ETV Bharat / city

నడిరోడ్డులో నాన్న కథ విషాదాంతం...! - Lakshmipuram bus stop old man news

ఆ వృద్ధుడు అయినవారికి భారమయ్యాడు. కన్న కొడుకు, కూతురు పట్టించుకోలేదు. ముదిమి వయసులో బస్టాప్​లో పది రోజుల పాటు నరకయాతన అనుభవించాడు. అతని దీనస్థితిని ఈనాడు-ఈటీవీ కథనాల రూపంలో వెలుగులోకి తీసుకొచ్చింది. పోలీసుల ఒత్తిడితో మనసు మార్చుకున్న కుమార్తె తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లింది. ఆ వృద్ధునికి ఆసరా దొరికింది అనుకునే లోపే అతను చనిపోయాడు. కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు.

గుట్టు చప్పుడు కాకుండా తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన కుటుంబసభ్యులు
author img

By

Published : Oct 26, 2019, 12:56 AM IST

కృష్ణాజిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం బస్​స్టాప్​లో కొద్ది రోజుల ముందు జీవచ్ఛవంలా పడి ఉన్న వృద్ధుడు వేముల రామ నరసింహం మరణించాడు. దీనస్థితిలో ఉన్న అతని గురించి ఈనాడు-ఈటీవీ కథనాల రూపంలో వెలుగులోకి తెచ్చింది. పోలీసుల ఒత్తిడితో రామ నరసింహం కుమార్తె అతన్ని ఇంటికి తీసుకెళ్లింది. అయితే తన సోదరుడు తండ్రిని చూడడం లేదని ఆమె రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కుమారున్ని చరవాణిలో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. గురువారం రామ నరసింహం తుది శ్వాస విడిచాడు. వృద్ధుడు చనిపోవడంపై కుటుంబ సభ్యులు కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. గుట్టుచప్పుడు కాకుండా తిరువూరులో అంత్యక్రియలు పూర్తి చేశారు.

గుట్టు చప్పుడు కాకుండా తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన కుటుంబసభ్యులు

ఇవీ చూడండి : 'సీఎం కేసీఆర్​ ప్రతీ మాటలో గెలుపు అహంకారమే...'

Intro:ap_vja_19_25_naanna_kadha_vishaadhamtham_tiruvuru_av_ap10125

note సార్ ఈ విజువల్స్ అన్ని ఫైల్ షాట్స్

విషాదంగా ముగిసిన నాన్న కథ

ముదిమి వయసులో కన్నవారికి దూరమై బస్టాప్ లో పది రోజుల పాటు నరకయాతన అనుభవించి చివరికి కుమార్తె పంచన చేరిన నాన్న కథ విషాదంగా ముగిసింది కృష్ణాజిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం బస్ స్టాప్ లో జీవచ్ఛవంలా పడి ఉన్న వృద్ధుడు వేముల రామ నరసింహం దీన స్థితిని ఈనాడు ఈ టీవీ కథనాల రూపంలో వెలుగులోకి తీసుకువచ్చింది పోలీసుల ఒత్తిడి మేరకు మనసు మార్చుకున్న కుమార్తె జాతీయ రహదారి పక్కన బస్టాప్ లో అనాధగా పడిఉన్న తండ్రిని ఇంటికి తీసుకెళ్లింది తన తండ్రిని నీ సోదరుడు పట్టించుకోవడంలేదని 2 రోజుల క్రితం కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది కుమార్ ఇచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు కుమారుని సంప్రదించగా స్పందన కొరవడింది ఈ నేపథ్యంలో ఏం జరిగిందో ఏమోగానీ పెద్దాయన రామ నరసింహం గురువారం తుది శ్వాస విడిచాడు పోలీసులకు కనీస సమాచారం అందించని కుటుంబ సభ్యులు తిరువూరు swargapuri లో గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు ఖమ్మం జిల్లా రామనగర్ లో ఉంటున్న కుమారుడు తిరువూరు వచ్చి తల కొరివి పెట్టినట్టు బంధువులు తెలిపారు కన్నవారి ఆలనా పాలన కు దూరమై వృద్ధాప్యంలో మంచం పట్టి ఇ అవస్థలు పడే కన్నా తిరిగిరాని లోకాలకు చేరుకోవడమే ఉత్తమం అంటూ పలువురు నిట్టూర్చారు

Body:విషాదంగా ముగిసిన నాన్న కథ

Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709, 8500544088

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.