ETV Bharat / city

Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే - ap news

ఏపీ రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో రెండో రోజు విచారణ ముగిసింది. రాజధాని కోసం జీవనోపాధిని త్యాగం చేసిన రైతులకు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని అని గుర్తు చేశారు. తదుపరి వాదనలు బుధవారానికి వాయిదా పడ్డాయి.

Amaravati Cases
Amaravati Cases
author img

By

Published : Nov 16, 2021, 5:56 PM IST

ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టులో రెండోరోజు వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా అమరావతిపై హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కీలక వ్యాఖ్యలు (High Court CJ Key Comments On Amaravati news) చేశారు. 30 వేలమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని స్పష్టం చేశారు. అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని అని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి.. విశాఖ, కర్నూలు సహా అందరిదీ అని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు తమ కోసమే పోరాడలేదన్న ప్రధాన న్యాయమూర్తి.. దేశ ప్రజలందరి కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు.

30 వేలమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని. అమరావతి.. విశాఖ, కర్నూలు సహా అందరిదీ. స్వాతంత్య్ర సమరయోధులు తమ కోసమే పోరాడలేదు.. దేశ ప్రజలందరి కోసం పోరాడారు' - హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర

ఇవాళ ఉదయం.. రైతుల తరపున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు(Senior Advocates Shyam Divan). అమరావతికి సంబంధించిన కీలకాంశాలు కోర్టు దృష్టికి తెచ్చారు. రాజధాని కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో అమరావతి దెయ్యాల రాజధానిగా మారిందన్నారు. అమరావతిని త్వరగా అభివృద్ధి చేసి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆత్మను వేరు చేయడమే...

రాజధాని కేసులపై సోమవారం నుంచే రోజువారీ విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపించారు. లోతైన అధ్యయనం తర్వాతే అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించారని, నిర్మాణం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేశారని, ఈ నేపథ్యంలో మూడు రాజధానుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడానికి వీల్లేదని ప్రస్తావించారు. ఏపీ విభజన చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నూతన రాజధాని విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. ఆ కమిటీ అధ్యయనంలో 52 శాతం ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్య, 10.72 శాతం మంది విశాఖపట్నం వద్ద రాజధానికి మద్దతు తెలిపారన్నారు. ఆ తర్వాతే అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దాన్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించాలన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. మూడు రాజధానుల శాసనం చేసే అధికారం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. శాస్త్రీయ అధ్యయనం చేసి చట్టబద్ధంగా రూపొందించిన అమరావతి మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయకపోతే అమరావతి ఆత్మను తీసేసినట్లేనన్నారు. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు విచారణను కోర్టు.. మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: AP CM JAGAN : ఏపీలో గులాబ్‌ తుపాను బాధిత రైతులకు రూ.22 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.