ETV Bharat / city

Omicron Case in AP : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు

author img

By

Published : Dec 12, 2021, 11:36 AM IST

Updated : Dec 13, 2021, 8:02 AM IST

Omicron in AP
Omicron in AP

11:34 December 12

Omicron Case in AP : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron in AP
ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన ప్రెస్​నోట్​

OMICRON CASE IN AP :ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ ఆంధ్రప్రదేశ్​లోకి వచ్చేసింది. తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైనట్లు వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. 34 ఏళ్ల యువకుడికి వేరియంట్‌ నిర్ధారణ అయింది. బాధితుడు ఆరోగ్యవంతంగా ఉండడం యంత్రాంగానికి ఊరటనిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ఆ యువకుడిని కలిసిన వారికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై నిఘా పెంచారు.

ఐర్లాండ్‌ నుంచి ముంబయి మీదుగా వచ్చిన విజయనగరం జిల్లా వాసిలో ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. ఏపీలో ఇదే తొలి ఒమిక్రాన్‌ కేసు. 34 ఏళ్ల యువకునికి వేరియంట్‌ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. ఆ యువకుడు ఐర్లాండ్‌ నుంచి ముంబయి మీదుగా విశాఖకు వచ్చారు. విమానాశ్రయంలో ఆర్​టీపీసీఆర్​ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. అతని నమూనాను జీనం సీక్వెన్సింగ్‌ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. పరీక్షల్లో ఒమిక్రాన్‌గా తేలినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ హైమావతి వెల్లడించారు. బాధితుడు ఆరోగ్యంగా ఉన్నారని....ఈనెల 11న మరోసారి ఆర్​టీపీసీఆర్ ద్వారా పరీక్ష చేయగా నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బాధితుడు ప్రథమ, ద్వితీయ కాంటాక్టు వ్యక్తులు సుమారు 40 మంది వరకు ఉన్నట్లు గుర్తించి వారికీ పరీక్షలు చేయగా...అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. విదేశాల నుంచి తిరుపతికి చేరిన మరొకరికి ఇటీవల చేసిన పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్లు ఆదివారమే ఖరారైంది. ఇతను ఆరోగ్యంగానే ఉన్నారని...మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైనట్లుగా జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు.

16 మందికి పాజిటివ్‌

విదేశాల నుంచి రాష్ట్ర చిరునామాతో 15వేల714 మంది వచ్చారని... వీరిలో కొందరు రాష్ట్రానికి రాగా.. మరికొందరు హైదరాబాద్‌,చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వారిలో 12వేల969 మంది వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సేకరించారు. వీరికి చేసిన ఆర్​టీపీసీఐర్​ టెస్టుల ద్వారా 16 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. అమెరికా, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా, సింగపూర్‌, యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో అనంతపురం జిల్లాలో మూడు, విజయనగరం -ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, కృష్ణా జిల్లాలో రెండు, కడపలో ఒకటి, నెల్లూరులో ఐదు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, తిరుపతిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

రాష్ట్రానికి వచ్చిన వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌

గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు కడప జిల్లా వాసితో సన్నిహితంగా ఉన్న వారుగా వైద్యాధికారులు చెబుతున్నారు. నెల్లూరులో నమోదైన కేసుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. విజయనగరం జిల్లాలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఒమిక్రాన్‌ నిర్ధారణైన వ్యక్తితో సహా అంతా ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మరికొందరి ఫలితాలు రావాల్సి ఉంది. నవంబరు 15 నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన వారంతా డిసెంబరు ఒకటి తర్వాత తర్వాత రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో సేకరించిన నమూనాలను సీసీఎంబీకి పంపుతుండగా....ఫలితాల వెల్లడికి కనీసం ఐదు రోజుల వరకు సమయం పడుతోంది. గతనెల 27న విజయనగరం జిల్లా వాసికి చేసిన ఆర్టీపీసీఐర్​ టెస్టులో పాజిటవ్‌ వచ్చింది. ఈ నమూనాను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం హైదరాబాద్‌కు పంపిస్తే ఒమిక్రాన్‌ ఉన్నట్లు శనివారం రాత్రికి వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం వచ్చింది.

విదేశీ ప్రయాణీకులపై ప్రత్యేక దృష్టి

కేంద్ర ప్రభుత్వం డిసెంబరు ఒకటి తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముందు జాగ్రత్తగా విదేశీ ప్రయాణికుల్లో నవంబరు 15 నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు. వీరిలోనే ఐదుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ రాగా.. ఒకటి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. వీరితో సన్నిహితంగా మెలిగిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవని... పరీక్షలు చేశామని అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి రాష్ట్ర చిరునామాలతో వచ్చిన వారి వివరాలు సేకరించి జిల్లా అధికారులకు పంపించి క్షేత్రస్థాయి సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉండడంతో వారి కదలికల కోసం ఆరా తీస్తున్నారు. ఏపీలోనూ తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైన తరుణంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న సమీక్షలో మున్ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.

జాగ్రత్తలు పాటించండి..
ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలిన వ్యక్తిలో ఎలాంటి లక్షణాలూ కనిపించ లేవని, ఇదే ఏపీలో తొలికేసని వైద్యశాఖ పేర్కొంది. ప్రజలు భయాందోళన చెందవద్దని, కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీచూడండి: Booster Dose: 'ఒమిక్రాన్​ వేళ.. వృద్ధులకు బూస్టర్‌ డోసులు ఇస్తే మేలే'

Last Updated : Dec 13, 2021, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.