ETV Bharat / city

ప్రొ.కోదండరాంకు మద్దతివ్వాలని.. విపక్ష నాయకులను కలిసిన తెజస నేతలు - పట్టభద్రుల నియోజకవర్గం

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఆచార్య కోదండరాంకు మద్దతు ఇవ్వాలని తెజస నేతలు కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ నేతలను కోరారు. ఉద్యమ సారథైన కోదండరాం ఎమ్మెల్సీగా గెలుపొంది శాసనమండలిలో గళం విప్పేందుకు మద్దతివ్వాలని కోరారు.

kodandaram
kodandaram
author img

By

Published : Sep 18, 2020, 9:34 PM IST

Updated : Sep 19, 2020, 12:58 PM IST

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాంకు మద్దతివ్వాలని కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, సీపీఎం, న్యూడెమెక్రసీ నేతలను తెజస నాయకులు కలిసి కోరారు. టీపీసీసీ, ఎఐసీసీకీ మద్దతు కోసం ఇప్పటికే తెజస లేఖలు పంపింది.

శాసన మండలిలో ప్రజాగళం విప్పడం కోసం.. యువత, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నించడం కోసం ఉద్యమ సారథైన కోదండరాం ఎమ్మెల్సీగా గెలుపొందడం అవసరమని తెజస నేతలు అన్నారు. ఈ మేరకు తెజస పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకట్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అన్ని పార్టీల నాయకులను కలిసి లిఖితపూర్వకంగా వినతి పత్రాలను అందజేసింది. అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయని, ప్రొఫెసర్ కోదండరాం గెలుపు కోసం మద్దతు ఇస్తామన్నారని తెజస ప్రతినిధి బృందం తెలిపింది.

ఇదీ చూడండి: 'జీవో ఉల్లంఘించిన 55 పాఠశాలలకు షోకాజ్​ నోటీసులు'

Last Updated : Sep 19, 2020, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.