Milan-2022: మిలాన్-2022లో భాగంగా విశాఖ సాగర తీరంలో జరుగుతున్న యుద్ధ విన్యాసాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బంగాళాఖాతంలో లక్ష్యాన్ని ఛేదించే క్షిపణులు, టార్పెడో ప్రయోగాలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో సాగుతున్నాయి. సరికొత్త అనుభూతుల్ని పంచుతున్నాయి. భారత నౌకాదళానికి చెందిన రాణా, సుకన్య, విదేశీ నౌకలు ఆర్ఎస్ఎస్ టెనాకొయిస్, యూఎస్ఎన్ఎన్ ఫిట్జ్ గెరాల్డ్‌లతో కలిసి అబ్బురపరిచే విన్యాసాలు చేశాయి. పరస్పర సహకారం, దేశాల మధ్య నేవీ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న మిలన్ విన్యాసాలు రేపటితో ముగియనున్నాయి.
ఇదీ చదవండి: