పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తన ఇంటిలోని నీటి నిల్వలను తొలగించారు. దోమల నివారణకు యాంటి లార్వా మందును తన సతీమణితో కలిసి పిచికారి చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా తమ ఇళ్లలోని నీటి నిల్వలను తొలగించుకోవాలని నగర వాసులకు మేయర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: నగరంలో రోడ్డు మరమ్మతులపై మేయర్ పర్యవేక్షణ