ETV Bharat / city

అందరూ ఇంట్లో ఉండిపోతే చెత్త ఎవరు తీస్తారు

ఎక్కడ విన్నా పారిశుద్ధ్య కార్మికులు ప్రస్తావనే ఇప్పుడు.. అందరూ ఇళ్లలో ఉంటే వారు మాత్రం తమ పనులను కొనసాగిస్తూ అందరిచే అభినందనలు పొందుతున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పారిశుద్ధ్య కార్మికుల పాదాలను స్వయంగా కడగి, వస్త్రంతో శుభ్రం చేశారు. వారి శ్రమను గుర్తించి పలువురు వారికి రకరకాలుగా సాయం చేస్తున్నారు.

The sanctuary army is a constant sacrifice in telangana
అందరూ ఇంట్లో ఉండిపోతే చెత్త ఎవరు తీస్తారు
author img

By

Published : Apr 5, 2020, 10:14 AM IST

ప్రజారోగ్యమే వారి లక్ష్యం.. పారిశుద్ధ్యమే వారి జీవనం... లాక్‌డౌన్‌ ప్రభావంతో జనం ఇళ్లకే పరిమితమైనా అందరి ఆరోగ్యమే లక్ష్యంగా వారు శ్రమిస్తున్నారు. ఒక్క రోజు కూడా విధులకు దూరం కాకుండా పనిచేస్తున్నారు. అత్యంత అపరిశుభ్రమైన ప్రాంతాలను అద్దంలా మారుస్తున్నారు. సుమారు కోటిమంది నివసిస్తున్న హైదరాబాద్‌ మహానగరంలో 21 వేలమందికిపైగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. పది లక్షల జనాభా ఉన్న వరంగల్‌ నగరంలో 2,650 మంది, రాష్ట్రంలోనే మూడో పెద్దనగరమైన కరీంనగర్‌లో వెయ్యిమంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇతర నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేలమంది పారిశుద్ధ్య కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేలమంది ఈ విధుల్లో నిమగ్నమయ్యారు.

ప్రజారోగ్యమే లక్ష్యంగా..

పారిశుద్ధ్య కార్మికులు నిత్యం రోడ్లను, వీధులను శుభ్రం చేస్తూ, చెత్త తొలగిస్తూ, రసాయనాలను వెదజల్లుతూ, మురుగునీటి కాలువలను శుభ్రం చేస్తూ, వేల టన్నుల చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలిస్తూ శ్రమిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతోపాటు చెత్తను డంపింగ్‌ యార్డులకు వాహన సిబ్బంది తరలించేవారు. డ్రైవర్లు, కార్మికులు, పురపాలక అధికార యంత్రాంగం ప్రత్యేక క్రతువులో భాగస్వామ్యులుగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన పట్టణ ప్రగతిలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఇప్పుడు ఉపయోగపడుతోందని పురపాలకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని పురపాలక ఉన్నతాధికారి ఒకరు ప్రశంసించారు. పురపాలకశాఖ మాస్క్‌లు, శానిటైజర్లు, కీలకమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారికి గ్లౌజ్‌లు, బూట్లు, రక్షణ సూట్లు ఇవ్వడం పారిశుద్ధ్య కార్మికులను సంతృప్తిపరుస్తోంది.

మేం ఇళ్లలో ఉండిపోతే చెత్త ఎవరు తీస్తారు?

గత కొన్నేళ్లుగా ఇదే పనిలో ఉన్నానని కరోనా.. ఎవరూ ఇల్లు కదలొద్దని అంటున్నారని జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలు యాదమ్మ చెబుతున్నారు. అలా అని అందరూ ఇంట్లో ఉండిపోతే ఈ చెత్త ఎవరు తీస్తారు.. ప్రజలకు కష్టమొచ్చినపుడే కదా? మేం పనిచేయాలి? అందుకే చెత్త ఊడ్చటం మానలేదు’’ అని ఆమె చెప్పారు.

ఇదీ చూడండి : గాంధీ నుంచి 15 మంది కరోనా బాధితులు డిశ్ఛార్జి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.