ఏపీ కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెనుక జలాల నుంచి సంగమేశ్వర ఆలయం క్రమంగా బయటపడుతోంది. సంగమేశ్వరం శిఖరానికి ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 861 అడుగులుగా ఉంది. 838 అడుగులకు నీటిమట్టం తగ్గినట్లైతే ఆలయం పూర్తిగా దర్శనమిస్తుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
ఇవీచూడండి: అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు