ETV Bharat / city

Thummalapalli Factory Issue: 'కాలుష్యం సుద్దులు యురేనియంకు వర్తించవా?'

‘‘పరిశ్రమ కంటే మనుషుల ప్రాణాలకే ప్రాధాన్యమిస్తాం. వాతావరణాన్ని విషతుల్యం చేసి ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విష కణాలు అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ ద్వారా వెలువడుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ హైకోర్టు ధ్రువీకరించాయి. అందుకే ఆ సంస్థను ఆ రాష్ట్ర ప్రభుత్వమే పొమ్మంటోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సంకుచితంగా ఆలోచించరు. కాలుష్య కారక పరిశ్రమల్లో నాదో, వైవీ సుబ్బారెడ్డిదో, ఇంకొకరిదో ఉన్నా ఇలాగే వ్యవహరిస్తారు.’’ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ నెల 3న మీడియాతో చేసిన వ్యాఖ్యలివి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. జగన్ నియోజకవర్గంలోనే ప్రజలు యురేనియం శుద్ధి కాలుష్యంతో అల్లాడిపోతుంటే పట్టించుకునే వారే కరవయ్యారు.

author img

By

Published : Aug 7, 2021, 1:55 PM IST

Thummalapalli Factory Issue, Thummalapalli Factory in kadapa district
తుమ్మలపల్లి కర్మాగారం, కడప జిల్లా యురేనియం ఫ్యాక్టరీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు నిజంగా పర్యావరణ పరిరక్షణపై ఇంత శ్రద్ధ చూపిస్తున్నారా? కాలుష్య కారక పరిశ్రమలన్నింటిపైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇదే స్థాయిలో చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు యురేనియం శుద్ధి కర్మాగారం కాలుష్యంతో అల్లాడిపోతున్నాం మహాప్రభో అంటూ ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు?

ఆ కర్మాగారం మూసివేతకు ఎందుకు ఆదేశాలివ్వలేదని అక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. తాజా పరిణామాలు గమనిస్తే పర్యావరణ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి కంటే... ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు కాలుష్య నియంత్రణ అంశాన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలన్న ధోరణే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తోంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం ఎం.తుమ్మలపల్లెలో భారత యురేనియం సంస్థ.. యురేనియం శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పింది. అయితే ఖనిజ శుద్ధితో వెలువడే వ్యర్థాల నిర్వహణలో ఈ సంస్థ నిర్లక్ష్యం.. స్థానిక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. యురేనియం వ్యర్థాల్ని నిల్వ చేసే టెయిల్‌ పాండ్‌ అడుగు భాగంలో 250 మైక్రాన్ల మందంతో పొలియాథిలిన్‌ పొర ఏర్పాటు చేయాలని కాలుష్య నియంత్రణ మండలి నోటీసిచ్చినా పట్టించుకోలేదు. దీంతో కొన్నేళ్లుగా ఆ వ్యర్థాలన్నీ భూగర్భంలోకి ఇంకుతున్నాయి. దీంతో అక్కడ నీరు, మట్టి అంతా కలుషితమవుతున్నాయి. ఆ ప్రాంతాల్లో పంటల దిగుబడి తగ్గిపోయింది. పంట ఉత్పత్తులు తినటానికి వీల్లేకుండా ఉంటున్నాయి. ప్రజలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. కీళ్ల నొప్పులు, గర్భవిచ్ఛిత్తి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. యురేనియం కాలుష్యం ప్రభావం కొన్ని వందల సంవత్సరాలు పాటు ఉంటుందని.. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో పెను విపత్తుగా మారే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘మా పల్లెల్లో పది రోజులు ఉండి.. మేం తాగే నీటినే తాగండి. అప్పుడు మా సమస్య అర్థమవుతుంది. అల్యూమినియం పాత్రలో నీరు పోసి 25 రోజుల పాటు ఉంచితే రంధ్రాలు పడుతున్నాయి. ఇక మనుషుల శరీరాలు ఎలా తట్టుకుంటాయి?’ అంటూ బాధిత గ్రామాల ప్రజలు 2019 సెప్టెంబరులో పీసీబీ నిర్వహించిన న్యాయవిచారణలో మొరపెట్టుకున్నారు.

70 రెట్లు అధికంగా కాలుష్యం

అణుశక్తి నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు తాగునీటిలో 60 పీపీబీ (పార్ట్స్‌ పర్‌ బిలియన్‌) వరకూ యురేనియం గాఢత ఉండొచ్చు. తుమ్మలపల్లె పరిసర గ్రామాల్లోని నీటిలో 4000 పీపీబీ గాఢత నమోదైనట్లు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన పరీక్షల్లోనే వెల్లడైంది. సమస్య తీవ్రత ఈ స్థాయిలో ఉంటే కేవలం నోటీసులివ్వటానికే పీసీబీ పరిమితమైందని స్థానికులు మండిపడుతున్నారు. తీవ్రస్థాయిలో కాలుష్యం వెదజల్లుతున్నా కర్మాగారంపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వైకాపా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఆ కర్మాగారం మూసివేతకు కనీసం ఒక్కసారి కూడా నోటీసు ఎందుకు ఇవ్వలేదు? పర్యావరణ అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలే పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కాలుష్య నియంత్రణ మండలి సూచించిన చర్యలనూ చేపట్టలేదన్న ఫిర్యాదులున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అని స్థానికులు, పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

కొసమెరుపు: భూగర్భాన్ని అత్యంత కలుషితం చేస్తున్న యురేనియం శుద్ధి కర్మాగారంపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ వైకాపా ప్రభుత్వం 2019 ఆగస్టు 7న నోటీసిచ్చింది. రెండేళ్లు పూర్తయినా.. ఆ కర్మాగారం మూసివేతకు చర్యలు తీసుకోలేదు. సరికదా దాని విస్తరణ ప్రయత్నాలకు అన్ని విధాలా సహకరిస్తోంది.

పర్యావరణ చట్టాల్ని నిష్పక్షపాతంగా అమలు చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి.. అందుకు కారణమవుతున్న సంస్థలన్నింటి విషయంలో ఒకేలా వ్యవహరించట్లేదు. యురేనియం శుద్ధి కర్మాగారం విషయంలో పీసీబీ ధోరణే అందుకు తార్కాణం. ఆ కర్మాగారం పర్యావరణ అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలేవీ అమలు చేయలేదు. భూగర్భజలాలను విషతుల్యంగా మార్చింది. ఫలితంగా వందల ఎకరాల పొలాలు బీడుగా మారాయి. పశువులు మరణించాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన ఉండట్లేదు. అమరరాజా కంపెనీలో సీసం కాలుష్యం ఉందని చర్యలు తీసుకున్న పీసీబీ యురేనియం కర్మాగారంపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది? వెంటనే ఆ సంస్థపై కూడా చర్యలు చేపట్టాలి.

-డా.కె.బాబూరావు, శాస్త్రవేత్తల బృందం

వైఎస్‌ చెప్పిందే నిజమైతే..ఇప్పటి నష్టానికి బాధ్యులెవరు?

‘యురేనియం కర్మాగారంతో క్యాన్సర్‌ వంటి వ్యాధులు వస్తాయంటూ కొందరు దీనికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. స్థానికుల సహకారంతో ఇప్పుడు ప్రారంభించగలిగాం. ఈ కర్మాగారంపై అపోహలు తొలగించేందుకు స్థానిక యువకులను జార్ఖండ్‌లోని జాదుగూడ యురేనియం కర్మాగారానికి తీసుకెళ్లి అనుమానాలన్నీ నివృత్తి చేశాం’ అని ఈ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. ఆయన చెప్పినట్లు ఎలాంటి సమస్య ఉండకపోతే.. ఇప్పుడు అక్కడి ప్రజలు ఎందుకు ఆ కర్మాగారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు? అక్కడ పర్యావరణానికి వాటిల్లిన నష్టానికి బాధ్యులెవరు? దానికి ఎవరిపైన చర్యలు తీసుకోవాలి?

ఇదీ చదవండి: No Permission: అమరావతి ఉద్యమానికి రేపటితో 600 రోజులు.. ర్యాలీకి నో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.