టీకా కొరత కారణంగా సోమవారం నుంచి కొవాగ్జిన్ రెండో డోసు వాయిదా వేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటన చేసింది. 45 ఏళ్లు పైబడిన వారికి తాత్కాలికంగా వ్యాక్సిన్ ప్రక్రియ నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్రం నుంచి నిర్దేశిత కోటా ప్రకారం రావాల్సిన టీకాలు అందకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. వ్యాక్సినేషన్ ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.
ఇవీచూడండి: కొవిషీల్డ్ రెండో డోసుపై కేంద్రం కీలక ప్రకటన