ్‌ (10 ని) మొదటి గోల్‌ చేశాడు.

11:46 July 24

టాప్​ న్యూస్​ @12PM 

  • హ్యాపీ బర్త్​డే కేటీఆర్​

మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ​ మొక్కలు నాటారు.

  • ఒకే కాన్పులో ముగ్గురు 

అనంతపురం జిల్లా గుంతకల్లు స్వప్న నర్సింగ్ హోంలో ఒకే కాన్పులో ముగ్గురు పండంటి పిల్లలు పుట్టారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉండగా.. మరో బాబుకు ఆయాసం ఉన్నట్టు గుర్తించిన వైద్యులు.. చికిత్స అందిస్తున్నారు.

  • 'శత్రుత్వాన్ని ప్రేమతో జయించాలి' 

కరోనాతో మనావతా సంక్షోభం ఎదురవుతున్న ప్రస్తుత సమయంలో బుద్ధుడి బోధనలు ఎంతో అనుసరించదగినవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ బోధనల శక్తిని ప్రపంచమంతా గ్రహించిందని తెలిపారు.

  • 'లవర్స్​తో కలిసి..' 

ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను అంతమొందించాలనుకుంది ఓ మహిళ. నాలుగో అంతస్తు నుంచి అతడ్ని కిందకు తోసేసింది. గాయాలపాలయిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • ఒలింపిక్స్​ తెలుగు రాకెట్​

ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం ప్రతి క్రీడాకారుడి కల. ఏపీలోని అమలాపురం కుర్రాడు సాత్విక్‌ ఇరవై ఒక్క ఏళ్లకే ఆ ఘనత అందుకున్నాడు. ఐదేళ్ల నుంచి వరుస విజయాలు సాధిస్తున్న ఈ అర్జున అవార్డీ ఒలింపిక్స్‌లో పతకంతో తిరిగొస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. చిన్న పట్టణంలో పుట్టి, ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా మేటి ఆటగాడుగా ఎదిగిన వైనంతో.. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.

10:43 July 24

టాప్​ న్యూస్​ @11AM 

  • అందుకే రాజీనామా చేశా.. 

కేసులతో తనను భయపెట్టలేరని... బడుగు బలహీనవర్గాల గొంతుక అయ్యేందుకే తాను ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటికీ దేశంలో ఎస్సీ, ఎస్టీలు అణచివేతకు గురవుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • వరద విలయం 

మహారాష్ట్ర రాయ్​గఢ్​లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం. మరో 50 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

  • విపక్షాల ఆయుధం

పెగాసస్ స్పైవేర్ వివాదం భారత్​ను అంతర్జాతీయంగా చిక్కుల్లోకి నెట్టేలా ఉంది. అమెరికా, ఐరోపా సంస్థలపై నిఘా వేశారన్న వార్తలపై ఆయా దేశాలు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. దేశంలోనూ విపక్షాలకు ఇదో బలమైన ఆయుధంగా మారింది. పెగాసస్‌ అంశాన్ని అజెండాగా చేసుకుని ఎన్​డీఏ సర్కారుకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • తగ్గిన పసిడి ధరలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు(Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. వెండి ధర సైతం దిగివచ్చింది. ప్రధాన నగరాల్లో పది గ్రాముల మేలిమి పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • స్ఫూర్తిని నింపేందుకే.. 

టోక్యో ఒలింపిక్స్​లో (Tokyo Olympics)​ పాల్గొన్న భారత అథ్లెట్లలో ఉత్సాహాన్ని నింపేందుకు ఇటీవల 'చీర్​ ఫర్​ ఇండియా' పేరుతో ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. అనన్య బిర్లా ఈ పాటను రాసి, స్వరాన్ని అందించగా.. ఏఆర్​ రహ్మాన్​ స్వరకల్పన చేశారు. ఈ గీతానికి పది కోట్లకు పైగా వ్యూస్​ వచ్చాయి. ఇంతకీ ఈ అనన్య ఎవరు? ఆమె లక్ష్యం ఏంటి? ఈ పాట గురించి ఆమె ఏం చెబుతోంది?

09:53 July 24

టాప్​ న్యూస్ @ 10AM

  • ‘తల్లి’డిల్లిన ప్రాణాలు

చిన్నారి జలుబు.. అమ్మకు గుబులు రేపింది. బిడ్డకు ఊపిరాడటంలేదని.. ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అర్ధరాత్రి అయోమయం.. మందులు తీసుకొచ్చేందుకని వెళ్లిన ఆ అమ్మను మృత్యువు వెంటాడింది. రెండేళ్ల బుజ్జాయికి కన్నీటిని మిగిల్చింది.

  • పెరిగిన కరోనా కేసులు 

దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే కాస్త పెరిగాయి. కొత్తగా 39,097 మందికి వైరస్(Covid 19 India)​ సోకగా 35,087 మంది కోలుకున్నారు. 546 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • 'దుర్వినియోగం నిజమే'

కొంత మంది వినియోగదారులు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను(Pegasus Software) దుర్వినియోగం చేసిన మాట వాస్తవమేనని దాని రూపకర్త షలీవ్ హులియో అంగీకరించారు. నాయకులపై నిఘా వ్యవహారం కొందరు చేసిన చెత్తపనిగా అభివర్ణించారు. తమ సాఫ్ట్‌వేర్‌ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రాణాలు కాపాడిందో చెప్పగలమని... కానీ, ఆ విషయాలను ప్రస్తావించదలుచుకోలేదని షలీవ్‌ పేర్కొన్నారు.

  • షూటింగ్​లో నిరాశ 

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలిరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఆర్చరీలో జోష్​ చూపిన మిక్స్​డ్ టీమ్​ క్వార్టర్స్​ చేరుకోగా.. షూటింగ్​లో మహిళలు నిరాశపరిచారు.

  • సాయేషాకు పండంటి బిడ్డ

తమిళ హీరో ఆర్య-సాయేషా దంపతులకు తల్లిదండ్రులుగా ప్రమోషన్​ వచ్చింది. సాయేషాకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. 2019లో వీరిద్దరికీ వివాహమైంది.

08:40 July 24

టాప్​ న్యూస్ @ 9AM

  • మొదటి ప్రమాద హెచ్చరిక 

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. తీరప్రాంతాల్లో ఎడతెరిపినివ్వని వానతోపాటు ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. ఉదయానికి నీటిమట్టం 43 అడుగులకు చేరటంతో... అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. 

  • జ్ఞానం పుట్టినరోజే గురుపూర్ణిమ

పుట్టిన రోజు ఇష్టపడని వారుండరు. ప్రతి మనిషీ ఏదో ఒకరోజు పుడతాడు. పెరిగి, పెద్దవాడై జ్ఞానవంతుడవుతాడు. జ్ఞానానికి పుట్టుక ఉంది. జ్ఞానం పుట్టినరోజే గురువు పుట్టినరోజు. గురువంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. ఆ జ్ఞానం జన్మదినోత్సవం జరుపుకొనే రోజే గురుపూర్ణిమ. 

  • మద్యం ఆన్​లైన్​ విక్రయాలకు ఆ రాష్ట్రం గ్రీన్​సిగ్నల్​

ఆన్​లైన్ మద్యం అమ్మకాలకు మరో రాష్ట్రం పచ్చజెండా ఊపింది. ఆన్​లైన్ విక్రయాల తొలి విడతను ప్రారంభించింది. విదేశీ మద్యం, బీర్లు, నాటు సారా వంటి ఉత్పత్తులను విక్రయించనున్నట్లు స్పష్టం చేసింది. 

  • చైనా బోణీ

టోక్యో ఒలింపిక్స్​-2020లో చైనా బోణీ కొట్టింది. తొలి బంగారు పతకం ఆ దేశాన్నే వరించింది. మహిళల షూటింగ్​ 10. మీ ఎయిర్​ రైఫిల్​ విభాగంలో యాంగ్​ క్యాన్​ ఈ ఘనత సాధించింది.

  • వీళ్ల వయసు అస్సలు తెలియదు!

40-50 ఏళ్లు దాటితే శరీరంపై దృష్టి సారించడంలో చాలామంది అశ్రద్ధ చూపిస్తుంటారు. కానీ ఆ వయసులో బాడీని కంట్రోల్​లో ఎలా ఉంచుకోవచ్చో చెబుతున్నారు ఈ కథానాయకులు. ఇంతకీ వాళ్లు ఏం చెప్పారు?

07:48 July 24

టాప్​న్యూస్ @ 8AM

  • దళిత బంధు యాప్

ఎస్సీల స్వీయ ఆర్థిక సాధికారత కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు(Dalit Bandhu) పథకం కోసం ఆన్​లైన్ దరఖాస్తుకు ప్రత్యేక మొబైల్ యాప్​ను అభివృద్ధి చేయనుంది తెలంగాణ సర్కార్. వెబ్ పోర్టల్​తో పాటు యాప్​ను ఈ నెలాఖరులోగా సిద్ధం చేయాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్​ సంస్థకు బాధ్యతలు అప్పగించింది.

  •  ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

సిలిండర్​ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. మృతులంతా మధ్యప్రదేశ్ చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

  • ఇంజినీరింగ్‌, ఫార్మసీ యాజమాన్యాలకు షాక్‌

రాష్ట్రంలోని 30 ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు కొత్త ప్రిన్సిపాళ్ల నియామకం కోసం 33 మందిని ప్రతిపాదించగా 30 పేర్లను వర్సిటీ తిరస్కరించింది. అవి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2019 నిబంధనలకు అనుసరించి లేవని పేర్కొంది.

  • కీలక సిఫార్సులు

విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు తగ్గినా, విమానసేవల నిర్వాహకులు ఆ ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదిలీ చేయడంలేదని టీజీ వెంకటేశ్‌ నేతృత్వంలోని రవాణా, పర్యాటక విభాగాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆక్షేపించింది. దేశ పౌరవిమానయాన రంగ పరిస్థితులపై ఈ కమిటీ అధ్యయనం చేపట్టి, పార్లమెంటుకు శుక్రవారం నివేదిక సమర్పించింది. ఎకానమి తరగతి విమాన ఛార్జీలకు పరిమితులు విధించాలని సిఫార్సు చేసింది.

  • మరదల్ని లీడ్‌గా పెట్టి.. కొత్త యాప్‌!

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్​కుంద్రాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శిల్పాశెట్టి చెల్లెలు అయిన షమితా శెట్టితో ఓ రియాల్టీ షో చేసేందుకు ప్రణాళికలు చేశారని తెలిసింది. ఈ మేరకు నటి గహనా వశిష్ఠ్‌ ఓ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

06:46 July 24

టాప్​ న్యూస్​ @7AM 

  • వరుణుడి ప్రతాపం 

భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అయిదుగురు మృతి చెందారు. ఉత్తర తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. వరంగల్‌-భూపాలపట్నం జాతీయ రహదారిపై కటాక్షాపూర్‌ చెరువు మత్తడి ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.

  • రుణానికి అనుమతి 

సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణ తీసుకోనుంది. పవర్ పైనాన్స్​ నుంచి రూ.3,426 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అందుకు సంబంధించిన విధివిధానాల్లో మార్పులు, చేర్పులకు ఆమోదం తెలిపింది.

  • 'మహా' వరదలు

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు ధాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలతో సంబంధం తెగిపోయింది. ఇక రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆరు జిల్లాలకు రెడ్​ అలర్ట్​ ప్రకటించారు అధికారులు. గడిచిన 48 గంటల్లో 129 మంది మరణించినట్లు తెలిపారు.

  • డేంజర్​ డెల్టా!

డెల్టా వేరియంట్(Delta variant)​..ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా రకం. ఈ కొత్త రకం వైరస్​తో పలు దేశాల్లో కేసులు (Corona cases) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో డెల్టాతో వైరస్​ రెండోసారి సోకే ప్రమాదం అధికంగా ఉందని హెచ్చరించింది బ్రిటన్​. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

  • రిలయన్స్​ జోష్​

కరోనా నేపథ్యంలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంతృప్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌లో ఈ కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.12,273 కోట్లుగా నమోదైంది. రిలయన్స్​కు చెందిన ఓ2సీ, డిజిటల్‌ వ్యాపారాలు రాణించాయి.

05:25 July 24

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

  • జోనల్​ నిబంధనలు తప్పనిసరి..

అన్ని రకాల ఉద్యోగ నియామకాలు సహా పదోన్నతులు అన్నింటికీ కొత్త జిల్లాలనే పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జోనల్ విధానానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఇక నుంచి అన్ని శాఖలు నియామకాలు సహా పదోన్నతులు చేపట్టాలని ఆదేశించింది. ఇటీవల కొన్ని శాఖలు పాత జిల్లాల ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేసిన తరుణంలో సాధారణ పరిపాలనాశాఖ అన్ని శాఖలకు మరోమారు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది.

  • సర్కారు సన్నద్ధం..

రాష్ట్రంలో ముడిబియ్యం సేకరించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. కస్టమ్​ మిల్లింగ్ రైస్​ సరఫరాకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్​ వాడీ కేంద్రాలకు అవసరమైన బియ్యం సేకరించనుంది. అదనంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • అదే నాకు ఇచ్చే బహుమతి..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​... పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

  • నీట మునిగిన పంటలు..

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల వరి, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటలు పూర్తిగా నీట మునిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతన్నలు వేడుకుంటున్నారు.

  • రేపటి నుంచి లష్కర్​ బోనాలు..

లష్కర్​ బోనాల ఉత్సవాలు.. సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. వేలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గతేడాది కరోనా నేపథ్యంలో.. ఉత్సవాలకు భక్తులు హాజరుకాలేకపోయారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఆదివారం జరిగే వేడుకలకు దేవాదాయ శాఖ అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

  • సంస్కరణలకు మూడు దశాబ్దాలు..

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు బీజం వేశారు. అయితే.. దేశంలో అప్పటి పరిస్థితులను గట్టెక్కించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ సంస్కరణలు దేశాభివృద్ధికి ఉపయోగపడ్డాయా?. ఒకవేశ ఉపయోగపడితే.. ఏ రంగాలు అభివృద్ధి చేందాయి?. ఏవి అభివృద్ధికి నోచుకోలేదు?. ఆర్థిక సంస్కరణలకు నేటితో మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం..

  • ఏకగ్రీవ ఎన్నిక..

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయెన్‌ దిల్లీలో మీడియాకు వెల్లడించారు.

  • ఫిలిప్పీన్స్​లో భూకంపం..

ఫిలిప్పీన్స్​ బటన్​గ్యాస్ రాష్ట్రంలోని కలటగన్​ మున్సిపాలిటీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైంది.

  • శ్రీలంక విజయం..

టీమ్​ఇండియాతో జరిగిన ఆఖరి వన్డేలో శ్రీలంక జట్టు విజయం సాధించింది. భారత్​ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని 39 ఓవర్లలోనే లంక జట్టు ఛేదించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్​ను 2-1తో భారత జట్టు కైవసం చేసుకుంది.

  • కొత్త కబుర్లు..

యువ హీరో నాగచైతన్య బాలీవుడ్ సూపర్​స్టార్ ఆమీర్​ఖాన్​తో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించారు. అలాగే నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'లక్ష్య' చిత్రబృందం వరుస అప్​డేట్​లతో సిద్ధమైంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'మంచి రోజులు వచ్చాయి' నుంచి నేడు (శనివారం) ఓ వీడియోను విడుదల చేయనున్నారు.

Last Updated : Jul 24, 2021, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.