ETV Bharat / city

Land Sales: మరో విడత భూముల అమ్మకానికి సిద్ధమవుతోన్న సర్కార్ - తెలంగాణ వార్తలు

మరో విడత భూముల అమ్మకానికి సర్కార్ సిద్ధమవుతోంది. మొదటి దఫాలో మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా మరోమారు భూములు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల అమ్మకం ద్వారా రూ.పదివేల కోట్ల నిధులు రాబట్టుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

Land Sales
Land Sales
author img

By

Published : Jul 18, 2021, 5:15 AM IST

కరోనాతో కోల్పోయిన ఆదాయాన్ని సమీకరించుకునేందుకు నిరుపయోగంగా ఉన్న భూముల విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2021-22 వార్షిక బడ్జెట్​లో భూముల అమ్మకం ద్వారా రూ.16 వేల కోట్ల నిధులు సమీకరించుకోవాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది. కొవిడ్ రెండో అల ప్రభావంతో ఆ ప్రణాళికలను వెంటనే అమలు చేయలేకపోయింది. వైరస్ ఉధృతి తగ్గి సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తరుణంలో భూముల అమ్మకాన్ని ప్రారంభించింది. ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన భూముల అమ్మకాన్ని చేపట్టింది.

రూ.2,700కోట్లకు పైగా ఆదాయం..

నిరుపయోగంగా ఉన్న, విక్రయించేందుకు అనువుగా ఉన్న భూములను ఇప్పటికే అధికారులు గుర్తించారు. దశల వారీగా భూముల అమ్మకాన్ని చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... ఇటీవలే మొదటి విడత భూముల విక్రయాన్ని పూర్తి చేసింది. తొలి విడతలో భాగంగా 65 ఎకరాల భూములను విక్రయించింది. కోకాపేట భూములు సగటున రూ.40 కోట్లు, ఖానామెట్ భూములు సగటున రూ.48 కోట్లకు పైగా ధర పలికాయి. రికార్డు స్థాయిలో ఎకరా ఏకంగా రూ.60 కోట్ల మార్కును దాటింది. మొత్తంగా 65 ఎకరాల భూముల అమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,700కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

త్వరలోనే మరో దఫా..

మొదటి దశ భూముల అమ్మకానికి మంచి స్పందన వచ్చిందని... డిమాండ్ బాగా ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తొలివిడత స్పందనతో త్వరలోనే మరో దఫా భూముల అమ్మకాన్ని చేపట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే భూములను గుర్తించినందున అందులో కొన్నింటిని వీలైనంత త్వరగా విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

రూ.పదివేల కోట్ల రాబడే లక్ష్యం

ఈ ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.పదివేల కోట్లు సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. అందుకు అనుగుణంగా దశల వారీగా భూముల అమ్మకాన్ని చేపట్టనున్నారు.

3 ఏళ్లు..3 సార్లు..రూ.3300 కోట్లు

విశ్వనగరమే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు సొంతంగానే నిధులు సమకూర్చుకోవాలని భావించింది. దీంతో అప్పట్లో హెచ్‌ఎండీఏ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని లేఅవుట్లను అభివృద్ధి చేసి విక్రయించింది. వీటిలో కొన్ని ప్లాట్లు అమ్ముడుకాక మిగిలిపోయాయి. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి 210 ప్లాట్లను గుర్తించారు. 2018 ఏప్రిల్‌లో ఈ-వేలం నిర్వహించగా భారీ స్పందన వచ్చింది. రూ.350 కోట్లకు 189 ప్లాట్లు అమ్ముడుపోయాయి. కొందరు డబ్బులు చెల్లించేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా రూ.350 కోట్లకు గాను రూ.300 కోట్లు ఖజానాకు చేరింది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద హెచ్‌ఎండీఏ అప్పట్లో ఉప్పల్‌ భగాయత్‌లో 400 ఎకరాల్లో ఫేజ్‌-1 కింద భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది.మరో 70 ఎకరాల్లో ఫేజ్‌-2 లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. రెండు దశల్లో నిర్వహించిన ఈ-వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.1,050 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

ఇదీ చదవండి : Real Estate : రియల్​ రంగం చూపు.. భాగ్యనగరం వైపు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.