ETV Bharat / city

అందరి నేస్తం ఆకట్టుకునేలా.. టీవీఎస్​ మోపెడ్ - tvs xl 100 moped

రైతుకు పొలం పనుల నేస్తం. చిరువ్యాపారికి బరువుల్లో సాయం. మోస్తరు ప్రయాణాలకూ ముందుండేది. టీవీఎస్ ఎక్స్​ఎల్ 100. పల్లెటూళ్ల నుంచి పట్టణాలదాకా అందరికీ ఇష్టమైన ఈ మోపెడ్ కొత్తగా ముస్తాబై అప్​డేటెడ్​ వెర్షన్​తో వచ్చేసింది.

the TVS company introduced new moped with etfi technology
అందరి నేస్తం ఆకట్టుకునేలా.. టీవీఎస్​ మోపెడ్
author img

By

Published : Aug 28, 2020, 4:43 PM IST

తేలికైన రూపంతో, గణనీయంగా బరువు తగ్గి, ఎకో థ్రస్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్​(ఈటీఎఫ్​ఐ) అనే సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది టీవీఎస్​ మోపెడ్. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి ఒక్కరు ఇష్టపడే ఈ మోపెడ్ ప్రత్యేకతలేంటో చూద్దామా...

ఈటీఎఫ్​ఐ టెక్నాలజీతో బండి మైలేజీ అదనంగా 15 శాతం వస్తోందని చెబుతోంది టీవీఎస్. ఇంజిన్ సులభంగా ఆన్​ ఆఫ్ చేసేలా స్విచ్ ఇచ్చారు.

స్మార్ట్​ఫోన్ ఛార్జర్ సాకెట్, ఫ్యుయెల్ ఛార్జర్ ఇండికేటర్, డిజిటల్ టాకోమీటర్, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన హ్యాండిల్​బార్ కొత్త హంగులు, సింక్ బ్రేకింగ్​ టెక్నాలజీతో భద్రతకు పెద్దపీట వేశారు.

సీట్లను మరింత విశాలం చేసి రైడర్, పిలియన్​కి అనుకూలంగా మలిచారు. 16 అంగుళాల చక్రాలు, సైలెన్సర్ గార్డ్, ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, సస్పెన్షన్​ ష్రౌడ్స్​కి క్రోమ్ తరహా తళుకులు అద్దారు. ఐ-టచ్ స్టార్ట్​తో ఇంజిన్​ ఆన్​ అయిన సంగతే తెలియదు. అంత స్మూత్​గా ఉంటుంది. కూల్ మింట్ బ్లూ, లస్టర్ గోల్డ్, స్పార్క్లింగ్​ సిల్వర్ మూడు రంగుల్లో లభ్యమవుతోంది.

సాంకేతికాంశాలు

99.7 సీసీ

ఫోర్​స్ట్రోక్ ఇంజిన్

4.3 బీహెచ్​పీ

6.5 ఎన్​ఎం టార్క్

ధరలు

ఎక్స్​ఎల్ 100 హెవీడ్యూటీ ఐ టచ్​ స్టార్ట్ - రూ.43,504

ఎక్స్​ఎల్​ 100 హెవీడ్యూటీ ఐ టచ్​ స్టార్ట్ స్పెషల్​ ఎడిషన్ - రూ.44,744

ఎక్స్​ఎల్ 100 కంఫర్ట్ ఐ టచ్ స్టార్ట్- రూ.45,074

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.