ETV Bharat / city

ఏలూరు ఘటనపై అధ్యయనానికి కేంద్ర కమిటీ : కిషన్​రెడ్డి - ఏలూరు ఘటన వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో.. అంతుచిక్కని అనారోగ్యంతో వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రి పాలవడంపై.. కేంద్రం స్పందించింది. ముగ్గురు సభ్యుల బృందాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏలూరు పంపించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

kishan reddy
kishan reddy
author img

By

Published : Dec 7, 2020, 4:22 PM IST

ఏలూరులో అకస్మాత్తుగా బయటపడిన అనారోగ్య సమస్యను అత్యవసరంగా అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. దిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్ నేతృత్వంలో కమిటీని నియమించింది.

సభ్యులుగా పుణే జాతీయ వైరాలజీ ఇన్​స్టిట్యూట్ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవ్, ఎన్సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ సంకేత కులకర్ణిని నియమించింది. రేపు ఉదయానికి ఈ బృందం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దిల్లీలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సంప్రదించి.. సమస్యకు గల కారణాలు తెలుసుకుంటుందని చెప్పారు.

'ఏలూరు ఘటనపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీ'

సంబంధిత కథనాలు: ఏలూరులో పెరుగుతున్న బాధితులు.. మరో 27 మందికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.