ETV Bharat / city

Infections : కరోనా తర్వాత ఇన్​ఫెక్షన్ల నుంచి అప్రమత్తత అవసరం - infections in corona patients

కొవిడ్‌ కాలంలో ఇతర ఇన్‌ఫెక్షన్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ సోకిన సమయంలో.. కోలుకున్న తర్వాత ఇతర ఇన్‌ఫెక్షన్ల(Infections) బారినపడే అవకాశాలు ఉంటాయనేది విస్మరించవద్దని పేర్కొంది.

there-is-a-threat-of-infections-after-recovering-from-corona
ఇన్​ఫెక్షన్ల నుంచి అప్రమత్తత అవసరం
author img

By

Published : Jul 12, 2021, 9:06 AM IST

కరోనా నుంచి కోలుకున్న వారిపై.. మలేరియా, డెంగీ, గన్యా, క్షయ, హెచ్‌ఐవీ, ఇన్‌ఫ్లూయెంజా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు(Infections) దాడి చేసే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. వీటి బారినపడిన వారిలోనూ కొవిడ్‌ వ్యాప్తి చెందే అవకాశాలూ ఉంటాయని తెలిపింది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని జ్వర బాధితులకు చికిత్స అందించడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కొవిడ్‌ బాధితుల్లో ఇతర ఇన్‌ఫెక్షన్ల(Infections) ప్రభావం, తొలిదశలో గుర్తించడం, చికిత్సలపై ఇటీవల డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఏ జబ్బునూ తేలిగ్గా తీసుకోవద్దు

సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. ప్రాంతాలను బట్టి ఏయే వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవడం అవసరం. ఉదాహరణకు తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. హైదరాబాద్‌లో డెంగీ జ్వరాలెక్కువ. ఇలా ప్రాంతాలను బట్టి కొవిడ్‌తో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు(Infections) వచ్చే అవకాశాలను గుర్తించాలి. దేశంలో క్షయ కేసులు ఎక్కువ కాబట్టి.. జ్వరం తగ్గని సందర్భాల్లో క్షయ పరీక్ష చేయించాలి. కొవిడ్‌తో పాటు ఇతర జ్వరాలకు, ఇన్‌ఫెక్షన్లకు సంబంధించిన పరీక్షలు చేయించడం ముఖ్యం. ఇప్పటికే హెచ్‌ఐవీతో బాధపడుతుంటే.. కొవిడ్‌ వస్తే హెచ్‌ఐవీ చికిత్సను కొనసాగించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కొవిడ్‌ చికిత్స అనంతరం ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. తీవ్రస్థాయిలో విరుచుకుపడే ‘మ్యూకర్‌ మైకోసిస్‌’ కాకుండా ‘ఆస్పర్‌జిల్లోసిస్‌’, ‘క్యాండిడిమియా’, ‘క్రిప్టోకొక్కోసిస్‌’ వంటివి దాడి చేయొచ్చు. అయితే మ్యూకర్‌ మైకోసిస్‌ మాదిరిగా ఇతర ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తీవ్ర ప్రభావాన్ని చూపించవు. మలేరియా, డెంగీ, గన్యా, క్షయ, హెచ్‌ఐవీ తదితర ఇన్‌ఫెక్షన్ల(Infections) వ్యాప్తి నివారణ చర్యలను ఇంతకు ముందు మాదిరిగానే కొనసాగించాలి. ఏ జబ్బునూ తేలిగ్గా తీసుకోవద్దని సూచించింది.

చికిత్సలోనూ లోతైన విశ్లేషణ

ఏకకాలంలో కొవిడ్‌తో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డ వారిలో.. అవసరమైతే తప్ప యాంటీ బయాటిక్స్‌ను ఇవ్వకూడదు. వీరిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ల(Infections) రూపంలో బ్యాక్టీరియా దాడి చేసిన సందర్భాల్లో.. లేదా ఎవరిలోనైతే దాడి చేసే అవకాశాలుంటాయో.. వారిలో మాత్రం ముందస్తుగా యాంటీ బయాటిక్స్‌ను ఉపయోగించాలి. ఉదాహరణకు 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో, ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఇలాంటి ముప్పు తీవ్రత అధికంగా ఉన్నవారిలో మాత్రమే ఇలా చేయాలి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌(Infections) అని గుర్తించినా కూడా కేవలం ఒకే రకమైన ఔషధాలను ఇస్తూ వెళ్లకూడదు. లక్షణాలు తగ్గకపోతే ‘కల్చర్‌’ పరీక్ష నిర్వహించాలి. తద్వారా బ్యాక్టీరియాను గుర్తించి, అందుకనుగుణంగా ఔషధాలను ఎంపిక చేసుకోవాలి. యాంటీ బయాటిక్స్‌ను కూడా 5-7 రోజులకు మించి వాడకూడదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. జబ్బు తగ్గకపోతే.. వివిధ కోణాల్లో విశ్లేషించాల్సి ఉంటుంది. ఇచ్చే యాంటీ బయాటిక్స్‌ డోసు సరిపోకపోవచ్చు. అంటే బ్యాక్టీరియా తీవ్ర స్థాయిలో ఉండొచ్చు. అసలిచ్చే ఔషధమే సరైనది కాకపోవచ్చు. అసలది బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ కూడా కాకపోవచ్చు. ఇలా పలు అంశాల్లోనూ విశ్లేషణ జరపాలని సూచించింది. సెకండరీ ఇన్‌ఫెక్షన్లుగా కేవలం బ్యాక్టీరియానే కాదు.. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.