పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో తెలంగాణ ఐకాస బరిలోకి దిగింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఐకాస తరుఫున గుత్తా రవీందర్ రెడ్డిని బలపరిచినట్లు ఐకాస ఛైర్మన్ పురుషోత్తం తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర సాధనలో సకల జనుల తెలంగాణ ఐకాస నీడలో ప్రయాణించి.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సఫలీకృతం అయ్యామని చెప్పారు.
ప్రజల, నిరుద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి.. ఐకాస పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పురుషోత్తం తెలిపారు. ఏ ఆకాంక్ష కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో.. దానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతోందన్నారు.
- ఇది చదవండి : ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ బాధ్యతలు