ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని, వేతన సవరణ చేయాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాగోల్లో నిర్వహించిన టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నెల 20లోపు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామన్నారు.
ఆర్టీసీ కార్మికుల యూనియన్లు బహిష్కరించిన వ్యక్తితో కలిసి రవాణాశాఖ మంత్రి మార్గదర్శకాలు జారీ చేశారని అయన ఆక్షేపించారు. యూనియన్లను గౌరవించకుండా రవాణాశాఖ మంత్రి జరిపిన చర్చలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ భద్రత సర్క్యులర్‌లోనూ సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. టీఎంయూకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని సంపూర్ణంగా బహిష్కరిస్తున్నట్లు అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు.
ఇదీ చూడండి: కళలు, సంస్కృతులకు పట్టం కడతాం: శ్రీనివాస్ గౌడ్