ETV Bharat / city

డ్రైనేజీ శుభ్రపరిచేందుకు మ్యాన్​హోల్​లోకి దిగి, ముగ్గురి మృతి

ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగి.. ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డ్రైనేజీ శుభ్రపరిచేందుకు మ్యాన్​హోల్​లోకి దిగి, ముగ్గురి మృతి
డ్రైనేజీ శుభ్రపరిచేందుకు మ్యాన్​హోల్​లోకి దిగి, ముగ్గురి మృతి
author img

By

Published : Aug 21, 2022, 8:48 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లిలోని బస్టాండ్‌ ఎదుట ఉన్న రెస్టారెంట్‌లో డ్రైనేజీ శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగి.. ముగ్గురు ప్రమాదవశాత్తు మృతి చెందారు. బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ రెస్టారెంట్‌ భవనం యజమాని కొండలరావు.. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలను తీసుకొచ్చారు. మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు కూలీలు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆయన కూడా అందులోకి దిగారు. ఎంతసేపటికీ అతడు కూడా బయటకు రాకపోవడంతో.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ముగ్గురూ డ్రైనేజీలోనే మృతి చెందినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి.. శవపరీక్ష నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి..:

కరెంట్‌ షాక్‌ ఇచ్చింది, కారుతో గుద్దించింది, చివరికి తుపాకీతో కాల్పించి భర్తను చంపించింది

హైవేకు అడ్డంగా రైతు డ్రీమ్​ హౌస్​, కూల్చడం ఇష్టం లేక 500 అడుగులు వెనక్కి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.