ETV Bharat / city

సీఎం పదవి శాశ్వతం కాదు.. గుర్తుంచుకో: వీహెచ్​ - telangana news

హాలియా బహిరంగసభలో కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నేత వి. హనుమంతరావు ఖండించారు. సీఎం పదవి శాశ్వతం కాదని... ప్రజల ఆలోచన మేరకే అధికారం ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్​ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

The remarks made by cm kcr against the Congress were condemn by V. Hanumantharao
సీఎం పదవి శాశ్వతం కాదు.. గుర్తుంచుకో: వీహెచ్​
author img

By

Published : Feb 11, 2021, 5:45 PM IST

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. సీఎం పదవిని కించపరుస్తూ కేసీఆర్​ మాట్లాడడం.. హాలియా సభలో కాంగ్రెస్​పై అసభ్య పదజాలం ఉపయోగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభలు మీరు మాత్రమే పెట్టుకోవచ్చా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని... ప్రజల ఆలోచన మేరకే అధికారం ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్​ గుర్తుంచుకోవాలన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ వరాలు ప్రకటిస్తున్నారని.. మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని వీహెచ్​ ప్రశ్నించారు.

ఇదీ చూడండి: పురపాలిక, కార్పొరేషన్ల ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.