ETV Bharat / city

agrigold victims: నేడు అగ్రి గోల్డ్‌ బాధితులకు నగదు చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం - నేడు అగ్రి గోల్డ్‌ బాధితులకు నగదు చెల్లించనున్న ప్రభుత్వం

నేడు అగ్రి గోల్డ్‌ బాధితులకు ఏపీ ప్రభుత్వం నగదు చెల్లించబోతోంది. రూ.10 వేలలోపు డిపాజిటర్లకు రూ.207.61 కోట్లు, రూ. 20 వేలలోపు డిపాజిటర్లకు రూ.459.23 కోట్లు చెల్లింపులు చేయనుంది.

the-government-will-pay-cash-to-the-agri-gold-victims
నేడు అగ్రి గోల్డ్‌ బాధితులకు నగదు చెల్లించనున్న ప్రభుత్వం
author img

By

Published : Aug 24, 2021, 7:24 AM IST

అగ్రి గోల్డ్‌ బాధితులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేడు నగదు చెల్లించనుంది. బాధితుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జగన్ నగదు జమ చేయనున్నారు. రూ.10 వేల లోపు డిపాజిటర్లకు రూ.207.61 కోట్లు, రూ. 20 వేలలోపు డిపాజిటర్లకు రూ.459.23 కోట్ల చెల్లింపులు చేయనున్నారు. 7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్‌ బాధితులకు మొత్తం రూ.666.84 కోట్లు చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించింది. 2019 నవంబరులో 3.40 లక్షల మంది బాధితులకు రూ.238.73 కోట్లు ఇచ్చామని.. ఆ మొత్తాన్నీ కలిపితే ఇప్పటివరకూ 10.40 లక్షల మంది బాధితులకు రూ.905.57 కోట్లు చెల్లించినట్లవుతుందని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు... వాలంటీర్లు, సచివాలయాల ద్వారా బాధితుల్ని గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి చెల్లింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.

అగ్రిగోల్డ్‌ భూముల్ని ప్రభుత్వమే అమ్మించి.. తనకు రావాల్సిన సొమ్ము తీసుకుని మిగతాది డిపాజిట్‌దారులకు ఇవ్వనున్నట్లు వివరించింది. రూ.20వేలలోపు డిపాజిట్‌ చేసిన బాధితుల సంఖ్యను రూ.8.79 లక్షల మందిగా తేల్చిన గత ప్రభుత్వం వారికి రూ.785 కోట్లు చెల్లించాలని నిర్ధారించిందని, అయినా ఒక్క రూపాయీ ఇవ్వలేదని పేర్కొంది.

తమ డబ్బుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న అగ్రిగోల్ట్ బాధితులకు తామే సొమ్ము చెల్లిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసినవారిలో అధికశాతం మందికి డబ్బులు చెల్లించారు కూడా. కానీ రెండేళ్లు గడుస్తున్నా రూ.10 వేల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేసినవారికి చెల్లింపులు చేయలేదు. ఇన్నాళ్లకు రూ.10 వేల లోపు డిపాజిటర్లకు రూ.207.61 కోట్లు, రూ. 20 వేలలోపు డిపాజిటర్లకు రూ.459.23 కోట్ల చెల్లింపులు చేయనున్నారు.

20 వేల లోపు కట్టిన వారు...

  • రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన మొత్తం ఖాతాదారులు 13 లక్షలు. వీరికి చెల్లించేందుకు రూ.1,150 కోట్లు అవుతుందని అంచనా.
  • 20వేల లోపు కట్టిన బాధితుల్లో సాయం పొందాల్సినవారు 9.64 లక్షల మంది. వీరికి రూ.916 కోట్ల వరకూ ఇవ్వాలి.
  • కానీ ప్రభుత్వం 20 వేలలోపు డిపాజిటర్లకు రూ.459.23 కోట్ల చెల్లింపులు చేయనున్నారు.
  • వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ 3.36 లక్షల మందికి రూ.234 కోట్లు చెల్లించారు.
  • ప్రస్తుతం రూ.10 వేల లోపు డిపాజిటర్లకు రూ.207.61 కోట్లు చెల్లించబోతోంది.

ఇదీ చూడండి: agrigold victims: అగ్రిగోల్డ్‌ బాధితులకు తీరని వేదన

ఇదీ చూడండి: ACCIDENT: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.