ETV Bharat / city

Technical issue in ttd website : తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య - Srivari Special entry Tickets release

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(TTD special darshan tickets released)ను తితిదే ఆన్​లైన్​లో విడుదల చేసింది. టికెట్ల కోసం అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల సాంకేతిక సమస్య(technical issue in ttd website) ఏర్పడింది. శ్రీవారి దర్శనానికి వచ్చే వారు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తైన సర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ పత్రం తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.

శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు విడుదల

author img

By

Published : Sep 24, 2021, 10:09 AM IST

Updated : Sep 24, 2021, 11:48 AM IST

తితిదే వెబ్‌సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుకు భారీగా భక్తులు యత్నించడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ నెలకు ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అక్టోబర్‌ 1 నుంచి 25 వరకు రోజుకు 8వేల టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సమస్య వచ్చింది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై తితిదే ప్రకటన చేసే అవకాశముంది. తిరుమలకు వచ్చే భక్తులు టీకా 2 డోసులు పూర్తైన సర్టిఫికెట్‌ లేక కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్ తీసుకురావాలని తితిదే అధికారులు స్పష్టం చేశారు.

టికెట్ల విడుదల సమయంలో కొన్ని నెలలుగా సాంకేతిక సమస్య(technical issue in ttd website) తలెత్తోందని భక్తులు చెబుతున్నారు. దీని పరిష్కారానికి గత నెలలో ఏపీ ప్రభుత్వ సర్వర్‌ను ఉపయోగించుకున్న తితిదే.. పరిష్కారానికి జియో సంస్థ సహకారం తీసుకుంది. అయినా సమస్య(technical issue in TTD website) పరిష్కారం కాకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 25న సర్వదర్శనం టోకెన్లు విడుదల

శనివారం శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు(TTD sarvadarshan tokens) ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా తితిదే విడుదల చేయనుంది. అక్టోబ‌ర్‌ 31 వరకు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని.. అయితే రోజుకు 8 వేల టికెట్ల మాత్రమే ఇస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్​లైన్​లో విడుదల చేయడంపై భక్తులు ఆందోళనకు(devotees protest at srinivasam in tirupati) దిగారు. వివిధ ప్రాంతాల నుంచి సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతి వచ్చిన వాళ్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమిళనాడు, తెలంగాణ నుంచి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. రోజుకు 8 వేల టికెట్లు కేటాయిస్తామని ప్రకటించిన తితిదే... ఉన్నట్లుండి ఆన్​లైన్​లో జారీ చేస్తామని చెప్పడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇవ్వాలంటూ భక్తులు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో శ్రీనివాసం వసతిగృహం వద్ద పోలీసులు మోహరించారు. అక్కడి నుంచి భక్తులను వెనక్కి పంపేందుకు యత్నిస్తున్నారు.

తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య

Last Updated : Sep 24, 2021, 11:48 AM IST

For All Latest Updates

TAGGED:

TTD TICKETS
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.