ETV Bharat / city

ఏపీ రుయా ఘటనపై 4 వారాల్లో నివేదిక ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్‌సీ

ఏపీలోని రుయా ఆసుపత్రిలో కరోనా రోగుల మృతిపట్ల జాతీయ మానవహక్కుల సంఘం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై 4 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

Human Rights Commission response to the Rua incident
రుయా ఘటనపై మానవహక్కల సంఘం స్పందన
author img

By

Published : May 18, 2021, 9:12 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై జాతీయమానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని వ్యాఖ్యానించింది.

రుయా ఆసుపత్రిలో జరిగిన కొవిడ్ రోగుల మరణాలపై 4 వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 30 మంది కొవిడ్ బాధితులు చనిపోయారని చింతా మోహన్ అనే వ్యక్తి ఎన్​హెచ్​ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: రెండో దశలో 2.37 లక్షల కరోనా కేసులు: డీహెచ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.