ETV Bharat / city

ఆ బస్‌ నడిపితే నా కోరిక నెరవేరినట్లే!

author img

By

Published : Apr 4, 2021, 7:31 PM IST

‘నా లాంటి ఎందరో అమ్మాయిలు విమానాలు నడుపుతున్నారు. రాకెట్లలో అంతరిక్షంలోకి వెళుతున్నారు. అలాంటిది ఈ బస్సు నడపడంలో వింతేముంది? త్వరలో మీరు నన్ను వోల్వో బస్సు డ్రైవర్‌గా కూడా చూస్తారు’...ఇవి హిమాచల్‌ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఆర్‌టీసీ)కి చెందిన ఏకైక మహిళా బస్సు డ్రైవర్‌ సీమా ఠాకూర్‌ తన బస్సెక్కిన ప్రయాణికులతో చెబుతోన్న మాటలు. ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె ఐదేళ్ల క్రితం హెచ్‌ఆర్‌టీసీ డ్రైవర్‌గా ఎంపికయ్యారు. ఆర్టీసీ ట్యాక్సీలు, బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులన్నీ నడిపింది. తాజాగా సిమ్లా-చండీగఢ్‌ మధ్య అంతర్రాష్ట్ర బస్‌ సర్వీస్‌ను కూడా నడిపింది. తద్వారా ఈ ఘనత సాధించిన ఆ రాష్ట్ర తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇంతకీ ఎవరామె? ఎం.ఏ పట్టా ఉన్నా బస్‌ స్టీరింగ్‌ ఎందుకు పట్టుకుందో తెలుసుకుందాం రండి...

the only woman bus driver in Himachal Road Transport Corporation
ఆ బస్‌ నడిపితే నా కోరిక నెరవేరినట్లే!

తండ్రి బాటలోనే!

31 ఏళ్ల సీమా ఠాకూర్‌ది సోలన్‌ జిల్లాలోని ఆర్కి అనే గ్రామం. అక్కడి స్థానిక కాలేజీలో బీఏ పూర్తి చేసిన ఆమె ఆంగ్లంలో ఎం.ఏ పట్టా కూడా అందుకుంది. అయితే తండ్రి హెచ్‌ఆర్‌టీసీ డ్రైవర్‌ కావడంతో చిన్నప్పటి నుంచే డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకుంది సీమ. ఈక్రమంలో హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా సాధించింది. డ్రైవింగ్‌లో ఆమె నైపుణ్యాన్ని గుర్తించిన హెచ్‌ఆర్‌టీసీ ఐదేళ్ల క్రితం ఆమెను ఆర్టీసీ డ్రైవర్‌గా నియమించింది. మొత్తం 8,800 మంది ఉద్యోగులున్న హెచ్‌ఆర్‌టీసీలో ఏకైక మహిళా డ్రైవర్‌ సీమానే కావడం విశేషం. విధుల్లో భాగంగా తొలుత రాష్ట్ర రాజధాని నగరంలో ఆర్టీసీ ట్యాక్సీలను నడిపిందామె. ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు, సిమ్లా-సోలన్‌ మార్గంలో ఎలక్ర్టిక్‌ బస్సులు కూడా నడిపింది.

ఎంతో గర్వంగా ఉంది!

ఇప్పటివరకు స్వరాష్ట్రంలోనే విధులు నిర్వర్తించిన సీమ తాజాగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసును కూడా నడిపింది. సిమ్లా-చండీగఢ్‌ మధ్య ఏర్పాటుచేసిన ఇంటర్‌ స్టేట్‌ బస్‌కు డ్రైవర్‌గా వ్యవహరించిన ఆమె ఈ ఘనత సాధించిన ఆ రాష్ట్ర మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా ఉదయం 7.55 గంటలకు సిమ్లాలో ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరిన ఆమె మధ్యాహ్నం 12 గంటల కల్లా చండీగఢ్‌ చేరుకుంది. ఆ తర్వాత అక్కడి ప్రయాణికులను ఎక్కించుకుని రాత్రి 12.30 కల్లా సిమ్లా చేరుకుంది. ‘సిమ్లా-సోలన్‌ మార్గంలో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతున్నాను. ఇప్పుడు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే అవకాశం వచ్చినందుకు ఎంతో గర్వంగానూ, సంతోషంగానూ ఉంది. ఇది నాకో గొప్ప అనుభవం. సిమ్లా-చండీగఢ్‌ మార్గంలో బస్‌ నడపాలంటే కొంచెం సవాలుతో కూడుకున్నదని చాలామంది చెబుతుంటారు. డ్రైవింగ్‌లో ఎంతో నైపుణ్యం ఉన్న వారు కూడా తప్పులు చేస్తుంటారు. నేను ఈ మార్గంలో డ్రైవింగ్‌ చేయకపోయినా మూడుసార్లు ప్రయాణించాను. దీంతో కొద్దిగా ఈ మార్గంపై అవగాహన వచ్చింది. తాజాగా ఆర్టీసీ యాజమాన్యం అవకాశం ఇవ్వడంతో ఆ మార్గంలో బస్‌ డ్రైవర్‌గా వ్యవహరించాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ లేడీ డ్రైవర్‌.

ఆ బస్‌ నడిపితే నా కోరిక నెరవేరినట్లే!

హెచ్‌ఆర్‌టీసీలో ఏకైక మహిళా డ్రైవర్‌గా అందరి మన్ననలు అందుకుంటోన్న సీమా.. వోల్వో బస్‌ నడపడమే తన లక్ష్యమంటోంది. ‘నా లాంటి అమ్మాయిలు విమానాలు నడుపుతున్నారు. రాకెట్లలో ఆకాశానికి వెళుతున్నారు. అలాంటిది నేను ఈ బస్సు నడపడంలో వింతేముంది..! సిమ్లా-దిల్లీ మార్గంలో వోల్వో బస్సును నడపాలని నా కోరిక. అందుకు తగ్గట్టే వోల్వో బస్‌ డ్రైవింగ్‌ శిక్షణ కోసం ఇక్కడి డ్రైవర్లలో కొందరిని త్వరలో బెంగళూరుకు పంపిస్తున్నారు. అందులో ఎంపికైతే నా కోరిక నెరవేరినట్లే’ అని అంటోందీ మహిళా డ్రైవర్‌.

కచ్చితంగా ఆమె పేరును ప్రతిపాదిస్తాం!

ఇక ఆర్టీసీ అధికారులు, కండక్టర్లు కూడా సీమ డ్రైవింగ్‌ స్కిల్క్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఆమె పురుషులతో సమానంగా వాహనాలు నడుపుతోంది. ఇక బస్సెక్కిన ప్రయాణికులు డ్రైవర్‌ సీట్లో కూర్చొన్న తన గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. వోల్వో బస్‌ డ్రైవింగ్‌ శిక్షణ కోసం ఇక్కడి డ్రైవర్లలో కొందరిని బెంగళూరు హెడ్‌ క్వార్టర్ట్‌కు పంపాలని ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలు అందాయి. అందులో కచ్చితంగా సీమా పేరును కూడా ప్రతిపాదిస్తాం’ అని ఓ ఉన్నతాధికారి ఆమె గురించి చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: దంపతుల మధ్య సమస్యలకు పరిష్కారం ఇలా సాధ్యం...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.