నెహ్రూ జూలాజికల్ పార్క్లో సింహాన్ని ఓ ఇంటర్ విద్యార్థిని దత్తత తీసుకున్నారు. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. గంజి అక్షితారావ్ అనే విద్యార్థిని తన దివంగత తాత జి.మనోహర్ రావు జ్ఞాపకార్థం ఆడ ఆఫ్రికన్ సింహాన్ని దత్తత తీసుకుంటున్నట్లు అక్షితారావ్ వెల్లడించారు.
ఈ మేరకు ఏడాది పాటు సింహం దత్తతకు లక్ష రూపాయల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారిని క్షితిజకు అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఏడు ఆసియా సింహలు ఉన్నాయి.
ఇదీ చూడండి : రేపటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలకు అనుమతి