ఇవాళ రాష్ట్రంలోని కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్‌లలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
నిన్న... విదర్భ, దక్షిణ చత్తీస్‌గడ్ ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిమీ నుంచి 2.1 కి.మీ. మధ్య కేంద్రీకృతమై ఉందని తెలిపారు. నిన్న కింది స్థాయి తూర్పు గాలుల్లో అంతర్గత తమిళనాడు నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు బలహీన పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.