సమ్మె విరమించిన జూడాలు
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు(JUDAS) సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వెల్లడించారు. డిమాండ్లన్నీ నెరవేర్చకున్నా సీఎం హామీతో విరమిస్తున్నట్లు చెప్పారు.పెంచిన స్టైపండ్, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈటలకు భాజపా పచ్చజెండా
మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala rajendar) చేరికకు భాజపా(BJP) అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక తేదీని రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు పార్టీ అధిష్ఠానంతో వర్చువల్‌గా సమావేశమైన బండి సంజయ్ (Bandi Sanjay) ఈటల విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (J.P.Nadda) వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3,614 కొత్త కేసులు
రాష్ట్రంలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్ (corona positive) నిర్ధరణ అయినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు (telangana director of health) శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు (corona positivity rate) 4 శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తాజాగా 3,961 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. రికవరీ రేటు 93 శాతం, మరణాల రేటు 0.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జులైలో ఇంటర్ పరీక్షలు!
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు (inter second year exams) జులై మధ్యలో నిర్వహించే యోచన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుతం తెలిపింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాసింది. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి గంటన్నరకు తగ్గించే యోచన ఉన్నట్లు విద్యాశాఖ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్ష విధానం మార్చలేమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తగ్గుతున్న కరోనా
దేశంలో కరోనా ఉద్ధృతి స్థిరంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచినప్పటికీ.. గత వారం నుంచి పాజిటివిటీ రేటు తగ్గుతోందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్తగా క్రీమ్ ఫంగస్
మధ్యప్రదేశ్ జబల్పుర్లో కొత్తగా క్రీమ్ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్, వైట్ ఫంగస్ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తుపాను ప్రభావంపై మోదీ సమీక్ష
యాస్ తుపాను ప్రభావంపై అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు మోదీ. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కరెన్సీని ముద్రించండి'
కరోనా రెండో దశ సృష్టిస్తున్న సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సీఐఐ అధ్యక్షుడు ఉదయ్ కోటక్. కరెన్సీని అధికంగా ముద్రించడం, ఆర్థిక ప్యాకేజీ, చిన్న సంస్థలకు రుణ సదుపాయం పెంచడం వంటివి పరిశీలించాలని కేంద్రానికి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఫ్యాన్స్‌పై హిట్‌మ్యాన్ పోస్ట్
కొన్ని నెలలగా ప్రేక్షకులు లేకుండానే మన దేశంలో క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ క్రమంలోనే అభిమానుల మధ్య బ్యాటింగ్ చేసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోహిత్ శర్మ.. దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. 'ఫ్రెండ్స్' సిరీస్‌కు సంబంధం ఉండేలా దానికి ట్యాగ్ జతచేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రిటైర్మెంట్పై.. రజనీ!
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) త్వరలోనే సినిమాలకు గుడ్‌బై(Rajinikanth retirement) చెప్పనున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ఆయన ఇటీవలే పలుమార్లు అనారోగ్యానికి గురికావడం వల్ల ఆ వార్తకు మరింత బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో సినిమా భవిష్యత్‌పై రజనీకాంత్.. తన మనసులోని మాట బయటపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.