ETV Bharat / city

TSRTC Employees Retirement 2021 : తెలంగాణ ఆర్టీసీలో పదవీ విరమణ పొడిగింపు లేనట్టే!

TSRTC Employees Retirement 2021 : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ లేనట్లే కనిపిస్తోంది. 2019లో పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పదవీ విరమణ వయసు పెంపుదలకు వీలుగా దస్త్రాన్ని అధికారులు ప్రభుత్వానికి పంపారు. దీనిపై గురువారం వరకు సానుకూల ఉత్తర్వులు రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పదవీ విరమణ చేసే ఉద్యోగులను సత్కరించి సగౌరవంగా పంపాలని ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

TSRTC Employees Retirement
TSRTC Employees Retirement
author img

By

Published : Dec 31, 2021, 9:18 AM IST

TSRTC Employees Retirement 2021 : ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుదల లేనట్టే. సంస్థలో ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మరో ఏడాది పొడిగించాలన్న ప్రతిపాదనలు ఆర్టీసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినా సానుకూల ఉత్తర్వులు విడుదల కాలేదు. 2019లో ఆర్టీసీ ఉద్యోగులు సుదీర్ఘ సమ్మె చేశారు. సమ్మె ముగిసిన తర్వాత ఆ ఏడాది డిసెంబరులో పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ప్రకటించించారు.

Telangana RTC Employees Retirement : 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ సంవత్సరం నుంచి ఏటా ఎంతమంది పదవీ విరమణ చేస్తారన్న వివరాలతో నివేదికను అందజేశారు. ఆ గణాంకాల ప్రకారం 2019లో 659 మంది, 2020లో 2,615, 2021లో 4,690 మంది పదవీవిరమణ చేయాల్సి ఉంది. రెండేళ్లలో పదవీ విరమణలు లేకపోవటంతో డిసెంబరు నాటికి ఆ సంఖ్య 7,964కి చేరుతుంది. ఆ తర్వాతా ఏటేటా భారీ సంఖ్యలోనే విరమణలు ఉండనున్నాయి. ఎంతమంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వారికి పూర్తి స్థాయిలో చెల్లించలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉంది.

TSRTC Employees Retirement Today : రెండేళ్లుగా ఆర్టీసీలో పదవీ విరమణలు లేవు. ఆ సమయానికి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వం 61కి పెంచింది. ఆర్టీసీ ఉద్యోగులకూ 61 సంవత్సరాలు చేస్తారన్న ప్రచారం జరిగింది. పదవీ విరమణ వయసు పెంపుదలకు వీలుగా దస్త్రాన్ని అధికారులు ప్రభుత్వానికి పంపారు. దీనిపై గురువారం వరకు సానుకూల ఉత్తర్వులు రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పదవీ విరమణ చేసే ఉద్యోగులను సత్కరించి సగౌరవంగా పంపాలని ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.