ETV Bharat / city

ప్రవీణ్‌ సోదరుల అపహరణకు మూడు నెలలుగా భారీ కసరత్తు - భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్

అపహరణ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 11న వెల్లడించనుంది. బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాస్థానాన్ని కోరగా, బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని... మరికొన్ని నేరాలు చేస్తారని పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. అఖిలప్రియను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. జైలులో రిమాండ్‌లో ఉన్న అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆమె తరపు న్యాయవాదులు మరో మెమో దాఖలు చేశారు. ఆరోగ్య పరిస్థితిపై తక్షణం నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

ప్రవీణ్‌ సోదరుల అపహరణకు మూడు నెలలుగా భారీ కసరత్తు

author img

By

Published : Jan 9, 2021, 5:53 AM IST

హైదరాబాద్‌లోని రూ. రెండువేల కోట్ల విలువైన భూమిపై హక్కుల కోసం ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను అపహరించడం వెనుక భారీ కసరత్తు జరిగిందని బోయిన్‌పల్లి పోలీసులు గుర్తించారు. బాధితులను బెదిరించి దస్త్రాలపై సంతకం పెట్టించుకునే పథకం ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియది కాగా.. కిడ్నాప్‌కు అవసరమైన కార్యాచరణ ఆమె భర్త భార్గవ్‌రామ్‌, శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శ్రీను చేపట్టారు. మూడు నెలల నుంచి ప్రవీణ్‌రావు కదలికలపై నిఘా ఉంచారు. ఈనెల 3 నుంచి ప్రవీణ్‌రావు ఇంటి సమీపంలోని దుకాణాలు, టీ స్టాళ్లు, బ్యాంకు, హోటళ్ల వద్ద గడిపారు. అంతా సానుకూలంగా ఉందని నిర్ధారించుకున్నాక, మంగళవారం రాత్రి కిడ్నాప్‌ చేశారు.

సంతకాలు పెట్టాకే వదిలేద్దాం

అపహరణ అనంతరం ముగ్గురితో ఎలా వ్యవహరించాలనే దానిపై భార్గవరామ్‌, గుంటూరు శ్రీను కిడ్నాపర్లకు దిశానిర్దేశం చేశారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకున్నాకే వదలాలని సూచించారు. దారిలోనే వారికీ విషయం వివరించాలని, గంటలోపు మొయినాబాద్‌లోని తమ ఫాంహౌస్‌కు తీసుకురావాలని ఆదేశించారు. అవాంతరాలు ఎదురైనా.. పోలీసులు కనిపించినా వెంటనే కార్లు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని డ్రైవర్లకు చెప్పారు. అపహరణకు వాడిన మూడు కార్లకు ‘ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ’ స్టిక్కర్లను అతికించడంతో పాటు పోలీసు దుస్తులు ధరించినవారు కిటికీ పక్కన కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. వాట్సాప్‌ కాల్స్‌ మాత్రమే చేయాలని శ్రీను కిడ్నాపర్లకు స్పష్టం చేశాడు.

ఏపీలోనూ సెటిల్‌మెంట్లు

భార్గవ్‌రామ్‌, గుంటూరు శ్రీనుల నేరచరితపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండే అతడికి మూడేళ్ల క్రితం భార్గవరామ్‌ పరిచయమయ్యాడని, అప్పటి నుంచి స్నేహితులయ్యారని ఆధారాలు లభించాయి. శ్రీను గొడవలు, వివాదాల్లో తలదూర్చుతుండడం, దాడులు చేసేందుకూ వెనకాడకపోవడంతో అతని సాయంతో హైదరాబాద్‌లో భూ వివాదాలను పరిష్కరించేవారు. అఖిలప్రియ, భార్గవరామ్‌ల వివాహం తరవాత శ్రీను వారికి వ్యక్తిగత సహాయకుడిగా మారాడు. భార్గవరామ్‌.. శ్రీనుతో కలిసి హైదరాబాద్‌, అమరావతి, మంగళగిరి, కర్నూలులో పలు సెటిల్‌మెంట్లు చేశారని పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా కోటకందుకూరులోని ఓ స్టోన్‌ క్రషర్‌ను దౌర్జన్యంగా ఆక్రమించేందుకు యత్నించారనే ఆరోపణలున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం ఈ నెల 11కు వాయిదా వేసింది. బోయిన్‌పల్లి పోలీసులు శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయడంతో వివరాలను పరిశీలించిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని 11వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నరేశ్‌కుమార్‌ తెలిపారు. అపహరణ ఉదంతాన్ని తిరిగి రూపొందించాలని (సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌), ఇందుకోసం అఖిల ప్రియ భర్త భార్గవరామ్‌, గుంటూరు శ్రీనుతో సహా నిందితులందరినీ అరెస్ట్‌ చేయాలని తెలిపారు. బాధితులతో కిడ్నాపర్లు బలవంతంగా సంతకాలు చేయించుకున్న దస్తావేజులను స్వాధీనం చేసుకోవాలంటే అఖిలప్రియను వారంపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో నిందితుడైన భార్గవ్‌రామ్‌ న్యాయస్థానంలో లొంగిపోనున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రచారం జరిగింది. అయితే సాయంత్రం వరకు భార్గవ్‌రామ్‌ జాడ కనిపించలేదు.

సంబంధిత కథనం: ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.