ETV Bharat / city

కన్నీటి వ్యథ.. బోయగూడ మృతుల స్వస్థలాల్లో విషాద గాథ - బోయగూడ టింబర్​ డిపోలో అగ్ని ప్రమాదం

Boyaguda Fire Accident: తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదిలి రాష్ట్రాలు దాటి వలస వచ్చి.. అగ్నిప్రమాదానికి ఆహుతైన 11 మంది బిహార్​ కార్మికుల స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తమను పోషించేందుకు పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిన వారు.. ప్రమాదంలో బూడిదైపోయారని తెలిసి కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆర్థిక భరోసా లేని కుటుంబాలు.. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాల్లో ఇంటి పెద్దదిక్కును కోల్పోయామని విలపిస్తున్నారు. ఇక తమకు దిక్కెవరని రోదిస్తున్న బాధితుల బాధ వర్ణనాతీతం.

boyaguda fire accident
బోయగూడల టింబర్​ డిపోలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Mar 23, 2022, 8:07 PM IST

Boyaguda Fire Accident: సికింద్రాబాద్​ బోయగూడలోని ఓ టింబర్​ డిపోలో చెలరేగిన మంటల్లో మృతి చెందిన 11 మంది బిహార్​కు చెందిన వలస కూలీల కుటుంబాలు, గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పని కోసం వలస వెళ్లిన తమవారు అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యారని తెలిసి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల్లో 8 మంది చాప్రాకు చెందినవారు కాగా.. ముగ్గురు కతిహార్​ జిల్లాకు చెందిన వారిగా సమాచారం అందింది. వలస కూలీల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Deceased: ప్రమాదం జరిగిన సమయంలో డిపోలో 15 మంది ఉండగా.. అందులో 11 మంది మృత్యువాతపడ్డారు. మృతులు దీపక్​ రామ్​(36), బిట్టు కుమార్​(23), సికిందర్ రామ్​ కుమార్​(40), గోలు(28), సత్యేంద్రకుమార్​(35), దినేష్ కుమార్​(35), చింటు కుమార్​(27), దామోదర్​ మహల్దార్​(37), రాజేశ్​ కుమార్​(25), పంకజ్​ కుమార్​(26), రాజేష్​(22) గా పోలీసులు గుర్తించారు. వీరంతా ఉపాధి కోసం ఏడాదిన్నర క్రితం నగరానికి వలస వచ్చారు. చింటు, దామోదర్​, రాజేశ్​.. కతిహార్​కు చెందిన వారు కాగా.. మిగతా మృతులు చాప్రాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం జరిగిన తర్వాత.. కుటుంబీకులకు మరణ వార్త చేరడంతో వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికు గురయ్యారు. ఇక మాకు దిక్కెవరు అంటూ వాపోయారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

"బోయగూడ అగ్ని ప్రమాదంలో దీపక్​ చనిపోయాడని ఉదయం ఫోన్​ వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఏం వింటున్నానో నాకర్థం కాలేదు. 25 రోజుల క్రితమే నన్ను, పిల్లలను చూడటానికి ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. నా భర్త చనిపోవడంతో నేను, నా పిల్లలు అనాథలయ్యాం." దీపక్​ రామ్​ భార్య ఉమ్రావతి దేవి

మీడియాతో మాట్లాడుతూ దేవి కన్నీటి పర్యంతమవుతుండగా.. పిల్లలు కూడా రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. తన భర్త తెచ్చే సంపాదన మీదే కుటుంబమంతా ఆధారపడి ఉందని వాపోయింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బాధితులు డిమాండ్​ చేశారు. బోయగూడ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్​, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​.. మృతుల కుటంబాలకు పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున కేసీఆర్​, రూ. 2 లక్షలు చొప్పున నితీశ్​ పరిహారం ప్రకటించారు. స్థానికంగా ఉపాధి లేకపోవడం వల్లే ఇక్కడివారు వలస పోతున్నారని అక్కడి ఎమ్మెల్యే సర్వ్​జీత్ కుమార్ తెలిపారు.

బిహార్​లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతోనే ఇక్కడి నుంచి ప్రజలు వలస బాట పడుతున్నారు. ఇక నుంచి ఇలాంటి ప్రమాదాలు, వలస బాధలు తప్పాలంటే.. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు సృష్టించాలి. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.

సర్వ్​జీత్ కుమార్, ఎమ్మెల్యే

సికింద్రాబాద్ బోయగూడలో తెల్లవారుజామున 4 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలోని తుక్కు గోదాములో మంటలు చెలరేగి.. పైనున్న టింబర్‌ డిపోకు వ్యాపించాయి. డిపో నిండా కట్టెలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి అక్కడే నిద్రిస్తున్న 11 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో కొంత మంది సజీవదహనం కాగా.. మరికొంత మంది పొగతో ఊపిరాడక చనిపోయారు.

బోయగూడ మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు

ఇదీ చదవండి: Fire Accident in Timber Depot : టింబర్‌ డిపోలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.