ETV Bharat / city

రాయితీ లడ్డూలకు మంగళం పాడే యోచనలో తితిదే! - తిరుమల శ్రీవారి లడ్డూ న్యూస్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలపై రాయితీలకు తితిదే మంగళం పాడనుంది. ఇకపై స్వామివారిని దర్శించుకున్న వారికి ఒక్క లడ్డూ మాత్రమే ఉచితంగా ఇవ్వాలని భావిస్తోంది. రాయితీ లడ్డూల జారీతో తితిదేకు భారీగా నష్టం వస్తున్నట్టు లెక్కలు కడుతున్న నేపథ్యంలో తితిదే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

tirupati-laddu-in-chittoor
author img

By

Published : Nov 13, 2019, 1:55 PM IST

రాయితీ లడ్డూలకు మంగళం పాడే యోచనలో తితిదే!

తిరుమల పేరు వింటే మొదట గుర్తుకొచ్చేది స్వామివారి దివ్యస్వరూపం... తర్వాత నోరూరించే లడ్డూ ప్రసాదం. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునే భక్తులకు వివిధ పద్ధతుల్లో రాయితీపై లడ్డూలను తితిదే జారీ చేస్తోంది. సేవా టిక్కెట్లు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై దర్శనం చేసుకునే వారికి ఉచితంగా రెండు లడ్డూలు, నడకదారిలో వచ్చి దర్శించుకున్న వారికి ఉచితంగా ఒక లడ్డూని ప్రస్తుతం ఇస్తున్నారు. ధర్మ దర్శనం, దివ్య దర్శనం, టైమ్‌స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు రాయితీపై 20 రూపాయలకే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. ఉచితం, రాయితీపై లడ్డూలు ఇస్తున్న నేపథ్యంలో తితిదేకు ఏటా 241 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతున్నట్టు భావిస్తున్నారు.

నష్టాన్ని తగ్గించుకోవడానికి తితిదే చర్యలు ప్రారంభించింది. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అదనపు ఈవో ధర్మారెడ్డి... నష్ట నివారణ చర్యలపై అభిప్రాయాలు సేకరించారు. శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తునికీ 180 గ్రాముల ఒక లడ్డూను మాత్రమే ప్రసాదం కింద ఉచితంగా ఇవ్వాలని... అదనంగా కోరుకుంటే ఒక్కో లడ్డూను 50 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించారు. రాయితీపై జారీ చేసే విధానానికి స్వస్తి పలకాలని అధికారులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే విధి విధానాలను రూపొందించి రాయితీ లడ్డూలకు తితిదే మంగళం పాడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

మత మార్పిడి, రాజకీయ దాడులు సరికాదు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.