ETV Bharat / city

దూర ప్రయాణం చేస్తున్నారా? అయితే ఇవి పాటించండి..

author img

By

Published : Jul 21, 2020, 10:35 AM IST

గతంలో హైదరాబాద్‌ నుంచి ఎంత దూరమైనా ప్రయాణం సాఫీగా సాగిపోయేది. దారి పొడవునా హోటళ్లలో కడుపు నిండా తిని.. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ సాగిపోయే ప్రయాణం కరోనా పుణ్యమా అని తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా హోటళ్లు, దాబాలు పని చేయడంలేదు. దీంతో ప్యాకెట్లలోని చిరుతిళ్లతోనే గడిపేయక తప్పడంలేదు. ఎక్కడైనా రోడ్డు పక్కన టీ తాగుదామన్నా కరవే. ఒక పూటకు పార్సిళ్లు తీసుకెళ్లగలం కానీ.. 14 నుంచి 15 గంటలు సాగే ప్రయాణంలో పార్సిళ్లు తీసుకెళ్లడమూ కష్టమవుతోంది.

tollgate
tollgate

కరోనా సమయంలో ప్రయాణం పెద్ద ప్రయాసగా మారిపోయింది. హైదరాబాద్‌ నుంచి వెళ్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వద్ద తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

స్పందన వెబ్‌సైట్‌ ద్వారా ఏపీలో ప్రవేశించడానికి అనుమతి పత్రం వెంట తీసుకెళ్లాల్సి వస్తోంది. అత్యవసర సేవలకు అనుమతిస్తారు కనుక.. సంబంధిత వివరాలు వెంట ఉండాలి. రైల్లో వెళ్తే క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. విమానంలో వెళ్లినా అనుమతి పత్రాన్ని అడుగుతున్నారు.

మార్గం మధ్యలో ఉండే టోల్‌గేట్ల వద్ద అర కిలోమీటరు మేర వాహనాలు బారులుతీరి ఉంటున్నాయి. డబ్బులు చెల్లించి వెళ్లాలంటే కనీసం ఒక్కో టోల్‌గేటు వద్ద 20-30 నిమిషాలు పడుతోంది.

డబ్బులు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు కరోనా ముప్పు లేకుండా జాగ్రత్త పడాల్సి వస్తోంది. టైరు పంక్చర్‌ అయినా.. ఇంజిన్‌ వేడెక్కి ఆగిపోయినా.. మరే సాంకేతిక సమస్య తలెత్తినా.. కనుచూపు మేరలో మెకానిక్‌లు కరవవుతున్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన నంబర్లకు ఫోన్‌ చేస్తే.. మరమ్మతులకు ఒక పూట పడిగాపులు కాయాల్సి వస్తోంది.

అదే రాత్రి పూట తెల్లార్లు రోడ్డు పక్కన జాగారం చేయక తప్పడంలేదు. పెట్రోలు అయిపోతే ఏ ఒక్కరూ సాయం చేయడంలేదు. జస్ట్‌ డయల్‌ నంబరులో ఫోన్‌ చేసి సేవలందించేవారి నంబర్లు సేకరించాల్సి వస్తోంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • కరోనా వేళ.. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోండి. అత్యవసర ప్రయాణాలకే ప్రాధాన్యం ఇవ్వండి.
  • పలకరింపులు, పరామర్శలు అని వెళ్లినా ఎదుటి వారిని ఇబ్బందులు పెట్టిన వారవుతారు. తప్పనిసరి అయితేనే వెళ్లాలి.
  • కషాయం నీళ్లు మీ వెంటే వేడి చల్లారకుండా ఉండే పాత్రలలో తీసుకెళ్లండి.
  • మందులు వెంట పెట్టుకొనే వెళ్లండి.
  • కావాల్సినంత తాగునీరు టిన్నులతో వెళ్లండి.
  • నిల్వ ఉండే ఆహార పదార్థాలను తీసుకెళ్లండి.
  • మార్గం మధ్యలో బంధువులు, స్నేహితులు ఉంటే వారిని ఆహారం తెచ్చి ఇవ్వమనండి. వాళ్ల ఇంటికి వెళ్లి ఇబ్బంది పెట్టకండి.
  • మీరు ప్రయాణిస్తున్న కారు.. అన్ని విధాల భద్రంగా.. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేలా ముందుగానే సిద్ధం చేసుకొని వెళ్లండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.