![](https://assets.eenadu.net/article_img/mesham_2.jpg)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.
![](https://assets.eenadu.net/article_img/vrushabam.jpg)
కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.
![](https://assets.eenadu.net/article_img/midhunam.jpg)
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.
![](https://assets.eenadu.net/article_img/karkatakam_2.jpg)
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించాలి.
![](https://assets.eenadu.net/article_img/simham_1.jpg)
సమయం అనుకూలంగా ఉంది. తోటివారి సహకారం ఉంటుంది. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతిని ఆరాధిస్తే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/kanya_1.jpg)
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును ఇబ్బంది పెడుతుంది. అకారణ కలహ సూచన ఉంది. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/tula_1.jpg)
శారీరక శ్రమ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.
![](https://assets.eenadu.net/article_img/vruschikam.jpg)
శుభకాలం. మీ మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం మీకు సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/dhanussu.jpg)
తలపెట్టిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
![](https://assets.eenadu.net/article_img/makaram_3.jpg)
కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/kumbam_1.jpg)
కీలక వ్యవహారాల్లో మీకు అనుకూలంగా పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. కోప తాపాలకు పోకండి. మనసు చెడ్డపనుల మీదకు మళ్లుతుంది. శివాష్టోత్తరం పఠించాలి.
![](https://assets.eenadu.net/article_img/meenam_2.jpg)
అనుకూల ఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అవసరానికి మిత్రుల సహకారం లభిస్తుంది. అందరినీ కలుపుకొనిపోవాలి. హనుమంతుడిని ఆరాధించాలి.