Dalit Bandhu Scheme: పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు దళితబంధు పథకంలో లబ్ధిదారులను ప్రోత్సహించాలని సర్కార్ నిర్ణయించింది. పరిశ్రమల శాఖ ద్వారా లబ్ధిదారులకు అవగాహన శిబిరాల నిర్వహణకు ఆదేశించింది. ఇందులో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్), కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఎంఈడీఐ)ల భాగస్వామ్యం తీసుకోవాలని నిర్దేశించింది.
సోమవారం హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ ఆడిటోరియంలో అవగాహన సదస్సును పరిశ్రమల శాఖ నిర్వహించింది. హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి 120 మంది లబ్ధిదారులు ఇందులో పాల్గొన్నారు.
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అదనపు అభివృద్ధి కమిషనర్ చంద్రశేఖర్, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, దళిత అధ్యయనాల సంస్థ ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, టిఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, కార్యదర్శి గోపాల్‌రావు, పరిశ్రమల కేంద్రం కరీంనగర్ జనరల్ మేనేజర్ నవీన్‌కుమార్, దళితబంధు సమన్వయ కర్త గణపతి రావు పాల్గొని ప్రసంగించారు. మిగిలిన రంగాల కంటే పరిశ్రమలు లబ్ధిదారులకు ఎంతో లాభదాయకమైనవని, ప్రభుత్వం ఇచ్చే నిధులతో పరిశ్రమలను ఏర్పాటు చేసే సౌకర్యం ఉందని సుధీర్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:పుస్తకాలు పెట్టేద్దాం.. కొలువులు కొట్టేద్దాం