ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలు(heavy rainfall in andhrapradesh) కుంభవృష్టిని తలపిస్తున్నాయి. జిల్లాలోని జలాశయాలు నిండుకుండలుగా మారాయి. రాజంపేట వద్ద అన్నమయ్య జలాశయం వరద ఉద్ధృతి భయానకంగా మారింది. ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పోటెత్తుతూనే ఉంది. జలాశయం ఎర్త్ బండ్ వద్ద పూర్తిగా కొట్టుకుపోయింది.
జలాశయ(heavy rainfall in andhrapradesh) పరీవాహక గ్రామాలను వరద ముంచెత్తింది. గుండ్లూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. సుమారు 30 నుంచి 40 మంది గల్లంతయ్యారని అధికారులు అంచనావేస్తున్నారు. చెయ్యేరు నదిలో 16 మంది గల్లంతయ్యారు. రాజంపేట మండలం బాదనగడ్డపై వరద ప్రవాహంతో నందలూరు- రాజంపేట మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. నందలూరు వద్ద మూడు మృతదేహాలను వెలికితీశారు.
ఇవీ చదవండి: Farm laws India: సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?
Minister Niranjan Reddy latest : 'కేసీఆర్ పోరాట సంకేతం.. సాగుచట్టాల రద్దుకు ఓ కారణం'
Revanth reddy on kcr: 'సాగు చట్టాల రద్దు కేసీఆర్ ఘనతగా చెప్పడం.. రైతులను అవమానించడమే'