ETV Bharat / city

100 రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతులు ఇచ్చాం: కేటీఆర్​‌

టీఎస్‌-బీపాస్‌కు మంచి స్పందన వస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి ఆన్‌లైన్‌లోనే అనుమతులిస్తున్నామన్నారు. ప్రారంభించిన 100 రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతి ఇచ్చినట్లు శాసనసభకు వివరించారు.

ktr
ktr
author img

By

Published : Mar 20, 2021, 1:38 PM IST

టీఎస్​ బీపాస్‌ ప్రారంభించిన వంద రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతి ఇచ్చామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ శాసనసభలో వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి.. 600 గజాల వరకు దరఖాస్తుల ఆధారంగా ఆన్‌లైన్‌ అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ఆన్‌లైన్‌లోనే ఆక్యూపెన్సీ సర్టిఫికెట్‌ జారీచేస్తున్నామని తెలిపారు.

హౌజింగ్‌ బోర్డులోని ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించామని కేటీఆర్‌ తెలిపారు. కేపీహెచ్​బీలో ఇళ్ల పునర్‌నిర్మాణానికి ఉచితంగా అనుమతులు కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేయగా.. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామకంఠం భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

100 రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతులు ఇచ్చాం: కేటీఆర్​

ఇదీ చదవండి : ఎలక్ట్రానిక్స్ తయారీకి గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తాం : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.