ETV Bharat / city

వరదల్లో చిక్కుకున్న విద్యార్థినులు సురక్షితం

అధికారులు, ప్రజల తక్షణ స్పందన 600 మంది విద్యార్థుల ప్రాణాలు నిలబెట్టింది. చుట్టూ నీరు... ఎటు వెళ్లాలో తెలియ నరకయాతన అనుభవించిన విద్యార్థులకు ఉపశమనం కలిగించారు.

వరదల్లో చిక్కుకున్న విద్యార్థినిలు సురక్షితం
author img

By

Published : Sep 16, 2019, 11:15 AM IST

Updated : Sep 16, 2019, 11:56 AM IST

ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పడకండ్ల బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గురుకుల పాఠశాల పక్కనే ఉన్న ఏరు పొంగి ప్రవహించింది. ఈ ప్రవాహంతో వరద నీరు గురుకులంలోకి చేరింది. విద్యార్థులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారితోపాటు పాఠశాల సిబ్బంది ఉండిపోయారు. ప్రసార మాధ్యమాల ద్వారా విషయం తెెలుసుకున్న ఉన్నతాధికారులు... ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఆ బస్సు కూడా వరదల్లో చిక్కుకుంది. పక్కనే ఉన్న గ్రామస్థులతో కలిసి ప్రత్యేకంగా నిచ్చెనలు ఏర్పాటు చేసి... పాఠశాల్లో ప్రవేశించారు. ఒక్కో విద్యార్థిని పక్కనే ఉన్న ప్రైవేటు పాఠశాలకు తరలించారు. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. సకాలంలో ప్రజలు, అధికారుల స్పందనతో 600 మంది విద్యార్థినులకు ప్రమాదం తప్పింది.

ఇవీ చదవండి

గోదావరిలో 300 అడుగుల లోతులో బోటు ఆచూకీ!

Intro:వైస్సార్ భీమా చెక్కులు పంపిణీ-పాల్గున్న ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో వైస్సార్ భీమా చెక్కులు పంపిణీలో పాల్గున్న ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రమాదం లో నష్టపోయిన 32 మంది లబ్ధిదారులకు 19 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Conclusion:వైస్సార్ భీమా చెక్కులు పంపిణీ-పాల్గున్న ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి
Last Updated : Sep 16, 2019, 11:56 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.