ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @9AM - ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-10-news-till-now
టాప్​టెన్​ న్యూస్ @9AM
author img

By

Published : Jun 22, 2020, 9:16 AM IST

Updated : Jun 22, 2020, 9:31 AM IST

కర్నల్​ కుటుంబానికి సీఎం పరామర్శ

భారత్‌-చైనా సరిహద్దులో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించనున్నారు. వీర సైనికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఇప్పటికే ప్రకటించిన సీఎం... ఇచ్చిన మాట ప్రకారం కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

శత్రువులు చుట్టుముట్టినా...

అప్పటికే శరీరంపై తీవ్ర గాయాలు.. చుట్టూ పెద్ద సంఖ్యలో శత్రు బలగాలు.. తన వద్ద చాలా తక్కువ మంది సైనికులు.. అయినా వెనక్కి తగ్గలేదు ఆ తెలుగు యోధుడు.. శత్రువుతో అమీతుమీకి సిద్ధపడ్డాడు. అతడే కర్నల్‌ సంతోష్‌ బాబు. వైరిపక్ష దురాగతంపై తుదికంటూ పోరాడుతూ భరతమాత రక్షణలో అమరుడయ్యారు. మృత్యు ముఖంలోనూ ఆయన ప్రదర్శించిన అద్భుత నాయకత్వ పటిమ, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

మూడు రైళ్లేనా ?

దేశంలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, ఉన్నవాటి పొడిగింపుపై రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు అందాయి. దేశవ్యాప్తంగా 62 కొత్త రైళ్లు ప్రవేశ పెట్టాలని ప్రతిపాదించగా తెలంగాణ నుంచి మూడే ఉన్నాయి. అవి కూడా వారానికోసారి నడిచేవే. రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్​ అంగడి సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి 12 కొత్త రైళ్లు జాబితాలో ఉండగా రైల్వేమంత్రుల రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందన్న విమర్శలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

నేడు 4 స్లిప్​, లింక్​ రోడ్లు ప్రారంభం​

హైద‌రాబాద్​లో ట్రాఫిక్ ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గించేందుకు బల్దియా దృష్టి సారించింది. అందులో భాగంగా స్లిప్​, లింక్​ రోడ్లను నిర్మించింది. ఇటీవ‌ల నిర్మించిన 4 స్లిప్, లింక్ రోడ్లను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

సైబర్ దాడులకు చైనా కుట్ర!

భారత్​-చైనా సరిహద్దుల వెంబడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా.. చైనా నుంచి మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. భారత్​పై సైబర్​ దాడులకు దిగేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ సైబర్​ దాడులు జరిగితే? భారత్ వాటిని ఎలా ఎదుర్కోగలదు? ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

దిల్లీకి ఉగ్ర ముప్పు..

దిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాల హెచ్చరికతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు ప్రాంతాలు సహా, రద్దీగా ఉండే మార్కెట్లు, ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

'సరిహద్దు'పై చర్చకు డిమాండ్​!

గల్వాన్​ లోయలో హింసాత్మక ఘటన నేపథ్యంలో విదేశీ వ్యవహారలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం నిర్వహించాలని డిమాండ్​ చేశారు పలువురు విపక్ష ఎంపీలు. 20 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు ప్యానెల్​కు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. అయితే.. కరోనా నేపథ్యంలో సమావేశ నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేసింది భాజపా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

ఒక్కరోజే లక్షా 83వేల కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో ఆదివారం సరికొత్త రికార్డు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అన్ని దేశాల్లో కలిపి లక్షా 83వేల కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది. బ్రెజిల్, అమెరికా, భారత్​లో ఎక్కువ మంది బాధితులున్నట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

స్పిన్ దిగ్గజం మృతి

భారత తరఫున ఫస్ట్​క్లాస్ మ్యాచ్​ల్లో అత్యధిక వికెట్లు తీసి గుర్తింపు తెచ్చుకున్న రాజిందర్ గోయల్.. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

'నాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు'

యువనటి రీతూ వర్మ.. ఈనాడుతో ప్రత్యేకంగా ముచ్చటించింది. లాక్​డౌన్​లో అనుభవాలు, చిత్రీకరణల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పడం సహా చాలా విషయాల్ని పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

Last Updated : Jun 22, 2020, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.